‘ఓటరు నమోదుకు ఆధార్ మాత్రమే సరిపోదు’

‘‘ఇక భారత పౌరులు మాత్రమే తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. విదేశీయులు కాదు’’ - అమిత్ మాల్వియా;

Update: 2025-08-24 11:54 GMT
Click the Play button to listen to article

బీహార్‌లో ఓటరు జాబితా సవరణ (SIR)ప్రక్రియ చేపట్టిన తర్వాత సుమారు 65 లక్షల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఆధార్ మాత్రమే చెల్లుబాటు అయ్యే పత్రం అని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా పేర్కొన్నారు.

‘‘ఆధార్ అనేది వ్యక్తి గుర్తింపు, నివాసానికి సంబంధించిన రుజువు మాత్రమే. పౌరసత్వాన్ని సూచించదు. సుప్రీంకోర్టు తన తీర్పులో ఆధార్ కార్డును స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం చెల్లుబాటు అయ్యే పత్రంగా చెప్పలేదు. ఈ అంశంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. ’’ అని పేర్కొన్నారు.

బీహార్‌లో ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల ఓటర్లలో నకిలీ, చనిపోయిన, బంగ్లాదేశ్, రోహింగ్యా పేర్లు ఉన్నాయని మాల్వియా తెలిపారు. ‘‘ఇక భారత పౌరులు మాత్రమే తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. విదేశీయులు కాదు’’ అని పేర్కొన్నారు.

తమ పేర్లు తొలగించిన వ్యక్తులు తిరిగి ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన క్రమంలో ఇప్పటివరకు 84,305 అభ్యంతరాలు మాత్రమే దాఖలు అయ్యాయని, ఇది మొత్తం తొలగించిన పేర్లలో కేవలం 1.3 శాతం మాత్రమేనని మాల్వియా చెప్పారు. 

Tags:    

Similar News