లిటరరీ ఫెస్టివల్ 'ఛాయ'లో వీళ్ల దృక్పథాలకు చోటు లేదా?
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైఎస్ చాన్స్ లర్ ఘంటా చక్రపాణికి రచయిత బిఎస్ రాములు బహిరంగ లేఖ!
By : బిఎస్ రాములు
Update: 2025-10-23 02:52 GMT
ఈ రోజు పొద్దున ఐదింటికే లేచి వాట్సాప్ ఎంట్రీలను చూస్తుండగా ఒక మిత్రుడు ఫేస్ బుక్ మెసేజ్ ను కాపీ పేస్టు చేసింది కనపడింది. అది శనివారం 25-10-2025 న అంబేద్కర్ ఎపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ‘ఛాయ’ సంస్థ వారు తలపెెట్టిన సాహిత్య ఉత్వ కార్య క్రమ పట్టిక। అందులని ముఖ్యాంశాలు ఇలా రాసారు:
ఛాయ సాహిత్యోత్సవం షెడ్యూల్
4 వేదికలు
44 సెషన్లు
58 మంది వక్తలు
18 బుక్ స్టాల్స్
ఫుడ్ కోర్ట్, ఫ్లీ మార్కెట్
-సంక్షిప్తంగా ఇదీ వారి ప్రోగ్రాం. ఇంత
విస్తారమైన ప్రోగ్రాంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం అస్తిత్వాలు సాహిత్యం దృక్పథాలు పరిణామాలు , అలాగే స్త్రీల సాహిత్యం , స్త్త్రీవాద సాహిత్యం అస్తిత్వం , దృక్పథాలు , సాహిత్య ప్రక్రియలు, బీసీ ఎస్సీ ఎస్టీ కోణాల్లో మహిళా వాద కోణాల్లో సాహిత్యం- సినిమాలు , టీవీ సీరియల్లు , పత్రికలు, పాఠ్య పుస్తకాలు , బాల సాహిత్యం, ఆధునిక కాలంలో మానవీయ విలువలు సంస్కృతి - సాహిత్యం తీరు తెన్నులు అనే అంశాలేవీ ఈ కార్యక్రమాలలో చోటు చేసుకోలేదు.
అందువల్ల వీరు కాంగ్రెస్ , బజేపీ, టిడీపీ, డియంకే, జనతా వగైరా పార్టీల కన్నా , తెలుగు యూనివర్సిటీల కన్నా సాహిత్య అకాడమీ లకన్నా వెనకబడిన కన్జర్వేటివ్ దృక్పథంతో కొనసాగున్నారు. నేడు తెలుగులో వస్తున్న సాహిత్యం ట్రెండ్సు ను గౌరవించే ఉద్దేశం సంస్కారం కొరవడిన సాహిత్య ఉత్సవం ఇది. వీటి కోసం కూడ ఓ ఆరు సెషన్సు పెట్టే సహృదయత కొరవడిన నిర్వాహకులు తమలోని కురచ బుద్దుల పరిమితులను తెలుపుతాయి . పరోక్షంగా దళిత , బహుజన , బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం , అలాగే మహిళల చైతన్యాన్ని సాధికారికతను నిరాకరించే , అణిచివేసే క్రమానికి చెందిన గుంపు గా మలుపు తీసుకున్న కార్యక్రమం గా నిలిచి పోయింది.
ఈ కార్యక్రమానికి వెళ్లే వారు ఆ లోపాలను వేదికల మీద గుర్తు చేయడం అవసరం. వేదిక మీద అవకాశం లేని వారు ప్రశ్న రూపంలో ఆడియన్సు నుండి గుర్తు చేయాలి. సదస్సులను విద్వంసం చేయ నక్కర లేదు. పాల్లొంటున్న వాల్లలో మనకు తెలిసినవాల్లు మనలాగ ఆలోచించే వాల్లు కూడ ఉన్నారు. కాని వారికిచ్చినటాపిక్ లు వేరు. అందువల్ల వారే పని గట్టుకొని తమ తమ టాపిక్ లలో భాగం చేసి వినిపించే నైపుణ్యం సాధించు కోవాల్సి వుందది.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 1929 లో సైమన్ కమిషన్ ముందు వాదించి కమ్యూనల్ అవార్డు సాధించారు. అది గాంధీ నిరాహార దీక్ష అనంతరం పూనా ఒప్పందంగా మారి రాజ్యాంగ బద్దంగా అమలు జరిపే నేటి రిజర్వేషన్లకు ప్రాతి పదిక అయ్యింది. అలాంటి అంబేద్కర్ పేరిట గల ఓపెన్ యూనివర్సిటీలో బహుళ అస్తిత్వాల సాహిత్యాల సెషన్లకు చోటు లేక పోవడం మనం మన చైతన్యం వందేళ్ల కన్నా వెనక బడి కొనసాగుతున్నదా ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
అదే ఓ పొరపాటు అనుకుంటే మా ప్రియ విద్యార్థి ఘంటా చక్రపాణి దళితుడు ...అంబేద్కర్ వారసుడు వైస్ చాన్సలర్ గా ఉండగా వారి యూనివర్సిటీ ప్రాంగణంలో జరగడం ... అందులో పాన చెప్పిన అస్తిత్వాల సెమినార్ సెషన్లు లేక పోవడం చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలి పోతుంది.
(ఇవన్నీ రచయిత వ్యక్తి గత అభిప్రాయాలు)