'కుంభమేళా మృతుల సంఖ్యను దాస్తున్నారు’

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా పుణ్యస్నానాలకు వచ్చి మృత్యువాతపడ్డ భక్తుల సంఖ్యను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్తున్నారని సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.;

Update: 2025-02-04 10:46 GMT
Click the Play button to listen to article

మౌనీ అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా ఉత్తరప్రదేశ్(Utter Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట(Stampede) జరిగిన విషయం తెలిసిందే. త్రివేణీ సంగమం దగ్గర జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. మరో 70 మంది గాయపడ్డారు. ఆ రోజున అనుకున్న సమయానికే పుణ్య స్నానం చేయాలని ఒక్క ఘాట్ దగ్గర దాదాపు 50లక్షల నుంచి 60 లక్షల మంది గుమిగూడడం తొక్కిసలాటకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి స్నాన ఘట్టాలను మూడు గంటల పాటు మూసివేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక తిరిగి ఘాట్లలో స్నానాలకు భక్తులను అనుమతించారు.

ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు కూడా. ఈ ఘటనతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అందులో భాగంగానే.. ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి యోగి వాస్తవ మృతుల సంఖ్యను దాస్తున్నారని ఆరోపించారు.

రాహుల్ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు రెస్పాన్స్..

"ఇండియా" కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టాభిషేకానికి విదేశాంగ మంత్రిని అమెరికాకు పంపే అవసరం వచ్చేది కాదు" అని రాహుల్(Rahul) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) తీవ్రంగా స్పందించింది. ‘‘విదేశాంగ మంత్రి అమెరికా వెళ్లి ప్రధానికి ఆహ్వానం కోరారని మీరు ఎలా చెప్పగలరు? " అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా ప్రశ్నించారు.

రాహుల్ తన ప్రసంగంలో మరో ఆరోపణ కూడా చేశారు. ప్రధాని మోదీ భారత భూభాగంలో చైనా దళాలు లేవని చెబుతున్నారని, కానీ భారత సైన్యం మాత్రం ఆయన స్టేట్‌మెంట్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ తన ప్రసంగంలో చైనా పేరును 35 సార్లు ప్రస్తావించారని, ఇది చైనాపై ఆయన ఉన్న ప్రేమను సూచిస్తుందని విమర్శించారు.

అవన్నీ ఆరోపణలే..బీజేపీ

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా..మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి సుమారు 70 లక్షల మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చారని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసి తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారని, ప్రతిపక్ష నేత ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని వ్యవహరించాలని చురకలంటించింది.

ప్రధాని ప్రసంగం..

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ (ఫిబ్రవరి 4) సాయంత్రం 5 గంటలకు ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది. 

Tags:    

Similar News