సిద్ధాంతాలు ఇక చాలు, ఇపుడు కావలసింది కొత్త చూపు

స్రీ పురుష సంబంధాల విషయానికి వస్తే కులంలేదు వర్గం లేదు, మతం లేదు.

Update: 2025-09-29 11:08 GMT
Image Source: Texas Orator

కొన్ని వాస్తవాలను రోట్లో పోసి దంచి నూరి పొడి కొట్టి వస్త్రగాలం పట్టి కొంచెం తేనె కలిపి గోళీలు చేస్తారు. చింతా మణి గోళీలివి. సర్వ చింతలను రూపు మాపే గోళీలు అని తినిపిస్తారు.

మరొకరు మరికొన్ని చెట్ల వేర్లు , బెరడు, పూలు కాయలు దంచి నూరి తేనె కల్పి కొత్త చింత మాన్పించే మణి గోళీలని ముందుకు వస్తారు. ఇక వాళ్లు మనిషిని వదిలి సిద్దాంతాల ప్రకారం మనుషులను కొలుస్తారు. విభజిస్తారు, వర్గీకరిస్తారు. లోకంలో ఇలా రకరకాల సిద్దాంతాలు, వాటి ప్రకారం పరిష్కారాలు చూపుతారు.

భూగోళమంత మనిషిని పిడికెడంత సిద్దాంతంలో ఇరికిస్తారు. సిద్దాంతం ప్రకారం సాగదీస్తారు. వ్యాఖ్యానిస్తారు. అలాంటి అనేక సిద్దాంతాల్లో ఇటీవల కులం మతం వర్గం, దేశం అనే దృక్పథాలు బాగా ప్రాచుర్యం పొందాయి. వాటి ప్రకారం కథలు నవలలు, సినిమాలు,,కళలు సాహిత్యం కూడా వెలువడ్డాయి. ఆ సిద్దాంతాల ఆసరాతో ఉద్యమాలు , సాధికారికత, రాజకీయ అధికార సిద్గాంతాలు, ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు కలుపుకు వస్తూ మరోవైపు విభజిస్తూ రావడం జరుగుతున్నది. వీళ్లు మావాళ్లు , వీళ్లు మా వాళ్లు కారు అంటూ సరిహద్దులు,  అడ్డు గోడలు నిర్మిస్తారు. ఇవి ఎంత అసహజమైన అడ్డుగోడలో, ఆ సిద్దాంతాలు ఎంత అసమగ్రమో ఒకసారి చూద్దాం. చేద్దామంటే టన్నుల కొద్దీ , లారీలకొద్దీ చర్చలు చేయవచ్చు. ముందు చిన్నగా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

కొందరు గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకుని వాస్తవాలను చూడ నిరాకరిస్తారు. అలాంటి ఒకాయన గురించి ఈ మధ్య ఒక మిత్రుడు మాటల సందర్భంలో చెప్పాడు. అతడెవరో గొప్ప మేధావి అట! అతడు తన వాదనా పటిమతో భారత దేశంలో వర్గం తప్ప కులమే లేదని గొప్ప పుస్తకం రాసాడని చెప్పాడు. ఆ పుస్తకం నేను చూడలేదు. చదవ లేదు. ఎవరూ చదవ నవసరంలేదు.

అయితే అతడి దృష్టిలో వర్గం కూడా లేదని ఆయన ప్రకారం ఆడ మగ అనే రెండే వర్గాలున్నాయని అతని మనసు లో భావమై వుంటుందని ఆ మిత్రునితో అన్నాను. . ఆ మేధావి వ్యభిచారి అయి వుంటాడు. ఫ్రీ సెక్సు ప్రాక్టీషనర్ అయి వుంటాడు. మనువు కూడా స్రీలకు కులం లేదన్నట్టు స్త్రీలంతా శూద్రులే అన్నాడు. స్త్రీలందరు   శూద్రులైతే వారికి పుట్టిన వారంతా శూద్రులవుతారు బ్రాహ్మణులు, క్షత్రియులు వగైరా కాలేరుగా. ఇది మనువుకు తోచి వుండదు. మనువు లాగే వీరూ అంతే! వారికి వర్గం అనే పదం యొక్క సరైన అర్థంకూడా తెలిసి వుండదు.

కులం అనేది నేడు పెళ్లికి , కులవృత్తికి, కుల ఐక్యతకు, రాజకీయ అధికారానికి అవసరమవుతున్నది. అలాగే రిజర్వేషన్లకు కులం అవసరమవుతున్నది. కనక వారు రిజర్వేషన్ లేని కులంలో పుట్టినవారైవుంటారు. వారు కులాధిక్య లాభాలు అనుభవిస్తూ కులం లేదని అంటున్నారు. . కులాధిక్యతను అనుభవించేవారు కులం ఎక్కడుందయా ఈ కాలంలో అని అంటుంటారు. వారు మానసికంగా కులాలాతీత వ్యభిచారి కాకుండా కులం లేదు అనలేరు. వారికి స్త్రీపురుషుల సృష్టి కార్యం తప్ప ఉత్పత్తి కార్యం తెలియదు. వారెప్పుడూ ఉత్పత్తిలో పాల్గొన్న వారు కాదు.

ఉత్పత్తిలో పాల్గొన్నపుడే ఉత్పత్తి నైపుణ్యాలు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్చి సాధనాల విలువ , మానవ సంబంధాల విలువ, సంస్కృతి విలువ తెలుస్తుంది. కులమెక్కడిది? వర్గమే ప్రధానం అనే వారు ఎన్నడూ ఉత్పత్తిలో పాల్లోనలేదని అర్థం. ఉత్పత్తిలో పాల్గొనినపుడే ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి నైపుణ్యాలు, ఉత్పత్తి సాధనాలు, అందులో ఉపయోగించే శ్రమశక్తి విలువ తెలుస్తుంది. అపుడే ఆ శ్రమశక్తి విలువల మారకంలో వివిధ ఉత్పత్తుల ఉత్పత్తి నైపుణ్యాల , సేవల విలువలలో, మానవ సంబంధాలు, సంస్కృతి, కులం ప్రకారం విలువలు నిర్ణయించడం జరుగుతుంది.. ఏ ఉత్పత్తిలో పాల్గొనని వారికి కులం కుల సంబంధాలు నిర్ణయించే తీరు తెలిసే అవకాశం లేదు. వాల్లకు కావల్సిందల్లా అందరిరిపై ఆధిపత్యం. తాము చెప్పింది వినాలనే ఆధిపత్యం. ఈ ఆధిపత్యం, పైత్యం వదిలి వాల్లెన్నడూ ఇతరులు చెప్పినట్టు వినరు, ఇతరులు చెప్పినట్టు వినే కార్యకర్తగా పని చేయరు. అలాంటి దశ వస్తే అక్కడ నుండి తప్పుకొని కొత్త సిద్దాంతాలు చేసి తన మాట వినేవారిని తయారు చేసుకునే పనిలో పడుతారు. వీరికి కుల సంబంధాలు, కుల వృత్తి సంబంధాలు మాత్రమే కాదు, వర్గం , వర్గ సంబంధాలు కూడా తెలియవు. వర్గం అనే పదానికి కూడా వీరికి అర్థం తెలియదు. ఆ పదాలు వాడడం వీరికీ ఒక ఫ్యాషన్. ఒక సమాజిక గౌరవం సాధికారిత పొందడం కోసం చేసే ప్రక్రియ!!

వాస్తవాలు చూద్దాం. ఒక దొర, విశ్వనాథ వేయి పడగలు నవలలో బ్రాహ్మణుడు , ఒక భూస్వామి ?, ఒక పోలీసు అధికారి మహిళలను అనుభవించినపుడు ఏ కులం ఫీలింగ్ అడ్డంకి కాలేదు.ఏ వర్గం ఫీలింంగ్ అడ్డం కాలేదు. అతడు నేను భూస్వామిని! దొరను, ఛ ! చిన్న కులం వాళ్లతో శృంగారమా అని అనుకోలేదు. ఇలా ఇక్కడ వర్గ తత్వం లేదు. కులతత్వం లేదు. ఉన్నదల్లా ఆమె స్త్రీ నేను పురుషుడను అనే తత్వమే!! ఇలా స్రీ పురుష సంబంధాల విషయానికి వస్తే కులం లేదు వర్గం మతం లేదు.

ఉత్తర ప్రదేశ్లో ఇటీవల హత్రాస్ లో దళిత అమ్మాయిని కొందరు కలిసి రేప్ చేసినపుడు వారికి మేం ఠాకూర్లం ఈ కింది జాతి వాళ్లతో సంబంధం తప్పు అనుకోలేదు. ఈ మధ్య విదేశీ వనిత ఇండియాలో రేప్ కు గురైంది. కనక స్త్రీ పురుషుల మధ్య దేశం వేరు అనేది కూడా అడ్డంకి కాలేదు. అందుకే ఒక విదేశీయుడు అంటరాని తనం గురించి చెప్పింది విని స్త్రీల పట్ల కూడా అంటరాని తనం పాటిస్తారా అని అడిగితే నోరు తెరిచాడట! ఏదో దేశంలో ఐక్య రాజ్య సమితి తరఫున శాంతి సైన్యం పంపబడింది. కొన్నాళ్లకు అక్కడి నహిళలకు ఈ సైనిక అత్యాచారాలతో పిల్లలు కలిగి పెరిగారట! ఇలా వర్గ సమస్య, కుల సమస్య మత సమస్య, దేశ సమస్య పురుషుల మధ్యనే తప్ప స్త్రీ పురుషల మధ్య వర్తించదు అని తేలుతున్నది.

కనక వర్గాలు రెండు. ఒకటి స్త్రీలు. కెండు పురుషులు అని! వర్గం కులం మతం ఎంత నిజమో స్త్రీ పురుషుల మధ్య ఇది కూడా అంతే నిజం!! అనగా మనువు చెప్పినట్టే సగం జనాభా అయిన మహిళల పట్ల కులం మతం వర్గం, దేశం, జాతి, దృక్థథాల అడ్డు గోడలు తొలగి పోయి సహజ స్క్రీ పురుష భావనలతో పురుషులు కొనసాగుతున్నారు. ఇలా వీటిని ప్రకృతి సహజ గుణాలు నిర్ణయిస్తున్నాయి. కులం వర్గం మతం దేశం దృక్పథాలను సమాజం నిర్ణయిస్తున్నది!!

అందువల్ల ఇలా కులం మతం వర్గం దేశం దృక్పథాలు పురుషులకు సంబంధించినవి. పితృస్వామిక పురుషాధిపత్యానికి సంబంధించినవి. కొందరు స్త్రీలు తమ ప్రయివేట్ అన్ టచ్బుల్ అవయవాల నుపయోగించి ఉన్నత వర్గాలతో ప్రయోజనం, గౌరవాలు, సంపదలు, పదవులు, పొందుతున్నారు. .

సైమన్ దిబోవర్ ‘సెకండ్ సెక్స్’ అనే పుస్తకంలో మార్క్సు చెప్పిన భౌతిక వాదం, చారిత్రక భౌతిక వాదం, అదనపు విలువ, మొదలైనవి ఎంత అసమగ్రమో, ఎంతగా పురుషుల పరంగా రూపొందిన సిద్దాంతాలో వివరించారు. అయినప్పటికీ పురుష నాయకత్వం పాత విధానాలనే కొనసాగిస్తున్నది. అంబేద్కర్ కులంనిర్నహింతే పాత్ర, కులం పుట్టుక, కుల సంబంధాలు ఎంత బలీయంగా కొనసాగుతున్నాయో వివరించారు. అయినా కొందరు వర్గం ఒకటే ప్రధానం అంటూ పాత విధానాలు కొనసాగిస్తున్నారు. వర్గాలను రూపొందిస్తున్నది కులవ్యవస్థ, వర్ణ వ్యవస్థ అని వీరికి తెలియదా? తెలుసు. కాని అలా గుర్తిస్తే వారి ఆధిపత్యం పోతుంది కనక అంగీకరించరు.

అసలు విషయం ఏమంటే ఈ పురుషుల కులం మతం వర్గం, దేశం, సిద్దాంత వలయాల నుండి బయట పడి మహిళలు ప్రపంచంలో సగం జనాభా అయిన తమ కోసం నూతన వాస్తవిక అవగాహనను దృక్పథాలను అలంకార శాస్త్రాలను, జ్ఞాన సిద్దాంతాలను రూపొందించుకోవడం!! ఇలా మహిళలు కొత్త చూపు రూపొందించుకోవాలి

Tags:    

Similar News

అంతరాలు