ఢిల్లీ, పంజాబ్‌లో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేనా..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు వ్యూహరచనలో పడ్డాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడమెలాగో ఆలోచిస్తున్నాయి. మరోవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి

Update: 2024-01-13 12:49 GMT

.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటుపై ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుగుతోంది. అందులో భాగంగానే సీట్లు ఖరారు చేసుకునేందుకు శనివారం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీ సీఎం అరవింద్ కే‌జ్రీవాల్‌తో సమావేశమవుతారు. ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవడంపై ఇరు పార్టీలు దృష్టి సారించాయి. ఢిల్లీతో పాటు గోవా, హర్యానా, గుజరాత్‌లో కూడా ఆప్ పార్టీ విస్తరించే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ, గుజరాత్‌లలో ఆప్ , కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో పొత్తు వ్యవహారం తెలిగ్గా కొలిక్కి వచ్చినా.. పంజాబ్ లో పొత్తు గురించి మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News