యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా..
సోనీ జూన్ 28, 2017న కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. UPSC చైర్మన్‌గా మే 16, 2023న ప్రమాణ స్వీకారం చేశారు ఆయన పదవీకాలం మే 15, 2029తో ముగియనుంది.
UPSC చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన మే 2029లో రిటైర్ కావాలి. ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం.
ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఆ కేసుతో మనోజ్ సోనీ రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.
"యుపిఎస్‌సి ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో పక్షం రోజుల క్రితం తన రాజీనామాను సమర్పించారు. దాన్ని ఇంకా ఆమోదించలేదు" అని పేర్కొన్నారు.
సోనీ ఇప్పుడు "సామాజిక-మతపరమైన కార్యకలాపాలకు" ఎక్కువ సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.
59 సంవత్సరాల ప్రముఖ విద్యావేత్త సోనీ.. జూన్ 28, 2017న కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. UPSC చైర్మన్‌గా మే 16, 2023న ప్రమాణ స్వీకారం చేశారు ఆయన పదవీకాలం మే 15, 2029తో ముగియనుంది.
యుపిఎస్‌సిలో నియామకానికి ముందు, సోని మూడు పర్యాయాలు వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BAOU) VCగా ఆగస్టు 1, 2009 నుంచి జూలై 31, 2015 వరకు, ఏప్రిల్ 2005 నుండి ఏప్రిల్ 2008 వరకు బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (MSU) VCగా ఉన్నారు. MSUలో చేరిన సమయంలో, సోనీ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన వైస్-ఛాన్సలర్.
రాజకీయ శాస్త్ర పండితుడు, సోనీ 1991, 2016 మధ్య కాలంలో సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం (SPU), వల్లభ్ విద్యానగర్‌లో అంతర్జాతీయ సంబంధాలను బోధించారు.
UPSCలో గరిష్టంగా పది మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు.