రూపాయి విలువ పతనం: కేంద్రంపై శ్రినేట్ విమర్శలు

"ప్రధాని మోదీ ప్రతి దఫా రూపాయి విలువ తగ్గినప్పుడూ '60 పాస్, 65 పాస్, 70 పాస్...' అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు 87కి కూడా నినాదం ఇస్తారేమో"- సుప్రియా;

Update: 2025-01-25 11:43 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రినేట్(Supriya Shrinate) ప్రధాని మోదీ (PM Modi) పై విరుచుకుపడ్డారు. అమెరికా డాలర్‌(dollar) తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతూ ఉండటంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. గత 10 సంవత్సరాల్లో రూపాయి విలువ 50 శాతం తగ్గిందని, అయితే రూపాయిని శతకం దాటించేందుకు ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రూపాయి విలువ పతనమవుతున్న కొద్దీ.. ప్రధాని గౌరవం కూడా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు.

" డాలర్‌తో పోలిస్తే నేడు రూపాయి 87 వద్ద నిలిచింది. మోదీ ప్రధానమంత్రి అయ్యే సమయానికి రూపాయి విలువ డాలర్‌కు 58 వద్ద ఉండేది. గత 10 సంవత్సరాల్లో రూపాయి 29 పాయింట్లు తగ్గింది. ఇది 50 శాతం తగ్గుదల. ఆయన రూపాయిని శతకం దాటించేందుకు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది," అని శ్రినేట్ న్యూఢిల్లీలోని 24, అక్బర్ రోడ్ వద్ద ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో అన్నారు.

కేంద్రాన్ని ప్రశ్నించిన శ్రినేట్

"రూపాయిని తిరిగి బలపర్చే ప్రణాళిక మీ వద్ద ఉందా? విలువైన విదేశీ మారక నిల్వలను రూపాయి కోసం ఎంతకాలం ఖర్చు చేస్తారు?" అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. "ప్రధాని మోదీ ప్రతి దఫా రూపాయి విలువ తగ్గినప్పుడూ '60 పాస్, 65 పాస్, 70 పాస్...' అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు 87కి కూడా నినాదం ఇస్తారేమో," అని ఆమె వ్యంగ్యంగా అన్నారు.

ఆమె భారత ప్రధానుల పాలనలో రూపాయి విలువ క్షీణతను వివరించే ఒక చార్టును ప్రదర్శించారు.

- నెహ్రు పాలనలో 17 సంవత్సరాల్లో రూపాయి విలువ కేవలం 2 శాతం మాత్రమే తగ్గింది.

- లాల్ బహదూర్ శాస్త్రి పాలనలో రూపాయి విలువ ఏ మాత్రం తగ్గలేదు.

- నరసింహరావు 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సి వచ్చింది.

- మోదీగారి పాలనలో రూపాయి ఇప్పటివరకు 34 శాతం తగ్గింది.

విదేశీ మారక నిల్వల అంశం

విదేశీ మారక నిల్వలు 2024 సెప్టెంబర్ 27న 704 బిలియన్ల డాలర్ల వద్ద ఉండగా, 2025 జనవరి 10 నాటికి 635 బిలియన్లకు చేరాయి అని శ్రినేట్ వివరించారు.

"రూపాయి పతనం వల్ల వస్తున్న దుష్ప్రభావాలు ఏమిటో మోదీ ప్రభుత్వం తెలుసుకుంటుందా? రూపాయిని పునరుద్ధరించేందుకు ప్రణాళిక ఉందా? రూపాయి పతనంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ప్రభుత్వం పరిష్కారాన్ని చూపిస్తుందా?" అని ఆమె ప్రశ్నించారు.

శుక్రవారం రూపాయి విలువ 86.26 వద్ద ముగిసింది, అయితే గురువారం 86.44 వద్ద స్థిరపడింది.  

Tags:    

Similar News