మోదీ సర్కార్ ఊగిసలాట దేనికి సంకేతం

అధికారంలోకి వచ్చిన రెండునెలల నుంచి మోదీ ప్రభుత్వం విధాన నిర్ణయాల్లో ఊగిసలాట ధోరణి కనబరుస్తోంది.

Update: 2024-08-30 06:14 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా వివాదాస్పద నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) పై గుర్రుగా ఉన్నాయి. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి తాజాగా ఏకీకృత పెన్షన్ స్కీమ్(యూపీఎస్) ను ప్రకటించింది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థ నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)లో భాగమైన వివిధ సంఘాలు ఈ పథకం కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ అని విమర్శిస్తున్నాయి.
వివిధ ప్రభుత్వ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్‌ల కీలక డిమాండ్‌ను హృదయపూర్వకంగా ఆమోదించినట్లుగా ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఆచరణలో మాత్రం యూపీఎస్, ఎన్పీఎస్ ను పోలీ ఉందని ఆ సంఘాలు చెబుతున్న మాట. పాత స్కీమ్‌ను పునరుద్ధరించాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇంకా ఎలాంటి నిరసన కార్యక్రమాలు ప్రకటించనప్పటికీ, అందుకు భవిష్యత్ లో తగిన కార్యచరణతో ముందుకు రావచ్చు.
అసాధారణమైన సమావేశం
ప్రభుత్వం UPS ని ప్రకటించిన రోజున, ప్రధాని మోదీ అసాధారణమైన అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కేంద్రం మధ్య సంప్రదింపుల సంఘం జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం (JCM) సిబ్బందితో సమావేశం అయ్యారు. మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఇది ఆయనపై ఉన్న ఒత్తిళ్లకు సూచన.
వివిధ రంగాలలోని కార్మిక సంఘాలలో, RSS అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) అతిపెద్దది. 2014 నుంచి ఇది ప్రభుత్వానికి విస్తృతంగా మద్దతునిస్తుంది. మారిన రాజకీయ పరిస్థితులలో ఈ సంస్థ ఇతర సంఘాలు లేవనెత్తే డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రతిపక్షాల డిమాండ్
OPS పునరుద్ధరణ డిమాండ్ 2022 నుంచి ప్రతిపక్షాల మదిలో ఉంది. ఆ సంవత్సరం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ దీనిని మొదటిసారి లేవనెత్తారు. ఆ తర్వాత, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఈ వాగ్దానం చేసింది. ఏప్రిల్ 2023లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిజ్ఞను నెరవేర్చింది.
సమస్యను గందరగోళంలో నెట్టేందుకు కేంద్రం చేసిన ప్రయత్నం కొంత పాక్షికంగా విజయం సాధించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే యూపీఎస్‌లోని “యు” అంటే “యు-టర్న్” అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఈ నిర్ణయాన్ని ఆకాశాకెత్తాయి. ప్రతిపక్షాలు, ట్రేడ్ యూనియన్ల డిమాండ్లను నెరవేర్చడానికి మోదీ సుముఖతను UPS సూచిస్తుందని నొక్కిచెప్పాయి.
మిత్రపక్షంగా వ్యవహరించడంలో వైఫల్యం
కొత్త విధానాలు, విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ఏకాభిప్రాయంతో ఉండాల్సిన అవసరం ఉందని మోదీ, బిజెపిలోని అతని సహచరులు భావిస్తున్నప్పటికీ, అయితే ఇందులో సంకీర్ణ భాగస్వాములకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. జూన్ 9న మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఇతర భాగస్వాములతో సంప్రదింపుల సంకీర్ణ ధర్మాన్ని అనుసరించకూడదని మోదీ భావిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలకు పైగా గడిచినా, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో పనిచేసినట్లుగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు సమన్వయ కమిటీ మళ్లీ యాక్టివేట్ కాలేదు, దాని కన్వీనర్‌ను ఎంపిక చేయలేదు. వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి సామూహిక వేదిక లేకపోవడంతో, అనేక సంకీర్ణ భాగస్వాములు బహిరంగ ప్రకటనలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. పర్యవసానంగా, ప్రభుత్వం అస్థిరంగా కనిపిస్తుంది. బలమైన, నిర్ణయాత్మక నాయకుడిగా మోదీ ఇమేజ్ క్షీణించింది.
కూటమి చిక్కులు
ప్రధాని మోదీ మూడోసారి పీఠం ఎక్కినప్పటి నుంచి అనేక విధానాలను ప్రకటించి మరలా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ప్రధాన మంత్రి లేదా ఆధిపత్య పార్టీ శాసనం అమలు చేయని పాలనగా పరిగణించబడుతుంది.
బ్రాడ్‌కాస్ట్ బిల్లును ఉపసంహరించుకోవడం, వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం వంటి ఉదంతాలు మోదీ తన ఆధిపత్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకున్నాయని నొక్కి చెబుతున్నాయి.
బడ్జెట్‌లో కూడా, ఆస్తుల విక్రయం, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై ఇండెక్సేషన్ ప్రయోజనంపై నిర్ణయాలను మార్చడం బిజెపి నష్టానికి ఒక ఉదాహారణ.
మోదీ విజయం ఒక్కటంటే...
ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి, మోదీ తన ప్రధాన మంత్రి అధికారాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్న సందర్భం ఒకటే.. ఒక్క మంత్రివర్గాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపించింది. మంత్రి మండలిలో సభ్యులుగా ఉన్న 72 మందిలో (ప్రధానమంత్రితో సహా), 61 మంది బిజెపికి చెందినవారు (31 మంది కేబినెట్ మంత్రుల్లో 26 మంది, స్వతంత్ర బాధ్యతలు కలిగిన ఐదుగురు ఎంఓఎస్‌లలో ముగ్గురు, 36 మంది జూనియర్ మంత్రుల్లో 32 మంది) .
పోర్ట్‌ఫోలియోలను కేటాయిస్తున్నప్పుడు, నాలుగు ముఖ్యమైన, శక్తివంతమైన మంత్రిత్వ శాఖలను మునుపటి పదవీకాలంలో బాధ్యతలు నిర్వహించిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్‌ లకే అప్పగించారు. ఇతర మంత్రులలో కూడా, నితిన్ గడ్కరీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ హైవేస్‌కు బాధ్యత వహించారు. వీరంతా తమ పనితీరుతో ఇతరల కంటే భిన్నంగా ఉండటంతో సాధ్యమైంది.
వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వాణిజ్యం, పరిశ్రమలు, విద్య, రైల్వేలు, సమాచార ప్రసారాలకు సంబంధించిన ఇతర రాజకీయంగా ముఖ్యమైన కీలకమైన మంత్రిత్వ శాఖలు బిజెపి వద్ద ఉన్నాయి.
100 రోజుల ప్రణాళిక
అయితే, బీజేపీ అధిపత్యం ఏ స్థాయిలో ఉందో ఆ పార్టీ నేతలు కీలక మంత్రిత్వ శాఖలకే పరిమితమయ్యారు. వంద రోజుల ప్రణాళికను రూపొందిస్తున్నామని, కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రచారం సందర్భంగా మోదీ పదే పదే ప్రస్తావించారు.ప్రభుత్వం నిశ్శబ్దంగా ప్రణాళికలు రచించడం, మిత్రపక్షాలను సంప్రదింపులు చేయడం కొనసాగించినట్లు తర్వాత కనిపించకపోతే, ఇప్పుడు వంద రోజుల మైలురాయిని ఆర్భాటాలు లేకుండా దాటడానికి సిద్దమైందా అన్నట్లు ఉంది పరిస్థితి.
మొదటి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న సమయంలో మోదీ అవలంభించిన రాజకీయ వ్యవహారం.. ఇప్పుడు ఆయనకు ఉన్న ప్రధాన పెద్ద బలహీనత. ఉదాహరణకు, అతని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం తన స్వంత పార్లమెంటరీ మెజారిటీని కలిగి ఉండని, సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడే ప్రధానమంత్రి శైలిని ప్రతిబింబించలేదు. బిజెపి.. సంఘ్ పరివార్ రాజకీయ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలను ఆయన నొక్కిచెప్పారు.
యూనిఫాం సివిల్ కోడ్
మోదీ "కమ్యూనల్ సివిల్ కోడ్" అని పేర్కొన్న దాని స్థానంలో "సెక్యులర్ సివిల్ కోడ్" అని లేవనెత్తారు. ఇది చాలా చిన్నది. కానీ రాజకీయంగా బీజేపీ విఫలమైనప్పుడు ఈ శైలిని అవలంభిస్తోంది. అయితే, ఈ అంశంపై చర్య తీసుకోవడానికి మిత్రపక్షాలు అనుమతిస్తాయా? జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసిన వివాదాస్పద వక్ఫ్ బిల్లుతో పాక్షికంగా జరిగినట్లుగా వారు ఉపసంహరణను బలవంతం చేయలేదా? యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో భాగస్వాములు ఇలానే వ్యవహరిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.
మోదీ వ్యక్తిత్వం వర్సెస్ సంకీర్ణ ధర్మం
ఎర్రకోట నుంచి చేసిన మోదీ చేసిన ప్రసంగంలో మరొక అంశాన్ని కూడా లేవనెత్తారు. దానిపై అనేక విభేదాలు ఉన్నాయి. ఆయన ప్రతిపాదించిన ఒక దేశం, ఒకే ఎన్నికలు అనుసరించినట్లయితే, అనేక రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి, కొన్నింటికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావచ్చు. ఇది మళ్లీ బీజేపీని ఛాంపియన్ గా నిలబెడుతుంది.
సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించినప్పటికీ, మోదీ తన ప్రాథమిక వ్యక్తిత్వానికి కట్టుబడి ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది - ఎవరైనా పార్లమెంటరీ మెజారిటీని కలిగి ఉన్నారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు ప్రస్తుతానికి సమీకరణాలు మారాయని గుర్తుచేసే అనేక అవకాశాలను కోల్పోలేదు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో మోదీపై ఎంతకాలం చెక్‌లు అండ్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి. ఆ పరిమితులను ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
(ఫెడరల్ స్పెక్ట్రమ్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. కథనాలలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితకు చెందినవి. ఫెడరల్ అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతిబింబించవు)
Tags:    

Similar News