ఉప ఎన్నికల్లో ఆధిక్యం దిశగా ఇండియా కూటమి అభ్యర్థులు..

ఏడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Update: 2024-07-13 07:44 GMT

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ , తమిళనాడులో అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకుగాను 11 స్థానాల్లో ఇండియా కూటమి (కాంగ్రెస్, ఆప్, టిఎంసి డిఎంకె) అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో..

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు - చీఫ్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్, హర్దీప్ సింగ్ బావా - డెహ్రా, నలాఘర్‌ నియోజకవర్గాలో ఆధిక్యంలో ఉండగా.. హమీర్‌పూర్‌లో బిజెపికి చెందిన ఆశిష్ శర్మ ముందంజలో ఉన్నారు.

డెహ్రాలో బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్‌పై కమలేష్ ఠాకూర్ 6,115 ఓట్ల ఆధిక్యంలో ఉండగా..హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మపై కాంగ్రెస్ అభ్యర్థి పుష్పిందర్ వర్మ 67 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. నలఘర్‌లో బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బావా 3,078 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

పంజాబ్‌లో..

పంజాబ్‌లో జలంధర్ వెస్ట్ అసెంబ్లీ ఉపఎన్నిక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మొహిందర్ భగత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్‌పై 23వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో..

పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్తలా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థులు కృష్ణ కళ్యాణి, ముకుత్ నామి అధికారి, మధుపర్ణ ఠాకూర్, సుప్తి పాండే ముందంజలో ఉన్నారు.

రాయ్‌గంజ్‌లో బీజేపీ 21,393 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. రణఘాట్ దక్షిణ్‌లో పార్టీ 2,139 ఓట్లతో వెనుకబడి ఉంది. బాగ్దాలో 8,278 ఓట్లు, మణిక్తలాలో 3,041 ఓట్లు సాధించినట్లు EC వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో..

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగ్లార్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు - లఖ్‌పత్ సింగ్ బుటోలా, ఖాజీ నిజాముద్దీన్ ఆధిక్యంలో ఉన్నారు. బద్రీనాథ్‌లో బీజేపీకి చెందిన రాజేంద్ర భండారీ 1,161 ఓట్లతో వెనుకబడి ఉండగా, మంగ్లార్‌లో బీఎస్పీకి చెందిన ఉబైదుర్ రెహమాన్ రెండో స్థానంలో, బీజేపీకి చెందిన కర్తార్ సింగ్ భదానా మూడో స్థానంలో నిలిచారు.

మధ్యప్రదేశ్, బీహార్‌లో..

మధ్యప్రదేశ్‌లోని అమర్‌వార్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరన్‌ షా ఇన్వాటి 4,048 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కమలేష్‌ ప్రతాప్‌ షాహి, బీహార్‌లో జేడీ(యూ)కి చెందిన కళాధర్‌ ప్రసాద్‌ మండల్‌ స్వతంత్ర అభ్యర్థి శంకర్‌సింగ్‌పై 5,038 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

తమిళనాడులో..

తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ 10,734 ఓట్ల ఆధిక్యతతో పీఎంకే అభ్యర్థి అన్బుమణి సి కంటే ఆధిక్యంలో ఉన్నారు.

Tags:    

Similar News