గుజరాత్ ‘గిఫ్ట్’ లిక్కర్ : ప్రొహిబిషన్ సంకెళ్లు విరుగుతున్న సవ్వడి
లోక్ సభ ఎన్నికల ముందు మోదీ గుజరాత్ లో ఒక భోళా లిక్కర్ ప్రయోగం మొదలైంది. మోదీ పాత చట్టాల్లో ఇరుక్కున్ననేత కాదు. వాటిని తుంచేందుకు ఇది ఒక ట్రయల్ బేసిస్
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని పటిష్ట పరచుకోవడానికి గుజరాత్ లోని అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక నగరం గిఫ్ట్ (Gujarat International Finance Tec-City) సిటీలో మద్య నిషేధం ఎత్తివేశారు. పాతచట్టాలు, సంప్రదాయాలతో పెద్దగా అనుబంధం పెంచుకోని మోదీ ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దశాబ్దాలుగా మద్యనిషేధం ఉన్న రాష్ట్రంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం అసలు ఆ నిషేధం విధించడానికి దారి తీసిన పరిస్థితులను మరొక సారి ముందుకు తెచ్చింది.
గాంధీనగర్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం 1992 వేసవిలో జరిగినప్పుడు దేశం నలుమూలల నుంచి జర్నలిస్టులు అక్కడికొచ్చారు. రెండు దశాబ్దాలుగా ఆ రాష్ట్ర రాజధానిగా ఉన్న అహ్మదాబాద్ అభివృద్ధికి నోచుకోక నగర రూపురేఖలకు దూరంగానే ఉంది.
ఒక మహాగనరంగా రూపుదాల్చడానికి సిద్ధమవుతున్న అహ్మదాబాద్ లో నిర్మాణంలో ఉన్న కార్యాలయ భవనాల్లోనే ప్రభుత్వకార్యకలాపాలు జరుగుతూ, చాలా భయంకరంగా దర్శనమిస్తోంది. నివాస ప్రాంతాలను కలుపుతూ వెలిగించిన పాత రోడ్లు, మార్పులేని పాత లే ఔట్లలో మార్కెట్ ఇరుకిరుగ్గా ఉంది.
1991 పార్లమెంట్ ఎన్నికల తరువాత లోక్ సభలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ తన సమావేశాలను పత్రికల వారికి అందుబాటులోకి తేవాలని భావించింది. పార్లమెంటులో కొత్తగా ఏర్పడనున్న తన స్థానానికి నూతన మార్గానికి అవసరమైన వనరులను వెతుక్కోవడానికి బీజేపీ ఆతిథి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ సమావేశాల కోసం పత్రికల వారు అహ్మదాబాద్ కు రావడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఏసీ రైళ్ళను వేయించింది. వారికి కేటాయించిన స్థలానికి వెళ్ళడానికి ఎయిర్ కండీషన్ బస్సులను ఏర్పాటు చేసింది (ఆరోజుల్లో ఎయిర్ కండీషన్ బస్సు లంటే విలాసవంతమే). ప్రతినిధుల నివాసానికి గుడారాలు, అక్కడే మరుగుదొడ్లు, భోజన, అల్పాహార కౌంటర్లు ఏర్పాటు చేయగా, జర్నలిస్టులకు మాత్రం సౌకర్యవంతమైన హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. వివిధ చోట్ల నుంచి వచ్చే పాత్రికేయులు కలుసుకోవడానికి, సభా ప్రాంగణానికి చేరుకోవడానికి వాహనాలు, భోజన ఏర్పాట్లను చూడడానికి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ కేంద్రంగా సమావేశ హాలును ఏర్పాటు చేసి, అందులో కంప్యూటర్లు, ప్రింటర్లు, టెలెక్స్ మెషిన్లు, ప్యాక్స్ లైన్లు పనిచేయడానికి తోడుగా ఇంటర్ నెట్ సౌకర్యం కూడా కల్పించారు.
సంధ్యవేళ మద్యం అనుమతికి విజ్ఞాపనలు
మమ్మల్ని పూర్తిగా తనిఖీ చేసిన తరువాత, పార్టీ శిబిరం వద్ద సమావేశమయ్యాం. కొందరు కార్యకర్తలు గుజరాత్ భాషలో అచ్చేసిన దరఖాస్తులపై మా చేత సంతకాలు చేయించుకుని తీసుకున్నారు. దేనికోసం ఈ దరఖాస్తులంటే ‘అనుమతికోసం విజ్ఞాపన’ అని సమాధానం వచ్చింది. ‘సాయంత్రం డ్రింక్ కోసం’ అని వివరించారు.
గుజరాత్ గురించి తెలిసిన జర్నలిస్టులు మరింత వివరంగా చెప్పారు. గుజరాత్ బయట నుంచి వచ్చిన ప్రయాణికులకు మద్యం అనుమతుల కోసం విజ్ఞప్తి అని చెప్పారు. వారి వారి ఆరోగ్య ప్రాతిపదికగా అనుమతులిస్తారు. ఈ అనుమతులు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇబ్బందిలేకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు అమలులో ఉన్నాయి.
తగినన్ని అనుమతులు గుజరాత్ సందర్శించే జర్నలిస్టు బృందాలకే కాదు, పనులు అయిపోయాక పార్టీ సీనియర్ కార్యకర్తలకు, నిర్వహకులకు వివిధ గదుల్లో సంతృప్తిగా మద్యం అందించారు.
అక్కడ మద్యం సులభంగా దొరుకుతుంది
గుజరాత్ ను సందర్శించినప్పుడల్లా దరఖాస్తు పూరించడం సర్వసాధారణమైపోయింది. హోటల్ ఉద్యోగి వద్ద లభించిన దరఖాస్తును పూరించి, సంతకం చేసిస్తే మన గదిలోకి మద్యం వచ్చేస్తుంది. మద్యం సంపాదించడం చాలా తేలిక. అప్పుడప్పుడూ హోటల్ ఆవరణలోనే మద్యం షాపులు కూడా కనిపించేవి.
అప్పటి నుంచి దశాబ్దాలుగా గుజరాత్ అంతటా అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోంది. ప్రసార మాద్యమాలు పెరిగాక, ముఖ్యంగా మొబైల్ టెలిఫోన్లు పెరిగాక ఇళ్ళకే మద్యం సరఫరా జరుగుతోంది.
ఇక్కడి మద్యం ప్రియులు వారాంతం సెలవుల్లో డయ్యు డామన్ పరిగెత్తి వందలాది బార్లలో మద్యంలో మునిగితేలుతుంటాని వినడమకాదు, గుజరాత్ ను యాత్రికులందందరు కళ్లారు చూస్తుంటారు. సెలవులయిపోగా డ్రై గుజరాత్ కు తిరిగి వస్తుంటారు.
నిషేధం మీద నాడు నేడు మోదీ తీరు
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన్నొక సారి కలిశాను. నేను రాస్తున్న ఆయన జీవిత చరిత్ర కోసం ఇంటర్వూ చేశాను. ఆయన హిపోక్రసీ నాకు కొంత ధైర్యాన్ని ఇవ్వడం చేత ఆయన్ని ఒక ప్రశ్న వేసినట్టు నాకింకా గుర్తు. అది కొద్ది సమయమే. మోదీ కటువుగా సమాధానాలిచ్చారు.
నేను : చాలాకాలం మద్య నిషేధం విధించడం వల్ల గుజరాత్ కు ఏం ప్రయోజనం కలిగింది? సమాజంలోని వివిధ వర్గాలలో చాలా మందికి చాలా కాలం నుంచి మద్యం అలవాటు ఉంది. ఇలాంటి స్థితిలో మద్య నిషేధం ఒక కాదా?
మోదీ : మా జీవితంలో అదొక భాగం. చిత్త శుద్ధి లేకపోవడం కాదు. గుజరాత్ ప్రభుత్వానికి, ప్రజలకు, తల్లులకు, అక్కచెల్లెళ్ళకు ఈ విధానం పట్ల నిబద్దత ఉంది. ఈ విషయంలో గుజరాత్ సరైన మార్గంలోనే పోతోందనుకుంటున్నాను.
నేను : మద్యం వల్ల పెద్ద ఎత్తున సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తూఉందని వింటూంటాం. రానున్న రోజుల్లో ఎప్పుడైనా, దీనిపైన సమీక్షించదలిచారా?
మోదీ : సమీక్ష చేయాలి. లోపాలను సరిచేయాడానికి
నేను : నిషేధాన్ని ఎత్తివేయడం గురించి ఏం చెపుతారు?
మోదీ : అది ఎప్పటికీ సాధ్యం కాదు.
నేను: దీనికి ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా?
మోదీ: గుజరాత్ కున్న విలువల్లో అదొక భాగం.
గిఫ్ట్ సిటీలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధదేశాల వ్యాపారుల సహజ అలవాట్ల కోసం ‘మందు-విందు‘ను అనుమతిస్తూ రాష్ట్ర మద్యనిషేధ విభాగం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి, దశాబ్దం క్రితం మోదీ సమర్థింపునకు వైరుధ్యం ఉంది.
వారంరోజులు కిందట ప్రకటించిన నూతన విధానాన్ని అనుసరించి గిఫ్ట్ సిటీలో మద్యసేవించేందుకు అనుమతి ఇచ్చారు.
నిషేధాన్ని ఎవరు బద్దలు కోట్టారు?
నిషేధాన్ని బద్దలు కొట్టడమంటే మోదీ తరహా పాలనలో పైనుంచి వచ్చిన నిర్ణయమే. ముఖ్యంగా ప్రపంచ పెట్టుబడులను రాబట్టాలనే 2007 నాటి మోదీ దృక్పథాన్ని అనుసరించే గిఫ్ట్ సిటీ ప్రాజెక్టు ఏర్పడింది. బొంబాయి రాష్ట్రంలో గుజరాత్ భాగంగా ఉన్నప్పుడే మద్యనిషేధ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, గిఫ్ట్ సిటీలో మద్యనిషేధం సడలించడం పరిపాలనా వ్యవహారదక్షతలో భాగం. ఈ నూతన విధానం ప్రకారం మద్యం అమ్మడానికి మాత్రం వీలు లేదుగాని గిఫ్ట్ సిటీలోని ఉద్యోగులకు, గుర్తింపు పొందిన సందర్శకులకు మాత్రం మద్యం సరఫరా చేస్తారు.
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో మద్య నిషేధం ఎత్తివేశారు. పాతచట్టాలు, సంప్రదాయాలతో పెద్దగా అనుబంధం పెంచుకోని మోదీ ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్య నిషేధాన్ని 2012లో సమర్థించిన వ్యక్తేనా ఈయన. తాజాగా మద్యనిషేధ చట్టంలో సవరణ చేయడానికి అనుకూలంగా ఉన్నారని పుకారుల కూడా వ్యాపిస్తున్నాయి.
నాలుగేళ్ళ విరామం తరువాత రాష్ట్ర రాజధానిలో ప్రపంచ సదస్సు 2024 జనవరి 10-12 తేదీలలో నిర్వహించనున్నారు. ‘ఉదారవాద పండుగ’ గురించిన తమ అనుభవాలను పరస్పరం పంచుకుని, దాని గురించి చర్చించడానికి భావసారూప్యత కల వారంతా గిఫ్ట్ సిటీకి రానున్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల వారిని దేశంలో ఆకర్షించనున్న నేపథ్యంలో గుజరాత్ లో బహిరంగంగా తాగడానికి పరిమితసంఖలో అనుమతివ్వాలనే ఈ నిషేధ సడలింపు నిర్ణయం తీసుకున్నారు. పనివేళలు అయిపోయాక నగరం దారుణంగా తయారవుతుంది కనుక గిఫ్ట్ సిటీకి తరలిపోవడానికి నైపుణ్యం కల కార్మికులు ఇష్టపడడం లేదు.
పర్యాటక, ఆదరణ రంగాల్లో మద్యనిషేధ చట్టాన్ని సడలించాలని, దశలవారీగా నైనా సడలించి, రాష్ట్ర వ్యాపితంగా మద్యనిషేధాన్ని పూర్తిగా సడలించాలనే దీర్ఘకాలికంగా ఉన్న వాదనకు అనుకూలంగా గిఫ్ట్ సిటీలో మద్యనిషేధాన్ని సడలించారని ఇప్పుడే చెప్పటం తొందరపాటవుతుంది. మహిళల నుంచి, కొన్ని సామాజిక సంస్థల నుంచి కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో గుజరాత్ బీహార్ లలో రాజకీయ నాయకులు నిషేధంపై వ్యక్తిగతంగా విమర్శనాత్మకంగా ఉన్నారు.
మద్యపాన సేవనం ఒక పెద్ద సామాజిక, ఆరోగ్య సమస్య. మద్యాన్ని నిషేధించడమనేది సరైన పరిష్కారం కాదు. ఒక నిర్ణయం తీసుకుని ముందుకు కదిలితే కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు వ్యతిరేకిస్తాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలోల గెలుస్తామని మోదమ ఒక నమ్మకాన్ని పాదుగొల్పారు.
భవిష్యత్తువాణిగా ఆదరణ రంగాల కోసం మరింత సడలించినట్టయితే గృహావసరాల మద్య పరిశ్రమను ప్రోత్సహించినట్టవుతుంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని మద్యాన్ని అనుమతించినట్టయితే, ఆనిర్ణయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. మరొక సందర్భంలో దాన్ని పరిశీలించవచ్చు.
(The Article is translated by Aluru Raghava Sarma)
(Nilanjan Mukhopadhyay’s latest book is 'The Demolition and the Verdict: Ayodhya and the Project to Reconfigure India'. His other books include The RSS: Icons of the Indian Right' and 'Narendra Modi: The Man, The Times'. He tweets at @Nilanjan)