బీహార్‌ ఎన్నికలు: ఎన్డీఏలో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..

JD(U) - 101, BJP -101, LJP(Ram Vilas) - 29 HAM (S) - 6 RLM - 6

Update: 2025-10-12 13:44 GMT
Click the Play button to listen to article

బీహార్‌(Bihar)లో ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఎలక్షన్ కమిషన్(EC) ఎన్నికల తేదీని ఖరారు చేయడంతో పార్టీలు అభ్యర్థుల జాబితా విడుదలను వేగవంతం చేశాయి. ఎన్నికల మాజీ వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి భాగస్వాములు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం 243 నియోజకవర్గాల్లో బీజేపీ, జేడీ(యూ) 101 స్థానాల చొప్పున పంచుకున్నారు. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్-విలాస్)కి 29 సీట్లు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌)HAM (S), రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా(RLM)కు చెరో ఆరు సీట్ల ఇచ్చారు. ఈ సీట్ల పంపకాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధృవీకరించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

Tags:    

Similar News