ఢిల్లీలో వంద విమాన సర్వీసులు రద్దు ..

పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో కొన్ని సర్వీసులను రద్దు చేయగా.. కొన్ని సర్వీసులను మరో రూట్‌లో తిప్పుతున్నారు;

Update: 2025-05-10 07:08 GMT
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు
Click the Play button to listen to article

ఢిల్లీ(Delhi) విమానాశ్రయంలో సాధారణ పరిస్థితే ఉన్నా... భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొన్ని విమాన (Flights) సర్వీసులను రద్దు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్‌’తో పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌర విమానాయాన శాఖ ఇప్పటికే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసింది. ఇదివరకే టికెట్ బుక్ చేసుకున్న వారు ఇంటి నుంచి బయలుదేరే ముందు విమాన సర్వీసుల గురించి ఆన్‌లైన్‌లో ఒకసారి చెక్ చేసుకుని బయలుదేరాలని కోరింది. సర్వీసు అందుబాటులో ఉంటే 3 గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఢిల్లీ విమానాయాశ్రయం నుంచి, అలాగే వెళ్లాల్సిన దేశీయ, అంతర్జాతీయ 138 విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News