ముంచుకొస్తున్నా మూడో కూటమి ముప్పు
జూబ్లీ ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చగలవా..!
నాలుగు శతాబ్దాల తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే ఎప్పుడూ ఇక్కడి ప్రజల బతుకులు పెనంమీంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటున్నాయి. సామాన్యుల అసామాన్య త్యాగాలు వృధా అవుతున్నాయి. తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ ప్రశ్నార్ధకమవుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇలా రాయాల్సి రావడం బాధాకరం, బాధాకరమే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ముందుచూపుతో రాయాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలలో రాజకీయ పార్టీల తీరు త్వరలో వెలువడనున్న ఫలితాలు ప్రభావాలు మీద తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ముఖచిత్రం ఆధారపడి ఉంటుంది.
త్వరలో రెండు సంవత్సరాలు ప్రజాపాలనను పూర్తి చేసుకోబోత్తున్క కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ మరొకవైపు , ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ తమ తమ బలాలను బలగాలని మోహరించి ఈ ఎన్నికలలో అమ్ తుమీ తేల్చుకుంటున్నాయి.
సహజంగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మిగతా రాజకీయ పార్టీల తో పోల్చుకుంటే ఎంతోకొంత ఎక్కువ ప్రయోజనం హంగు ఆర్భాటం ఉంటుంది. భారతీయ రాష్ట్ర సమితి కి కావాల్సిన పార్టీ నిధులు పది సంవత్సరాల లో సంవత్సరాల తమ పాలనలో ఏర్పడిన అనుచరగణం ఆ నాయకులకు ఉన్న గళంతో దీనికి తోడు సానుభూతి పవనాలు వీచి తమకు అనుకూల ఫలితం వస్తుందని సొంత మీడియా, సోషల్ మీడియాలను విస్తృతంగా ప్రచారంలో ఉపయోగించుకుంటున్నది . ఇకపోతే మరో జాతీయ పార్టీ గత పది సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త రాష్ట్ర సారధి నేతృత్వంలో ఎన్నికల్లో పాల్గొంటున్నది. ఈ పార్టీ కేంద్ర రాష్ట్ర రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాలుపంచుకుంటున్నారు. హిందూ ఓటర్లు ప్రధానంగా తమ లక్ష్యం చేసుకొని ఉపన్యాసాలు ఇస్తున్నారు పైగా వీరికి సమీప తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ మూడో కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు బహాటంగానే తమ మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు తెరవెనుకపని చేసిన పార్టీలు అట్టి పార్టీలు రేపో మాపో నేరుగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు మెరుగుగా కనిపిస్తున్నాయి.
ఇక పోలింగ్ కు నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో అన్ని పార్టీలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ,ఇంటింటి ప్రచారాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు నాయకులు తరలివచ్చి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గోదాలో పనిచేస్తున్నారు.కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. తెల్లారి లేస్తే మూడు ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు చేస్తున్న హడావుడి ప్రచారంతో ప్రజల చెవులు చిల్లులు పడేలా దద్దరిల్లిపోతుంది. నాయకుల పాత కొత్త మాటలమూటలు ,వాగ్దానాలు, హామీల వరదతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి తెలంగాణ భూత వర్తమాన భవిష్యత్ రాజకీయ వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకొని చర్చించుకోవలసిన వేసుకోవలసిన అవసరం ఏర్పడినది.
నిజాం పాలనలో జమీందారుల జాగిర్దారుల భూస్వాముల దౌర్జన్యాలకు అణచివేతకు వెట్టిచాకిరికి వ్యత్యేకంగా ప్రజలు రైతులు కూలీలు పోరాడి బందీ అయిన తెలంగాణను ఒక విధంగా విడిపించారు. అప్పటివరకే మద్రాస్ నుంచి వేరుపడి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, ఇండియన్ యూనియన్ లో కలిసి నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం కూడా బ్రాహ్మణ వర్గాల నాయకత్వంలో ఉండేవి. కానీ తదుపరి ఏర్పడిన అనేక సమీకరణలు పరిణామాల భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో తర్వాత ఇరు ప్రాంతాల రెడ్డీలంతా ఐక్యమై నాయకత్వంలోకి వచ్చారు. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ముఖ్యమంత్రులుగాగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రక్షణలు కాల రాశారు. అంతేకాక ఉద్యోగ నియామకాల్లో నీళ్లలో సంపదలు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ పోరాటం అనేక విడదలగా కొనసాగింది. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అప్పటి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 2023 చివరి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాడు . తెలంగాణలో కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలికి తోడు ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటికే టిడిపి నాయకుడు ఓటుకు నోటు కేసులో తెలంగాణ నుంచి తన బిచాణను ఎత్తివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోయాడు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇదే కాలంలో జరిగిన అనేక రాజకీయ చేర్పుల మార్పుల వలన జనసేన టిడిపి బిజెపి పార్టీలు కలిసి మూడో కూటమిగా ఏర్పడి 2023 ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీని శాసనసభలో నామమాత్రం చేసి టిడిపి నేతృత్వంలో నాయకుడు అధికారంలోకి వచ్చారు.
తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలనుకున్న భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కొన్ని కుప్పిగంతులు వేసింది. కానీ 2023 జరిగిన ఎన్నికలలో అపజయాన్ని మూట కట్టుకున్నది.
జాతీయస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి యొక్క మద్దతు అనివార్యమైంది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణలో తన పాదాన్ని మోపడానికి అవకాశం కోసం ఇంతకాలం ఎదురు చూస్తుంది. ప్రస్తుత తెలంగాణ లోని రాజకీయాలు తనకు అనుకూలంగా మలుచుకోవాలని చాప కింద నీరులా చంద్రబాబు రహస్యంగా వ్యవహారం చేస్తున్నాడు.
అధికార రాజకీయ పార్టీల నాయకులు బీసీకి ఇచ్చినప్పటికీ,రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అగ్రవర్ణాలకి తమ అభ్యర్థులుగా నిలబెట్టారు. గెలుపు కోసం తాము అంటే తామని ఎవరికి వారు పైకి బీరాలు పోతున్నా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఓటరు నాడి దొరకక తల్లు పట్టుకుంటున్నాయి . తమ సోషల్ మీడియా ద్వారా సర్వేల పేరుతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎన్ని జమలు కూడికలు తీసివేతలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని చేస్తున్నా ఓటరు మహాశయులు ఇప్పటికే ఒక నిర్ణయానికి గుమ్మనంగా వచ్చి ఉన్నాడు.
అందులో భాగంగానే లోపాయికారిగా ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం బిజెపికి మద్దతు తెలిపిన కారణంతో ఎంట్రీ పాస్ కోసం ప్రయత్నిస్తున్నది. ఈ ఫలితం ఒక లిట్మస్ టెస్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకుడు భావించి తెలంగాణలో తమ పార్టీ భవిష్యత్తు ప్రణాళికను రచించుకుంటాడు రూపొందించుకుంటాడు .
2028లో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడో కూటమి పేరున రెండు రాష్ట్రాలలో చేసే రాజకీయ విన్యాసాలు చతురతలను తెలంగాణ మేధావులు క్షుణ్ణంగా తీవ్రంగా సూక్ష్మంగా గమనించవలసి ప్రస్తుత తరుణం ఏతెంచిచనది .
ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కైనా ,తెచ్చిన అని గొప్పలు పోయే టిఆర్ఎస్ పార్టీల ఉనికికి ప్రమాదమే కాకుండా మరోసారి సమైక్యం భావనతో తెలంగాణకు ముప్పు మాత్రం ముంచుకొస్తున్నది.