ఇద్దరిని జైలుకు పంపుతాం: ఆప్ మంత్రి, అధికారికి కోర్టు వార్నింగ్

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్లినికల్ ల్యాబ్ లను నియంత్రించడంలో విఫలం అయిన మంత్రి, ఆరోగ్య శాఖ అధికారిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-03-22 10:21 GMT

ఢిల్లీలో ప్రయివేట్ క్లినికల్ ల్యాబ్ ల తప్పుడు రిపోర్టులను నియంత్రించే చట్టాన్ని తీసుకురావడంలో విఫలం అయినందుకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆరోగ్య కార్యదర్శిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాబ్ లను ఎందుకు నియంత్రించలేదని, న్యాయపరమైన ఆదేశాలు పాటించడంలో విఫలం అయితే జైలుకు పంపుతామని హెచ్చరించింది. ప్రభుత్వ సేవకులుగా ఉన్నారని ఈగోలను పక్కనపెట్టి పని చేయాలని మంత్రి, ఆరోగ్య కార్యదర్శకి కోర్టు తలంటింది. ఢిల్లీ హెల్త్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) బిల్లుపై చర్చల సమయంలో మంత్రిని అసలు స్పందించలేదని, దీనిపై  ఈ మెయిల్ వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరిలో తమ ఎదుట హజరుకావాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు సూచన

సామాన్య ప్రజలు ఒకవైపు ఇబ్బందిపడుతున్నారు. ఒక్కోల్యాబ్ లో ఒక్కో రిపోర్ట్ వస్తోంది. ఏది నిజమో.. ఏది అబద్దమో ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మీరిద్దరూ( మంత్రి, ఆరోగ్య కార్యదర్శి) మీరు ఏమి పట్టనట్లు వ్యవహరించారు. ఇలాంటి ప్రవర్తనను న్యాయస్థానం ఆమోదించదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరా అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మీరు విఫలమైతే మూడో పక్షానికి బాధ్యతల అప్పగింతకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. పిటిషనర్ సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాక మౌనంగా ఉండడం సాధ్యం కాదంది. ఇద్దరు ఇలాగే ప్రజా జీవితాలతో చెలగాటలు ఆడితే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది.

ప్రజల ఫిర్యాదులు

దేశ రాజధానిలో అనధికార ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులతో రోగులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ 2018 లో బెజోన్ కుమార్ వేసిన పిటిషన్ తరఫున న్యాయవాదీ శశాంక్ డియో సుధీ వాదనలు వినిపించారు. దీనికి కౌంటర్ గా ఢిల్లీ ఆరోగ్య బిల్లు 2022లో ఫైనల్ అయిందని మంత్రి సమాధానం ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎందుకు పంపలేదని కోర్టు, ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీ చట్టం అమలు చేయడం ఆలస్యం అయితే కేంద్ర ప్రభుత్వం ది క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2010ని అమలు చేసే అంశాన్ని ఎందుకు పరిశీలించలేదని  కోర్టు పేర్కొంది. కోర్టు అంగీకరిస్తే దానిని ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించిన మెడికల్ బిల్లును అమలు చేస్తామని మంత్రి చెప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది మా పని కాదంది.

Tags:    

Similar News