అయోధ్య వెళ్తున్నారా, తప్పక చూడాల్సిన ప్రదేశాలివే..

అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్టాపన వచ్చే నెల జనవరి 22న అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2023-12-29 11:07 GMT
అయోధ్యలో శ్రీ రామమందిరం

అయోధ్య.. ఒకప్పటి కోసల రాజధాని. శ్రీ రాముడు జన్మించిన ప్రదేశం. ప్రజారంజకంగా పాలించి.. పాలన ఎలా ఉండాలంటే రామరాజ్యం అనేలా అనే పేరు తెచ్చుకున్న ధీరుడు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తన పేరు గుర్తుండిపోయింది. శ్రీరామ పాలన తరువాత అయోధ్యలో మందిరం నిర్మించి శ్రీ రాముడిని ప్రజలు దేవుడిలా కొలిచారు. అయితే కాలక్రమంలో దండయాత్రల మూలంగా రామాలయం కూల్చివేతకు గురైంది.

దాదాపు ఐదువందల సంవత్సరాల తరువాత కోర్టు తీర్పుతో తిరిగి అదే ప్రదేశంలో రామమందిర నిర్మాణం జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా( బాల రాముడు) విగ్రహాన్నిరామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రతిష్టాపన చేయనుంది. ఈ వేడుకలో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహరథులు వస్తున్నారు. బాల రాముడికి తొలిపూజ ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్నారు. ఈ వేడకలో పాల్గొనడానికి సామాన్య ప్రజలు సైతం అయోధ్యకు వెళ్లనున్నారు. అయితే అయోధ్యలో రామమందిరంతో పాటు మరికొన్ని ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటుకునేలా ఉన్నాయి. అవేంటంటే..

జటాయువు టీలా( గుట్ట)



 


జటాయువు టీలా రామజన్మభూమి కాంప్లెక్స్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతం. ఇక్కడ 30 మీటర్ల ఎత్తుగల ’జటాయువు’ అనే పేరు గల పక్షి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం 1991లో నిర్మించబడింది. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతం. శ్రీ రాముడు వనవాసం చేయడానికి వెళ్లిన సమయంలో పక్షిరాజు ‘జటాయువు’ ఆయనకు తారసపడుతుంది. సీతమ్మను అసుర చక్రవర్తి రావణుడు బలవంతంగా ఎత్తుకెళ్తుతున్న సమయంలో వీరోచితంగా పోరాడి చనిపోతుంది. రామాయణ మహా కావ్యం ప్రకారం అప్పటికే గద్దరాజు అయినా జటాయువు ముసలిది. శ్రీ రాముడి తండ్రి దశరథుడికి మిత్రుడు. అందువల్ల జటాయువుకు శ్రీరాముడే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి, మిగతా వైదిక క్రియలు పూర్తి చేశారు.

లతా మంగేష్కర్ చౌక్



 


లతా మంగేష్కర్ చౌక్ అయోధ్య నడిబొడ్డున ఉన్న ఒక పబ్లిక్ స్క్వేర్. దీనికి  ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరు పెట్టారు. చౌక్ ఒక ప్రసిద్ధ సమావేశ స్థలం. తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలకు ఉపయోగించబడుతుంది. అయోధ్యలో ఈ ప్రదేశం చూడముచ్చటగా ఉంటుంది.

చూరమణి చౌక్



 


చూరమణి చౌక్ అయోధ్యలో ఉన్న మరొక పబ్లిక్ స్క్వేర్. సీతమ్మను రావణుడు బంధించిన ప్రదేశంగా చెబుతారు. చౌక్‌లో సీతమ్మకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

శ్రీరామ స్తంభం



 


శ్రీరామ స్తంభం, రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ఉన్న 221 అడుగుల ఎత్తైన స్తంభం. రామజన్మభూమి ఆలయ నిర్మాణ జ్ఞాపకార్థం దీనిని 2022లో నిర్మించారు. ఈ స్తంభం ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడింది. ఈ స్తంభంపైన రాముడి విగ్రహం ఉంది.

ఈ ల్యాండ్‌మార్క్‌లతో పాటు, డిసెంబర్ 30న అయోధ్యలో 4 రోడ్ కారిడార్‌లను, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మొదటి కారిడార్ ను రామ్ మార్గంగా పేరుపెట్టారు. ఇది సహదత్ గంజ్ నుంచి నయాఘాట్ వరకు ఉంటుంది. రెండోది భక్తి మార్గం.. ఇది రామజన్మభూమి నుంచి అయోధ్య ప్రధాన హైవే. మూడోది ధర్మ్ మార్గ్ గా పేరు పెట్టారు. నేషనల్ హైవే 27 నుంచి ప్రారంభం అయి నయాఘాట్ వరకూ ఉంటుంది. ఇక నాలుగో కారిడార్ కు జన్మభూమి మార్గంగా పేరు పెట్టారు. ఇది సుగ్రీవ్ ఖిలా నుంచి ప్రారంభం అయి రామజన్మభూమి వరకూ ఉంటుంది.

Tags:    

Similar News