మొంథా ప్రభావంతో తెలంగాణ 16 జిల్లాల్లో ప్లాష్ ప్లడ్స్

వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు

Update: 2025-10-29 09:15 GMT

మొంథా ప్రభావంతో తెలంగాణలోని 16 జిల్లాలకు ప్లాష్ ప్లడ్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు పేర్కొంది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అత్యం భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఎనిమిది రాష్ట్రాల్లో

మొంథా తుఫాను ప్రభావంతో ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో , మహరాష్ట్రలో ప్లాష్ ప్లడ్స్ వచ్చే అవకాశాలున్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రానున్న కొన్ని గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Tags:    

Similar News