సీఎం రేవంత్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతుంది..

గ్రూప్ 1 ప్రశ్నపత్రం లీకేజీ అనే మాట వినిపించకుండా ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు?

Update: 2023-12-12 17:08 GMT

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ గతంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం వద్ద నిరుద్యోగుల ధర్నాలు, ప్రతిపక్షాల ఘాటైన విమర్శలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఇక భవిష్యత్‌లో పేపర్‌ లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సీఎం ఎనుముల రేవంత్‌ రెడ్డి (CM Revanth) గట్టి చర్యలే తీసుకుంటున్నట్లుంది. మంగళవారం సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు.

అధ్యయనం చేయండి..సమగ్ర నివేదికతో రండి..

న్యూ న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని వెంటనే నియమించాలని, అయితే సిబ్బంది నియామకాల్లో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. గ్రూప్‌ 1, ఏఈఈ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై అడిగి తెలుసుకున్నారు. కేసు పురోగతి, జరిగిన విచారణ గురించి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తీసుకున్నారు. సమావేశానికి చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీగుప్తా, అడిషనల్‌ డీజీ ఆనంద్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి అనితారామచంద్రన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, సిట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ హాజరయ్యారు.

ఇది ఇలా ఉంటే, టిఎస్ పిఎస్ సి ఛెయిర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్ తిమిళిసై ఇంకా ఆమోదించలేదని రాజభవన్ స్పష్టం చేసింది.

ఆమె  ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉంటున్నారని అందువల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

దీనికి కారణం, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్ష ల క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి  ఛెయిర్మన్ ఉద్యోగం నుంచి తీసేయాలని ఆమె రాష్ట్రపతి నివేదించారు. రాష్ట్ర పతి ఆ సిఫార్సు కేంద్ర డిపార్టో మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రయినింగ్ (డిఒపిటి)కి వెళ్లింది. అక్కడి నుంచి ఆ ఫైల్ రాష్ట్రప్రభుత్వ సలహాకోసం బిఆర్ ఎస్ ప్రభుత్వానికి వచ్చింది. అయితే, గత ప్రభుత్వం దీని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ విషయం తేలేదాకా జనార్దన్ రెడ్డి రాజీనామా వ్యవహారం తేలక పోవచ్చు.

ఇక, మరొక వైపు టిఎస్ పిఎస్ సి ఇతర సభ్యులు కూడా నిన్న రాజీనామా చేశారు.

 


పకడ్బందీగా నిర్వహించాలి..

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక అంశాలను చర్చించారు. పరీక్షలు సాఫీగా జరిగిపోవాలని సూచించారు.

Tags:    

Similar News