బీసీ రిజర్వేషన్లకు అడ్డేవరు ?

ఎవరి ఎవరిమద్దతును ఎవరడుగుతున్నారు ?

Update: 2025-10-18 14:07 GMT

ఏ సమాజంలోనైనా సామాజిక విప్లవం సాధించడం అనేది కేవలం మాటలతో కాదు, అది రక్తం చిందించడంతో రాసిన చరిత్ర. అలాంటి చరిత్రకు నాంది పలికింది తెలంగాణ గడ్డ. తెలంగాణలో బీసీ (బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌) సమాజాలు దశాబ్దాలుగా అన్యాయం, అణచివేతలు, వివక్షతతో పాటు అనేకంగా ఎదుర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు ఆ వర్గాలు ఒక కీలకమైన మలుపుకు చేరుకున్నాయి. 42% (వాస్తవంలో జనాభాలో 56%పైగా ఉన్నప్పటికి) రిజర్వేషన్లు అనేది కేవలం సంఖ్య కాదు, ఇది బీసీల స్వయంగౌరవంతో ప్రకటనతో సామాజిక న్యాయం కేంధ్రంగా రాజకీయ హక్కులకు ఇది ప్రతీక. కానీ ఈ హక్కును అడ్డుకుంటున్నవారు ఎవరు? ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? గవర్నర్‌ వద్ద ఎందుకు ఆగిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాల కేంధ్రంగా అణగారిన వర్గాలు లేచి నిలబడి కలబడుతుండాలి. అక్కడితో ఆగకుండా పాలక వర్గాల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించి ఎండగట్టాలి. అదేతరునంలో విశాల ప్రతిపాదికనమాస్‌ మూవ్మెంట్ల ద్వారా న్యాయం సాధించాలి.

తెలంగాణలో బీసీలు 56% జనాభా ఉన్నప్పటికీ, వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు, అవకాశాలు ఇప్పటికీ రెడ్డి, వెలుమ, బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నాయి. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయకుండా అడ్డుకుంటున్న ప్రధాన శక్తి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ద్వారా బిల్లును ఆపేస్తూ, కేంద్రం బీసీల సామాజిక విప్లవాన్ని అణచివేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం (సీఎం రేవంత్‌ రెడ్డి) బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేసినా (వివిధకారణాలతో హైకోర్టులోగానీ, సుఫ్రీంకోర్టులో గానీ రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు సీలింగ్‌ నేపంతో కేసులువేసినా ఈ రిజర్వేషన్లు కొట్టివేతకు గురవుతాయని తెలిసి), అమలు చేయకుండా ఉండటం వారి వైఫల్యం. ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. ఈ పాలకుల మాటల్లో మద్దతు, చర్యల్లో మోసం అన్నమాట. ఇది కేవలం పార్టీల సమస్య కాదు, ఇది బీసీకులాల వర్గ పోరాటం. అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయిస్తున్న పాలక వ్యవస్థ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ` అన్నీ ఒకే నాణెంలో రెండు వైపులు ఉండే బొమ్మా బొరుసు లాంటివి. ఇది సామాజిక అన్యాయాన్ని చేపట్టడం అవుతుంది, ఇది కుట్ర.

42% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యమే, కానీ అది కేవలం చట్టాలతో కాదు, ప్రజా ఉద్యమాలతో. ముందుగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలి. కానీ అది కూడా గవర్నర్‌ ఆమోదం కావాలి. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇప్పటికే ‘‘సాధ్యం కాదు’’ అనే వాదనను కొట్టివేశాయి, కానీ హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను తిరస్కరించింది, ఎన్నికలు పాత కోటాతోనే జరగాలని చెప్పింది. ఈ మొత్తంలో లోపం జరుగుతున్నది ఎక్కడంటే ప్రజలందరు భాగస్తులయ్యే పోరాటం విస్తృంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, మధ్యతరగతిప్రజలు ఒవరికి వారుగా స్వచ్చందంగా పాల్గోనే వాతావరణం లేకపోవడమే. అందుకే పాలకులు, కోర్టులు, గవర్నర్‌లు బీసీ రిజర్వేషన్లపై దాటవేస్తున్నారు.

ఇప్పుడు చేయాల్సింది: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే గ్రామాల్లో మాకు, పార్టీకి మనుగడ లేదని పాలకులు గ్రహించడంతో తెలంగాణ ఏర్పాడినట్లు ఇప్పుడు బీసీలు మాస్‌ మూవ్మెంట్‌ నిర్మించాలి. ఇది విప్లవాత్మక ఉద్యమంగా మారాలి. రోడ్లు, అసెంబ్లీలు, రాజ్‌భవన్‌లు, రైల్‌రోకో, బస్‌బంద్‌, స్కూళ్ళు, కాలేజీలు, యునివర్శిటీలు, ఇలా ఒకటేమిటీ అన్ని బంద్‌ జరగాలి. ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్‌లు, ర్యాలీలు, నిరసనలు జరపాలి. ముఖ్యంగా బీసీలు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆడవాళ్లు, అగ్రకులపేదలు, ఎంబిసీలు, సంచార జాతులు, ఏ కులాలనికి ఆ కులం వాళ్ళు ఇలా అందరూ ఐక్యమై జనాభా ధామాషా ప్రకారం పోరాడాలి. మరోకపక్క ప్రభుత్వం, బీసీలు ఎవరికివారుగా కొత్త పిటిషన్లతో లీగల్‌ ఫైట్‌ చేయాలి. కానీ అది ప్రజా ఒత్తిడి లేకుండా ఉపయోగం లేదు. పొలిటికల్‌ ప్రెషర్‌తో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. బీసీలు ఓటు శక్తిని ఉపయోగించి, ఎన్నికల్లో పాలకులను శిక్షించాలి. ఇది ఒక సామాజిక విప్లవ పోరాటంగా బీసీలు తమ హక్కుల కోసం పోరాడకపోతే, పాలక వర్గాలు ఎప్పటికీ ఇవ్వవు.

తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు బీసీ రిజర్వేషన్‌ బిల్లులకు మద్దతు ఇచ్చాయి. కానీ గవర్నర్‌ వద్ద ఆగిపోయింది ఎందుకంటే, ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్ర. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ (త్రిపురా మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నాయకుడు) బిల్లును ఆమోదించలేదు. ఇది ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించేదిగా ఉంది. బీసీలు ఇప్పుడు గవర్నర్‌పై ఒత్తిడి తేవాలి, రాజ్‌భవన్‌ను ముట్టడిరచాలి.

గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మను 2024 జూలైలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క సలహాపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. అతను బీజేపీ నాయకుడు, త్రిపురా మాజీ డిప్యూటీ సీఎం. కేంద్రం రాష్ట్రాలపై నియంత్రణకు ఉదాహరణ. గవర్నర్లు పార్టీ ఏజెంట్లుగా మారారు. బీసీలు మా హక్కులను ఎందుకు అడ్డుకుంటున్నారని ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాలి.

హైకోర్టు, సుప్రీం కోర్టులు ‘‘సాధ్యం కాదు’’ అనే వాదనను తిరస్కరించాయి. బీసీ సంఘాలు (జేఏసీ) అక్టోబర్‌ 18న బంద్కు పిలుపునిచ్చాయి. బీజేపీ దగ్గర (కేంద్రం, గవర్నర్‌) ఆగిపోయిందని తెలిసినా మద్దతు బిజేపి ఎంపి, బిసి నాయకుడి హోదాలో తనతో పాటు ఒక గుంపును కూడగట్టుకొని బిజేపి రాష్ట్ర పార్టీని అడగడం ఎందుకు? ఇది వ్యూహాత్మకం మోసం. బీజేపీని పార్టీల ఇక్కడ మద్దతు చెప్పి గవర్నర్‌పేరుతో, రాష్ట్రపతి పేరుతో అడ్డుకుంటాయి. ఈ మోసాన్ని నిజమైనా స్వతంత్ర బీసీ సంఘాల ఉద్యమశక్తులు ఇప్పుడు ప్రజా ఉద్యమాన్ని పాలక పార్టీలపై ఆధారపడకుండా నిర్మించాలి. ఇది సామాజిక విప్లవంగా మారాలి. బీసీలు అణగారిన వర్గాల కులాతో ఐక్యమై పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు కేవలం చట్టం కాదు, సామాజిక విప్లవం. పాలక పార్టీలు అడ్డుకుంటున్నాయి, కానీ బీసీలు లేచి పోరాడితే, 42% సాధ్యమే. ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారాలి. బీసీలారా, లేవండి, ఐక్యమవండి, విజయం సాధించండి!

-పాపని నాగరాజు, కొంకల వెంకటనారాయణ (సత్యశోధక మహాసభ)

Tags:    

Similar News