భారత్ - పాక్ టెన్షన్స్ ప్రపంచానికి పట్టవా?

ప్రకటన వరకే పరిమితం అవుతున్న అగ్రదేశాలు;

Update: 2025-05-10 09:28 GMT
ఐరాస సమావేశం

(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద హత్యలపై తరువాత భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న వివాదం మూడు రోజులు గడిచినా ప్రపంచంలోని సూపర్ పవర్ గా పిలుస్తున్న పెద్ద శక్తులు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నాయో తప్ప ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నాయి.
‘‘ఈ వివాదం మాకు సంబంధించింది కాదు’’ అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇటీవల భారత్ - పాకిస్తాన్ వివాదంపై తమ వైఖరిని తెలిపారు. ఇది వాషింగ్టన్ అస్పష్ట వైఖరిని తెలియజేస్తోంది. పాకిస్తాన్, భారత్ రెండు అమెరికా విలువైన స్నేహితులు వాటిని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేవు.
అమెరికా, రష్యా, చైనా సమతుల్య చర్య..
ఆఫ్ఘనిస్తాన్ తో పోలిస్తే పాకిస్తాన్ స్థానం అమెరికాకి చాలా కీలకం. ఆఫ్ఘన్ లో దాని కార్యకలాపాలు ఎల్లప్పుడూ పాక్ ద్వారానే సాగాయి. ముఖ్యంగా ఇప్పుడు తాలిబన్ లో అధికారంలోకి వచ్చినప్పుడు దాని స్థానం మరింత కీలకంగా మారింది.
భారత్ పై తన పట్టును నిలబెట్టుకోవడానికి అమెరికా, పాక్ నే పావుగా ఉపయోగిస్తోంది. న్యూఢిల్లీ, వాషింగ్టన్ కు దగ్గరగానే ఉన్నప్పటికి, మాస్కోతో మాత్రం లోతైన సంబంధాన్ని కొనసాగిస్తోంది.
సోవియట్ కాలం నుంచే భారత్ కు ఉన్న మంచి స్నేహం తరువాత కాలంలో మరింత ధృఢంగా మారింది. కాబట్టి దక్షిణాసియాలో తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి దాని మరో మిత్ర దేశం కావాల్సింది కాబట్టే పాక్ తో స్నేహం వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. ఇది దానికి బీమా ఇన్సురెన్స్ లాంటింది.
రష్యా, చైనా విషయంలో కూడా ఇదే పరిస్థితి. రష్యా- భారత్ విషయంలో స్నేహం బలంగానే ఉంది. 1990 లో కోల్డ్ వార్ తరువాత న్యూఢిల్లీ మెల్లగా అమెరికా వైపు చూడటం ప్రారంభించింది. పాకిస్తాన్ విషయానికి వస్తే రష్యాకు అది ఒక కొత్త మార్గం. ఇటీవల సంవత్సరాలలో మాస్కో- ఇస్లామాబాద్ స్నేహం సైనిక, వాణిజ్య మినహ అనేక రంగాలలో కొత్త పుంతలు తొక్కింది.
చైనా- భారత్ మధ్య అత్యంత భారీ స్థాయిలో వాణిజ్యం కొనసాగుతోంది. ఈ రెండు దేశాలతోనూ దానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో చాలాసార్లు తన ప్రేమను చాటుకుంది. చైనా కలల ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో పాక్ ముఖ్యపాత్ర అప్పగించింది.
సమస్యలు పరిష్కరించుకున్న చైనా- భారత్..
గత కొన్ని నెలలుగా చైనా, భారత్ తమ సరిహద్దు వివాదంలో కొన్ని పరిష్కరించుకున్నాయి. లఢక్ లోని దెప్సాంగ్, డెమ్ చోక్ తో సహ కీలకమైన పెట్రోలింగ్ పాయింట్లను నిస్సైనికరణ చేపట్టుకున్నాయి. అక్కడ నుంచి చైనా దళాలు వైదొలిగాయి. తద్వారా రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి తమ అడుగులు కదిపాయి.
ప్రస్తుతం భారత్- పాక్ వివాదంలో చైనా బహిరంగంగానే పాక్ కు తన మద్దతును తెలియజేస్తోంది. రెండుదేశాలు సంయమనం పాటించాలని ప్రకటనలు జారీ చేసింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన క్షిపణి దాడి పై జి జిన్ పింగ్ విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని తగ్గించడానికి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మాత్రం తెలిపారు.
సంయమనం పాటించాలని కోరుతోంది..
ఈ వివాదం పూర్తి స్థాయి యుద్ధంగా విస్తరించకూడదని, లేదా తీవ్రం కావాలని కోరుకునే రెండు దేశాలలోని వర్గాల ప్రజలకు, ఈ మూడు దేశాలు మధ్యవర్తిత్వం అనుకూలంగా మారే అవకాశం ఉంది.
సంఘర్షణకు కారణాన్ని పరిగణలోకి తీసుకుంటే పహల్గామ్ లో అమాయక పర్యాటకుల హత్యపై భారత్ ఆగ్రహం రెండు మిత్రదేశాలు అర్థం చేసుకోకుండా ఉండలేవు.
పాకిస్తాన్ హత్యలను ఇస్లామాబాద్ కు తీసుకెళ్లే ఆధారాలను కోరినప్పటికీ, భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ముంబై ఉగ్రవాద దాడి, భారత్ పార్లమెంట్ భవనంపై దాడి వంటి గత సంఘటనలను ఉపయోగించకుంది.
ఈ వారం ప్రారంభంలో భారత్- పాకిస్తాన్ పరిస్థితిని చర్చించడానికి సమావేశమైన ఐరాస ప్రత్యేక సమావేశంలో ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరాయి తప్ప.. ఎలాంటి తీర్మానం కూడా చేయలేకపోయాయి.
సంక్షిప్తంగా చెప్పాలంటే కొనసాగుతున్న ఘర్షణలలో ప్రపంచం ఒక ప్రత్యేక బంధంలో చిక్కుకుంది. రెండు దేశాల గురించి ఎవరూ ఏమి చెప్పకపోవడం, ఒత్తిడి తీసుకొచ్చే చర్యలకు తీసురాలేకపోతున్నాయి.
భారత్ దృఢమైన వైఖరి..
పహల్గామ్ హత్యలే అసలు ఉద్రిక్తతకు కారణమని చెబుతున్న ఢిల్లీలోని ప్రభుత్వం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పింది.
తమ పోరాటం కేవలం ఉగ్రవాదం మీద మాత్రమే అనే స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఉగ్రవాద ఘటనలతో విసిగిపోయిన ప్రపంచం ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తోంది.
గత మూడు దశాబ్ధాలుగా రాబోయే యుద్దాలను నివారించడానికి అమెరికా రెండు అణ్వాయుధ దేశాలపై తన దౌత్యం, ప్రభావాన్ని ఉపయోగించింది. 1999 కార్గిల్ యుద్దం పరిమిత వివాదంగా మిగిలిపోయిందంటే బిల్ క్లింటన్ పరిపాలన వెనక భాగంలో చేసిన ప్రయత్నాల వల్లే ఇది జరిగింది.
ఈ రెండు దేశాలతో కలిసి పోరాటాన్ని ముగించడానికి ఆయన కృషి చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం అక్రమ దళాలను ఉపయోగించి సంఘర్షణను ప్రేరేపించిన తరుణంలో అమెరికా తెరవెనక గట్టిగా హెచ్చరించడంతో అది తరువాత దశలకు విస్తరించకుండా ఆగింది.
బుష్ ఉద్రిక్తతను తగ్గించారు...
డిసెంబర్ 13, 2001 న పాకిస్తాన్ మద్దతు గల కాశ్మీరీ ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేసినప్పుడూ సరిహద్దులో ఇరు దేశాల సైన్యాలు ఎదురురెదురుగా పోటీపడటంతో యుద్దం ప్రారంభం అవుతుందేమో అనిపించింది. ఈ సమయంలో జార్జి బుష్ నేతృత్వంలోని ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దింది.
2008 లో ముంబై ఉగ్రవాదుల సమయంలో కూడా అజ్మల్ కసబ్ అరెస్ట్ తో పాకిస్తాన్ ప్రమేయం ఉందని నిర్థారణ అయింది. దీనితో భారత్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అమెరికా మళ్లీ అంపైర్ గా జోక్యం చేసుకోవడంతో యుద్దం తప్పింది.
2019 లో పుల్వామా దాడి తరువాత తొలిసారి భారత్ సరిహద్దులు దాటి బాలాకోట్ పై బాంబుల వర్షం కురిపించింది. తరువాత వైమానిక దాడులు ఎఫ్ 16 అమెరికా కోల్పోవడం, అభినందన్ దొరకడం, తీసుకురావడంలో అమెరికానే కీలకపాత్ర పోషించింది. అలాగే ఇస్లామాబాద్ పాలకులు కూడా అభినందన్ ను భేషరతుగా విడుదల చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
బలహీన పడుతున్న ప్రపంచ ప్రభావం..
పహల్గాం ఘటన తరువాత ప్రస్తుత ప్రతిస్పందన భారత్ వైఖరిని కఠినతరం చేసిందని చెప్పవచ్చు. రెండు దేశాలపై బాహ్య శక్తుల ప్రభావం కూడా తగ్గిందనే అనుకోవాలి. ముఖ్యంగా ఐరాస వంటి కీలక సంస్థలు బలం, విశ్వసనీయత కోల్పోవడంతో ఇటువంటి ఉద్రిక్తతలను నివారించడంలో విఫలం అవుతున్నాయి.
ఇప్పటికే ఐరాస వైఫల్యం అమెరికా, రష్యా వంటి పెద్ద శక్తుల ముందు దాని విశ్వసనీయత రాజీపడటంతో ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడింది. కొందరు దీనిని జాతి నిర్మూలనగా అభివర్ణించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాలను నిరోధించడంలో ప్రపంచం అసమర్థతను మర్చిపోకూడదు.
తాజా పాకిస్తాన్ ఘర్షణ దీనికి ఉదాహారణ. గాజా, ఉక్రెయిన్ ఘర్షణకు ఉన్న తేడా ఏంటంటే.. ఏ పెద్ద శక్తికి ఇందులో ప్రత్యక్ష ప్రమేయం లేదు. అది మెరుగైన దౌత్యానికి మెరుగైన ఫలితాలకు దారి తీస్తుందని ఆశిస్తున్నాము.
Tags:    

Similar News