‘దేశమంతా ప్రార్థనా స్థలాలను జాతీయ చేయాలి’

నిర్వహణను ప్రయివేటు కాంట్రాక్టర్లకు టెండర్ పై అప్పగించడం అవసరం అంటున్నారు ప్రముఖ రచయిత బిఎస్ రాములు;

Update: 2025-01-04 11:31 GMT

చాలా దేవాలయాలలో కొబ్బరికాయలు , అమ్ముకోవడానికి వేలం / టెండర్ వేస్తారు. అలాగే తలవీలాలకు, షాపులకు, వాహనాల పార్కింగ్ కు వేలం / టెండర్ ఉంటుంది. అదే పద్దతిలో దేవాలయంను వేలం/ టెండర్ ద్వారా అలాట్ చేస్తే టోల్ గేట్ కాంట్రాక్ట్ లాగా వసూలు చేసుకుంటారు. వారే పూజారులను సిబ్బందిని పెట్టుకుంటారు. టెండర్/వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఆ ఆదాయాన్ని ప్రజల విద్యకు వైద్యానికి సంక్షేమానికి ఉపయోగించవచ్చు. వేలం ద్వారా శిథిల దేవాలయాలు మసీదులు చర్చిలు కూడా బాగు పడుతాయి. మసీదులు చర్చీలు కూడా ఈ పద్దతిలో కెటాయించవచ్చు. ఆదాయం గల దేవాలయాలను , శిథిల ఆలయాలు, ఆదాయం లేని ఆలయాలను ఒక యూనిట్ గా చేసి టెండర్లు పిలిస్తే, శిథిలాలయాలు కూడా బాగు పడుతాయి . ఇలా దేశ వ్యాప్తంగా గుడులను, మసీదులును, చర్చిలను జాతీయం చేసి ప్రయివేటు కాంట్రాక్టర్లకు టెండర్ పై అప్పగించడం అవసరం.

గుడి అందరిసొత్తు

గుడులు రాజుల సొమ్ముతో కట్టబడ్డాయి. ప్రజల సొమ్ముతో కట్ట బడ్డాయి. కనక బ్యాంకులను జాతీయం చేసినట్టు జాతీయం చేయడమే సరైనది. కోటలు బురుజులు వ్యక్తిగత ఆస్తి కాదు. గుడులు పూజారుల వ్యక్తి గత ఆస్తికాదు. అవి పూజారులకు సంపాదన కోసం పెట్టుకున్న దుకాణాలు కాదు. కాకూడదు. అసలు గుడులలో పూజారులే అవసరం లేదు. ప్రజలు ఎవరికి వారు మొక్కుకుని పోతారు. .. గ్రామాల్లో గ్రామ దేవతల వలే!!

ఇదే పద్దతిలో పురావస్తు , చారిత్రక ప్రదేశాలను టెండర్ పై కేటాయించడం ద్వారా వాటిని అభివృద్ది పరచవచ్చు. అందరం అనుకుంటే ఇది సాధ్యం. ఉదాహరణకు అదానీ అంబానీ, బిర్లా టాటాలు, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజాలు టెండర్ ప్రక్రియలో పాల్గొంటే భక్తుల సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రత , విద్య వైద్య సదుపాయాలు ఎంతో మెరుగవుతాయి. తాజ్ మహల్ కు, కాశీ విశ్వనాథ్ దర్శనానికి ఎంత టికట్ అయినా ప్రజలు ఉత్సాహంగా కొంటారు. టెండర్ తీసుకునేవారికి లాభాపేక్ష తో పాటు , దైవ దృష్టి కూడా ఉంటుంది.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందికి గుడులు

హైదరా బాద్ లో బిర్లా మందిర్ కట్టారు. వ్యాపార దృష్టి తో కాకుండా వారికి కూడా బ్రాండ్ ఇమేజ్ , సామాజిక గౌరవం, దైవ భావన కలగలిసిన దృష్టితో నిర్మించారు. పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమం, ద్వారా 1300 గ్రామాలకు శాశ్వతంగా మంచినీటి సప్లయి ఏర్పాటు చేయడం జరిగింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సులు బిలిటీ ఫండ్స్ ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సి వుంటుంది. అలా శిథిలాలయాలను కలిపి ఒక యూనిట్ గా వేలం వేస్తే అవి కూడా బాగుపడుతాయి.కొన్ని లక్షల ఆలయాలు బాగుపడతాయి.

సి యస్ ఆర్ ఫండ్స్ కిందికి గ్రామ స్తాయికి ప్రవహించాలి. ప్రవహిస్తాయి. ఈ విధానంలో అనుసంధానించడం ద్వారా సి యస్ ఆర్ ఫండ్స్ గ్రామ స్తాయికి ప్రవహించాలి. ప్రవహిస్తాయి. దేవాలయాల ఆదాయం జియస్టీ పరిధిలోకి తేవడం ద్వారా గణాంకాల లోటుపాట్లు తగ్గుతాయి.

అన్ని అవకతవకలు మాయమవుతాయి

టెండర్ ద్వారా కెటాృయించడం వల్ల అధికారుల, ట్రస్టీల , పూజారుల అవినీతి, అక్రమాలు, దాష్టీకం, కుల వివక్ష తగ్గుతాయి. నోట్ల రద్దు కాలంలో తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మెంబర్ వద్ద 350 కోట్ల నగదు బయట పడిందంటే అవినీతి , దోపిడీ ఎంత పెద్ద ఎత్తున సాగుతున్నది ఊహించుకోవచ్చు . ప్రజల సొమ్ము తిరిగి ప్రజల అభివృద్ధికి ఉపయోగ పడాలి. ఏమంటే ప్రజలు దేవుళ్లకు మొక్కేది, మొక్కులు సమర్పించేది తమ బతుకులు బాగుపడాలని అభివృద్ది చెందాలని! కనక వారి డబ్బు వారి విద్య వైద్యం, ఉపాధి గృహ వసతి తదితరాలకు మాత్రమే ఉపయోగించాలి. బ్యాంకుల్లో దాచిన సొమ్ము పై వడ్డీ కూడా వాటికే ఉపయోగించాలి. భక్తుల ద్వారా వచ్చిన బంగారం వెండి కరిగించి రిక్వు బ్యాంకులో జమ చేయడం ద్వారా ప్రభుత్వం పరపతి ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతుంది. అనంత పద్మ నాభ స్వామి, వంటి దేవాలయాల్లో, మసీదుల్లో చర్చిల్లో పేరుకు పోయిన బంగారం నగలు ఆస్తులు వెలికి తీసి రిజర్వు బ్యాంకు అధీనంలో పెట్టడం ద్వారా దేశం ప్రపంచంలో సంపన్న దేశంగా తల ఎత్తుకునే అవకాశం పెరుగుతుంది.

Tags:    

Similar News