బీజాపూర్ లో 51 మావోయిస్టుల లొంగుబాటు

20 మందిపై 66 లక్షల రివార్డు

Update: 2025-10-29 14:05 GMT

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో బుధవారం లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరారు.

లొంగిపోయిన మావోయిస్టుల్లో 20 మందిపై 66 లక్షల రివార్డు ఉంది. చత్తీస్ గడ్ ప్రభుత్వం మావోయిస్టులకు కల్పిస్తున్నపునరావాసంకు ఆకర్షితులై లొంగిపోయినట్టు బీజాపూర్ ఎస్ పి జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు.

లొంగిపోయిన వారిలో ఐదుగురు పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీకు చెందిన వారు ఉన్నారు.

బీజాపూర్ లో 2024 నుంచి ఇప్పటివరకు 650 మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. 196 మంది ఎన్ కౌంటర్లలో చనిపోయారు.986 మంది అరెస్టయ్యారు.

మూడు రోజుల క్రితం..

చత్తీస్ గడ్ కాంకేర్‌ జిల్లాలో ఆదివారం 21 మంది మావోయిస్టులు 18 ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కల్సిపోయారు . వీరంతా మావోయిస్టు పార్టీ నార్త్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో పరిధిలోని కున్వేమరి, కిస్కోడో ఏరియా కమిటీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజినల్‌ కమిటీ సభ్యులు(డీవీసీఎం), 9 మంది ఏరియా కమిటీ సభ్యులు(ఏసీఎం), 8 మంది పార్టీ కమిటీ సభ్యులతో పాటు డివిజన్‌ కమిటీ కార్యదర్శి ముకేశ్‌ సైతం వీరిలో ఉన్నారు. వీరిలో 13 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. మూడు ఏకే-47 రైఫిల్స్‌తోసహా మొత్తం 18 ఆయుధాలతో ముకేశ్‌ నేతృత్వంలో తడోకీ పోలీసుస్టేషన్‌ ప్రాంతంలోని చోటేథాన్సా అడవులకు వీరంతా ఒక చోటికిచేరుకున్నారు. అక్కడ నుంచి పోలీసులు భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహనాల్లో అంటగఢ్‌కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌శర్మ వెల్లడించారు.

Tags:    

Similar News