కేరళ పినరయి ప్రభుత్వంపై సతీశన్ ధ్వజం

స్థానిక సంస్థల ఎన్నికల ముగిసే వరకు శబరిమల బంగారం దొంగతనం కేసు దర్యాప్తును వేగవంతం చేయకుండా అడ్డుకుంటున్నారన్న శాసనసభా ప్రతిపక్ష నేత

Update: 2025-12-05 11:19 GMT
Click the Play button to listen to article

కేరళ(Kerala) శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ (VD Satheesan) పినరయి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శబరిమల బంగారం దొంగతనం కేసుతో ప్రమేయం ఉన్న తమ పార్టీ నాయకులను అధికార పార్టీ CPI(M) రక్షించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇదే కేసుకు సంబంధించి దేవస్థానం మాజీ మంత్రిని స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ప్రశ్నించకుండా ఉండాలని SITపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. తమ పార్టీ మరికొంతమంది నాయకుల పేర్లు ఎక్కడ బయటపెడతారేమోనన్న భయంతో అరెస్టయిన వారిపై ఏ చర్య తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో సురేంద్రన్‌కు సంబంధాలున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సతీషన్ చెప్పారు.


‘‘ ప్రధాన్ వ్యాఖ్యలే నిదర్శనం..’’

కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలున్నాయని ప్రతిపక్ష నేత వీడి సతీషన్ ఆరోపించారు. ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) అవగాహన ఒప్పందంపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మధ్యవర్తిగా వ్యహరించారని కేంద్ర విద్యా శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేరళ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఎంపీగా బ్రిట్టాస్ తన విధి నిర్వర్తిస్తున్నానని పేర్కొంది.


సిట్ దర్యాప్తు..

కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోని 'ద్వారపాలక' విగ్రహాలు, శ్రీకోవిల్ తలుపుల చట్రాల బంగారు పూతలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును పూర్తి చేయడానికి S.I.Tకు మరో ఆరు వారాల సమయం ఇచ్చింది. డిసెంబర్ 4న, కోర్టులోని మరో బెంచ్ ఈ కేసులో "కొంతమంది పెద్దల" ప్రమేయం ఉండే అవకాశం ఉందంటూ..కేసుతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు, పెద్దల పాత్రపై లోతుగా దర్యాప్తు చేయాలని S.I.Tకు సూచించింది.


‘‘మాలాగా చేయగలరా?’’

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ అరెస్టును ఆలస్యం చేయడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఉందని సతీశన్ ధ్వజమెత్తారు. ‘‘ఆయనసై ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ వెంటనే చర్య తీసుకుంది. మేం అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాం. కేరళ ప్రజల ముందు తల పైకెత్తి నిలబడగలం. సీపీఐ(ఎం) అలా చేయగలదా?" అని ప్రశ్నించారు.


‘‘జనం దృష్టి మరల్చేందుకే’’

సీపీఐ(ఎం) అనుకుంటే మమ్‌కూటథిల్‌ను పోలీసులు సులభంగా అరెస్టు చేయగలిగేవారని సతీశన్ అన్నారు. "కానీ వారు ఇప్పుడు ఈ కేసులో అరెస్టు కోరుకోవడం లేదు. శబరిమల బంగారం కేసు దృష్టిని మళ్లించడానికి, ఎన్నికలు ముగిసే వరకు వారు దానిని ఇలాగే ఉంచాలనుకుంటున్నారు" అని అన్నారు ప్రతిపక్ష నేత. 

Tags:    

Similar News