కోయంబత్తూర్: విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నా డీఎంకే, విమర్శలు గుప్పించిన బీజేపీ
By : The Federal
Update: 2025-11-03 12:13 GMT
కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం దారుణం జరిగింది. రాత్రి ఒక కళాశాల విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు 19 ఏళ్ల విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అతడిని తరిమివేశారు. తరువాత విద్యార్థిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రయివేట్ కళాశాల, పోలీసులు తెలుపుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేరస్థులు వారిపై దాడి చేశారు. కారులో వెళ్తున్న వారిని బలవంతంగా విమానాశ్రాయానికి సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు.
నేరస్థులను ప్రతిఘటిస్తూ తీవ్రంగా గాయపడిన స్నేహితుడు అతికష్టంగా పీలమేడు పోలీస్ స్టేషన్ కు చేరుకోగలిగాడని స్థానిక మీడియా తెలిపింది. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా విమానాశ్రయాని కాస్త దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థిని అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు.
భద్రతపై ఆందోళనలు..
రాష్ట్రంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ సంఘటన జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో రాజధాని చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. డీఎంకే ప్రభుత్వంపై అనేక విమర్శలు చెలరేగాయి.
రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు సామాజిక వ్యతిరేక శక్తులు ఇకపై చట్టానికి లేదా పోలీసులకు భయపడవని చూపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కే. అన్నామలై పేర్కొన్నారు.
బీజేపీ విమర్శలు..
‘‘కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిన్న రాత్రి తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ముగ్గురు దుండగులు ఒక కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే వార్త తీవ్ర దిగ్బ్రాంతికరమైనది. మా హృదయం ద్రవీంచిపోయింది. ఆమె త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘డీఎంకే మంత్రుల నుంచి పోలీస్ అధికారుల వరకూ, న్యాయం జరిగేలా చూసుకోవడానికి బదులుగా లైంగిక నేరస్థులను రక్షించే అలవాటు ఉంది. లైంగిక నేరాలను అరికట్టడంలో, మహిళలకు భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’’ అని ఆయన మరో పోస్ట్ లో ఆరోపించారు.
పౌరులను రక్షించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను ఉపయోగించే బదులు ప్రత్యర్థులను అరెస్ట్ చేయడానికి ఉపయోగిస్తుంది. డీఎంకే ఫలితంగా తమిళనాడు భయంకరమైన క్షీణ దశలో ఉందని ఆయన విమర్శించారు.
బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి మాట్లాడుతూ.. గత నాలుగున్నర సంవత్సరాలలో డీఎంకే పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు క్రమం తప్పుకుండా జరుగుతున్నాయి.
జరుగుతున్న సంఘటన ఆశ్చర్యం కలిగించదు. నియంత్రణ లేదా పోలీసింగ్ లేదు. అదే ప్రధాన సమస్య. న్యాయవాదీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ, అన్ని రాజకీయ పార్టీలు గూండాలు, రౌడీలకు వీరంతా నాయకత్వం వహిస్తున్నారని ఆయన విమర్శించారు.
కఠిన చర్యలు..
ఈ సంఘటన దురదృష్టకరంగా డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా వ్యాఖ్యానించారు. లైంగిక నేరాలను పాల్పడేవారిపై తమిళనాడు కఠిన చర్యలు తీసుకుంటుందని కేసులు వేగంగా ఛేదిస్తామని, దీనికోసం కఠినమైన చట్టాలు ఉన్నాయని అన్నారు. ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోందని ఆయన అన్నారు.