ఇండియా.. ఇజ్రాయెల్ లా చేయలేదా? ఎందుకు?

పహల్గాం దాడి తరువాత దేశంలో పెరిగిన భావోద్వేగాలు;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-26 07:33 GMT

(మూలం.. సుబీర్ భౌమిక్)

పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హత్య చేయడంతో యావత్ భారత్ ఆగ్రహంతో రగిలిపోయింది. ప్రజలంతా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు తగిన బుద్ది చెప్పాలని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రజల మనోభావాలను ప్రకారం వ్యవహరిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తొందరపాటు వల్ల మన బలగాలు ప్రజలకు నష్టం జరగొచ్చు. ప్రణాళికబద్దంగా వ్యవహరించకపోవడం వల్ల కూడా మనం బలాన్ని ప్రయోగించే అవకాశాన్ని కోల్పోతాము. దీనికి 1971 నాటి యుద్ధమే గొప్ప ఉదాహారణ.

పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత్ మొదటి దాడి దౌత్యపరంగా ప్రారంభించింది. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, మనదేశానికి వచ్చిన పాక్ జాతీయులను యుద్ధ ప్రాతిపదికన వెనక్కి పంపే పనిమొదలు పెట్టింది. పాక్ లోని ఉన్న దౌత్య సిబ్బందిని తగ్గించింది.
ఇక్కడ సింధు నదీ జలాల ఒప్పందం గురించి ఓ విషయం ప్రస్తావించాలి. భారత్ - పాక్ మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం మధ్యవర్తిత్వంగా వ్యవహరించింది ప్రపంచ బ్యాంక్.
అయితే ఈ ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వెనక్కి తగ్గగలదా? ఇలా చేస్తే భవిష్యత్ లో దాని నుంచి వచ్చే నిధుల ప్రవాహం ఆగిపోతాయా? మన దగ్గర సింధూ నీటిని నిలిపి ఉంచడానికి తగినన్నీ డ్యామ్ లు ఆనకట్టలు ఉన్నాయా? నదీ జలాలను ఆపివేయడం అంటే దానర్ధం ఏంటీ?
ప్రజల కోరిక ప్రకారం వెళ్లగలమా?
భారతీయులు ప్రస్తుతం పహల్గామ్ దాడులపై రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడంతో ఆసక్తి చూపడం లేదు. పాకిస్తాన్ పై వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి ఒక లోపం అని హోంమంత్రిత్వశాఖ అఖిలపక్ష సమావేశంలో అంగీకరించింది. ఒక ప్రసిద్ద పర్యాటక ప్రదేశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారని నిఘా సంస్థలు అంచనావేయలేకపోయాయి.
స్థానిక భద్రతా సంస్థలు, కేంద్ర భద్రతా సంస్థల మధ్య స్పష్టమైన సమన్వయలోపం ఇక్కడ కనిపిస్తోంది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ (రిటైర్డ్) గగన్ జిత్ సింగ్ మాట్లాడుతూ.. పహల్గామ్ విషాదం ఒక స్పష్టమైన నిఘా వైఫల్యంగా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకాశ్మీర్ లో పరిణామాలు ప్రశాంతంగా ఉన్నాయని కేంద్రం ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపుతోందని అన్నారు.
జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉండగానే ఇలాంటివి జరగడం అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం ఆరాటపడే ఛానెల్లు, యాంకర్లు, ప్యానెల్ లోకి వచ్చే యాంకర్లు ఉగ్రవాదంపై కారియాలు, మిరియాలు నూరుతూ ప్రభుత్వం వెంటనే దాడి చేయాలని, ఉగ్రవాదానికి గుణపాఠం నేర్పాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఇజ్రాయెల్ ను చూసి నేర్చుకోవాలా?
గాజాలో హమాస్ కు ఇజ్రాయెల్ చేసినట్లుగా భారత్ కూడా చేయాలని జాతీయవాదులు సూచిస్తున్నారు. ప్రాణ నష్టం ఉన్నా.. వెనకడుగు వేయవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొంతమంది పీఓజేకేను వెనక్కి తీసుకోవాలని వాదిస్తున్నారు.
ఉగ్రవాద దాడికి పరిష్కరంగా పాక్ ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సూచించారు. దీనికి ప్రయత్నించడం సాధ్యమే కానీ.. మరీ అంత సులభంగా మాత్రం కాదు.
పరిష్కారం ఏంటీ?
పహల్గామ్ ఉగ్రవాద ఘటనపై మన దగ్గర సులభమైన పరిష్కారం లేదు. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తి కలిగిన దేశం. హమాస లాంటి రాజ్యేతర ఉగ్రవాద సంస్థ కాదు. కాబట్టి గాజాలో ఇజ్రాయెల్ చేసినట్లు మనం చేయలేము.
పీఓజేకేలో ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ తో యుద్దం సంభవించే ప్రమాదం ఉంది. ఉగ్రవాద మూలాలను పూర్తిగా తుంచివేయకుండా బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్స్ వంటివి చేయడం అంతమంచి ప్రయోజనాలను అందించవు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ద్వారా మనకు బాలాకోట్ వంటి దాడులు పనిచేయవని నిరూపితమైంది.
బాలాకోట్ లాంటే స్పందనేనా?
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలాకోట్ దాడి పాకిస్తాన్ ఏమరపాటుగా ఉన్నప్పుడు సాధ్యమైంది. కానీ ఇప్పుడు పాక్ వైమానిక దళం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంది. ఈ ప్రతిస్పందన ఇప్పడు భారీ స్థాయిలో ఖరీదైనది కావచ్చు.
నిజమైన శత్రువు పాక్ సైన్యమేనా?
భారత్ కు నిజమైన శత్రువు ఉగ్రవాద సంస్థలు కావని, వారి స్పాన్సర్ అయిన పాకిస్తాన్ సైన్యం అని కొంతమంది పదవీవిరమణ చేసిన భారత సైనిక అధికారులు సూచించారు. వారే నిజమైన బాధను అనుభవించాలని చెప్పారు. కొన్నాళ్లుగా పాకిస్తాన్ సైన్యానికి నిజమైన బాధ కలుగుతోంది.
అది బలూచ్, సింధ్, ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలో ఉగ్రవాదులు వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. వందలాది పాక్ సైనికులు అసువులు బాస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బలూచ్ వీరులు రైలును హైజాక్ చేసి సైన్యానికి సవాల్ విసిరారు. ఇది వారి యుద్ధ పటిమ ఎంత అసమర్థంగా ఉందో ప్రపంచానికి బయటపెట్టింది.
ఈ దాడి ఆ దేశానికి తీవ్రమైన అవమానాన్ని మిగిల్చింది. తాము రెండువందల మంది పాక్ సైనికులను ఉరితీసినట్లు బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
బలపడుతున్న తిరుగుబాటుదారులు..
గత కొన్ని సంవత్సరాలుగా బలూచ్ తిరుగుబాటుదారులు బలంగా, ధైర్యంగా అభివృద్ది చెందారు. మార్చి నెలలోనే రైలు హైజాక్, సైనిక కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడి, ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ కి చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను మోటార్ సైకిళ్ల పై వచ్చిన గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.
ఇందులో ఒకటి బలూచిస్తాన్, మరొకటి పంజాబ్ లో జరిగింది. ఈ నిరాశ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హిందువులపై, కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలలో కనిపించింది. తరువాత పహల్గామ్ దాడిని ఐఎస్ఐని ప్రేరేపించి ఉండవచ్చు.
తక్కువ ఆయుధం..
ముప్పై సంవత్సరాల క్రితం నా పుస్తకం ఇన్సర్జెంట్ క్రాస్ ఫైర్ లో ఒక విషయం ప్రస్తావించాను. వలసరాజ్యాల అనంతరం తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం దక్షిణాసియా లక్షణంగా ఉందని, ఇది తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధంగా వాడుకుంటున్నారని నేను వాదించాను.
కాశ్మీర్ లో పాకిస్తాన్ తిరుగుబాటుకు మద్దతు ఇస్తే.. తూర్పు పాకిస్తాన్ లోని బెంగాల్ తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని సూచించాను. అప్పట్లో భారత్ టిబెటియన్లకు మద్దతు ఇస్తే , వారు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందించారు. అయితే షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తరువాత ఇవి తగ్గుముఖం పట్టాయి. నేను పుస్తకంలో చెప్పినట్లుగా భారత ఉపఖండంలోని నాయకులు ఖరీదైన సాంప్రదాయ యుద్దాలను నివారించారు. వారి శత్రుత్వాలను షాడో లైన్ లోనే ఉంచారు.
మళ్లీ షాడోవార్?
దక్షిణాసియాలో తిరుగుబాటుదారుల ఎదురుకాల్పుల రెండో దశ ప్రారంభం అయింది. పాకిస్తానీలు కాశ్మీర్, పంజాబ్ లేదా ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు. మరో వైపు భారత్ కూడా బెలూచిస్తాన్, వాయువ్య ప్రాంతాలు, సింధ్ లలో ఇదే తరహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. అయితే ఇవన్నీ రహస్యంగా జరిగేవి. ఎంత రహస్యంగా ఉంటే.. ఫలితాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. వైఫల్యానికి సిద్దంగా ఉంటేనే గొప్పలు బయటకు చెప్పుకుంటారు.
మనదాడి ఎలా ఉండాలి..
ఈ తిరుగుబాటులకు మద్ధతు ఇస్తున్నందుకు పాకిస్తాన్, భారత్ ను నిందిస్తే.. దానికి న్యూఢిల్లీ ఎందుకు సిగ్గుపడాలి. కానీ ఇక్కడ కూడా అనేక చిక్కుముడులు ఉన్నాయి.
భారత్ ఇప్పడు తనని తాను ఉగ్రవాద బాధితుడిగా చూపించుకోవచ్చు. కానీ పాక్ పట్టుకున్న ఆయుధాన్ని మనము పట్టుకుని, ఉగ్రవాదులను రక్తసిక్తం చేస్తే, చివరికి అంది రెండు దేశాల మధ్య రక్తసిక్తం అవడానికి దారితీస్తుంది.
తొందరపాటు ప్రతిస్పందన పనికిరాదు..
పురుషాధిక్య సమాజమైన మనదేశంలో అందరిని సంతోషం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. ఒక శత్రువు తన మోకాళ్లపై నిలబడటానికి కారణం ప్రణాళికబద్దంగా వ్యవహరించకపోవడమే.
1971 లో బెంగాలీ తిరుగుబాటు పాకిస్తాన్ ను విచ్చిన్నం చేయడానికి సమర్థవంతంగా ప్రణాళికలు అమలు చేశారు. కానీ ఆ వైఫల్యాల నుంచి పాక్ సైన్యం అసలు పాఠాలు నేర్చుకోలేదు. కాశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలలో దాని దుశ్చర్యను కొనసాగించింది. ఇప్పుడు ఆ దేశం మరోసారి విచ్ఛిన్నం అవడానికి సిద్దంగా ఉంది.
భారత్ భయపడుతుందా?
భారత్ ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్నందున కాశ్మీర్, పంజాబ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ తరువాత పర్యాటకుల తాకిడి కాశ్మీర్ లో బాగా పెరిగింది. దీనికి స్పష్టమైన ఉదాహారణే.. పహల్గామ్ దాడి తరువాత అక్కడ కనిపించిన స్పందన. రాష్ట్రం అంతటా కొవ్వొత్తుల నిరసనల ర్యాలీలు కనిపించాయి.
ఫుంజుకున్న ఆర్థిక వ్యవస్థ..
మనదేశం పర్యాటకరంగంలో బాగా ప్రగతి కనపరుస్తోంది. దానికి చోదక శక్తిగా జమ్మూకాశ్మీర్ ఉంది. గత మూడు సంవత్సరాలుగా ఈ కేంద్రపాలిత ప్రాంతానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య 1.5 మిలియన్లు దాటింది.
తలసరి ఆదాయాలు, స్థానిక ఆదాయాలు బాగా పెరిగాయి. ఇది కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై బాగా కనిపిస్తోంది. అక్కడి ప్రజల మానసిక స్థితులలో భారీ మార్పులు వచ్చాయి. ఈ ఉగ్రవాదదాడి పర్యాటక రంగాన్ని విచ్చిన్నం చేస్తుందని స్థానికులు భయపడుతున్నారు.
పాక్ ఎప్పుడూ పాఠాలు నేర్చుకోదు..
ఆర్థిక సమైక్యత భావోద్వేగ సమైక్యతకు పునాది వేస్తుంది. తన దగ్గర ఉన్న ప్రాంతాలు ఇలా ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి, చేయడానికి పాక్ ప్రయత్నించలేదు.
కాబట్టే వారు తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ ను కొల్పోయారు. ఖనిజ వనరులు అధికంగా ఉన్న బలూచిస్తాన్, ఖైబర్, సింధ్ లలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
బీజేపీ మోసపోకూడదు..
బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పడం గురించి బాగా ఆలోచిస్తుంటే.. అది ప్రజల అభిప్రాయాన్ని చూసి మాత్రం కాదు. పాకిస్తాన్ ఏదైతే తన బలం అని మురిసిపోతుందో నిజానికి అదే బలహీనత కావచ్చు.
మనదేశంలో మిజోరాంలో ప్రభుత్వాలను నడుపుతున్న మిజో తిరుబాటుదారులు ఇంతకుముందు దేశంపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వారే. చర్చల ద్వారానే సామరస్యకంగా సమస్యలను పరిష్కరించుకున్నారు.
నొప్పి కలిగే ప్రదేశంలోనే..
పాకిస్తాన్ ఒక దేశంగా విఫలమైంది. దాని జాతి నిర్మాణం పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఇప్పడు దాని పతనాన్ని వేగవంతం చేయాలి. ఇది దీర్ఘకాలిక పనులు, వీటికి ఆడంబరాలు అవసరం లేదు. ఎన్నికల మైలేజ్ చూసుకోకూడదు. జాతీయ విధానాలతో సరైన లెక్కలు కట్టి, రూపొందించి అనుసరించాలి. బ్యాలెట్ బాక్స్ లెక్కలను కాసేపు పక్కన పెట్టాలి. స్వల్పకాలిక లాభాల కొరకూ శత్రువుకు అలుసై పోకూడదు.
గొప్ప రాజనీతిజ్ఞుడు మాకియవెల్లి, చాణక్యుడు రెండు సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంతర్గత శత్రవులను నివారించడానికి షమ్, బాహ్య శత్రువుల కోసం ‘భేదం’కి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దండన అనేది చివరి ఆప్షన్ గా ఉండాలన్నారు.
( ది ఫెడరల్ అన్ని అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు, రచయితవి. వాటిని ఫెడరల్ తప్పనిసరిగా ప్రతిబింబిచవు)


Tags:    

Similar News