బడ్జెట్‌లో బీహార్‌కు పెద్ద పీట..ఎన్ని కోట్లు కేటాయించారంటే..

బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను కేంద్రం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.

Update: 2024-07-23 06:50 GMT
బీజేపీ మిత్రపక్షం జేడీయూ పాలిత బీహార్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారు. నితీశ్ కుమార్ సారథ్యం వహిస్తున్న బీహార్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు. బహుళపక్ష అభివృద్ధి సంస్థల సహాయం ద్వారా కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు ఆర్థిక సహాయం అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
బీహార్‌లో వివిధ రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 26,000 కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్ గా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం ప్రణాళికను కూడా రూపొందిస్తుందని చెప్పారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కరించిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.
Tags:    

Similar News