పశ్చిమ బెంగాల్ ఘటల్ పోటీలో ఇద్దరూ హీరోలెే, సూపర్ ఎవరవుతారోె?

పశ్చిమ బెంగాల్ ఘటల్ నియోజకవర్గ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు ఇస్తున్న హామీలేంటి?

Update: 2024-04-18 11:45 GMT

పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్ లోక్‌సభ నియోజకవర్గం కోల్‌కతా నుండి 120 కి.మీ దూరంలోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని ఉంటుంది. శిలాపతి నది పరివాహక ప్రాంతంలో ఉండడంతో ఘటల్ నియోజకవర్గం ఏటా వరద ముంపునకు గురవుతోంది. ఈ సమస్య దశాబ్దాల నుంచి ఉంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల నాయకులు ఇక్కడకు రావడం, వాగ్దానాలు చేయడం, ఆపై ముఖం చాటేయండం చాలా ఏళ్లుగా జరుగుతోందని జనం అంటున్నారు. నీట మునిగినపుడు సొంత పడవలలో ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డామని చెబుతుంటారు.

"గత 28 ఏళ్లలో ఏదీ మారలేదు. మారుతుందని నేను అనుకోను. ఎన్నికల వేళ నాయకులు వాగ్దానాలు చేస్తారు. ఆ తర్వాత వాటిని మరిచిపోతారు." అని అర్గోరా నివాసి నిరంజన్ హజ్రా చెప్పారు.

ఎన్నికల బరిలో సినీ ప్రముఖులు..

బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖ హీరోలు - దేవ్ అకా దీపక్ అధికారి, హిరన్ అకా హిరణ్మోయ్ చటోపాధ్యాయ - ఘటల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దేవ్, సిట్టింగ్ టిఎంసి ఎంపి. టిఎంసి మరోమారు ఆయనకు టికెట్ కేటాయించింది. ఈయనపై పోటీకి ఖరగ్‌పూర్ ఎమ్మెల్యే హిరణ్‌మోయ్ ఛటోపాధ్యాయను బరిలో దింపింది బీజేపీ.

"వరద ఖచ్చితంగా ఒక పెద్ద సమస్యే. జనం ఇబ్బందులు నాకు తెలుసు. వాటి పరిష్కారానికి కృషి చేస్తా’’ మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రెండుసార్లు ఎంపీగా గెలిచిన దేవ్. కాగా పదేళ్లలో చేయలేని పని ఇప్పుడెలా చేస్తాడని ప్రశ్నిస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఛటోపాధ్యాయ. తనను గెలిపిస్తే..

వరద సమస్య పరిష్కారానికి 'ఘాటల్ మాస్టర్ ప్లాన్' అమలు చేయడంతో పాటు రైల్వే సర్వీస్‌ను మెరుగుపరచడం, నియోజకవర్గాన్ని 'గోల్డ్ హబ్'గా తీర్చిదిద్దుతానని ఛటోపాధ్యాయ హామీ ఇస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఘటల్ మాస్టర్ ప్లాన్'అమలు చేస్తామని ప్రకటించారు. "ఘటల్ మాస్టర్ ప్లాన్ గురించి దేవ్ నాకు చెప్పారు. నేను ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల కార్యదర్శితో చర్చించాను. మేము ఘటల్ మాస్టర్ ప్లాన్‌ అమలు చేస్తాం’’ అని బెనర్జీ చెప్పారు.17 లక్షల మందికి మేలు చేకూర్చే ఘటల్ మాస్టర్ ప్లాన్ కోసం రూ.1,250 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని బెనర్జీ చెప్పారు.

ఘటల్ సబ్-డివిజన్‌లో 5 మునిసిపాలిటీలు ఉన్నాయి -చంద్రకోన, రామ్‌జీబోన్‌పూర్, ఖిర్పై, ఖరార్ ఘటల్. ఐదు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు - ఘటల్, చంద్రకోన-I, చంద్రకోన-II, దస్పూర్-I మరియు దాస్పూర్-II ఉన్నాయి. ఘటల్ మున్సిపాలిటీ నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం 1 నుండి 12 వార్డులలో ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు నుండి మూడు నెలల పాటు వరద నీరు ఉంటుంది.

ఘటల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. - పన్స్కురా పశ్చిమ్, సబాంగ్, పింగ్లా, డెబ్రా, దాస్పూర్, ఘటల్ (SC) మరియు కేశ్పూర్ (SC). వీటిలో పన్స్కురా పాచిమ్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఉంది. మే 25న ఆరో దశలో ఘటల్‌లో పోలింగ్ జరగనుంది.

Tags:    

Similar News