సోమాజీగూడలో అగ్నిప్రమాదం
శ్రీకన్య రెస్టారెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు.
హైదరాబాద్ సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ ఐదో అంతస్తులో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. రెస్టారెంట్‌లో ఎవరైనా ఉన్నారా అన్న అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా అసలు ప్రమాదానికి కారణం ఏంటి? అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
రెస్టారెంట్ కిచెన్ నుంచి పొగలు వెలువడ్డాయని అక్కడ ఉన్నవారు తెలిపారు. దీంతో కిచెన్‌లో ఏదైనా ప్రమాదం జరిగిందా? షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇది ప్రమాదమా? లేకుంటే మానవ తప్పిదమా? ఎవరైనా కావాలనే చేశారా? అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.