పాక్ పై భారత్ దాడి, బంగ్లాదేశ్ కు ఓ గుణపాఠం లాంటిది, ఎందుకు?

ఈశాన్య రాష్ట్రాలలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఢాకా;

Update: 2025-05-09 11:18 GMT
నిషేధిత ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్ లో చేపట్టిన ర్యాలీ

పాకిస్తాన్ పై భారత్ జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడి బంగ్లాదేశ్ కు కళ్లు తెరిపించే ఉంటుంది. కొంతకాలంగా బంగ్లాదేశ్.. ఉగ్రవాదులకు, భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పించి, ఇస్లామాబాద్ అడుగులకు మడుగులు ఒత్తడం ప్రారంభించింది.

బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ కంటే ముందు భారత వ్యతిరేక శక్తులకు ఢాకా ఆశ్రయం కల్పించేది. ఈశాన్య రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించే కొన్ని తీవ్రవాద శక్తులకు అప్పట్లో బంగ్లా కేంద్రంగా పనిచేసేవి.
టీయూఎన్ఎఫ్ పెరుగుదల..
త్రిపుర యునైటెడ్ నేషనల్ ఫ్రంట్(టీయూఎన్ఎఫ్) అనేది బంగ్లాదేశ్ రక్షణ నిఘా సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటలిజెన్స్(డీజీఎఫ్ఐ) చేత ప్రారంభించబడిందని, కొత్తగా ఈశాన్యరాష్ట్రాలలో తిరుగుబాటు చేసేందుకు ఉద్భవించిన సంస్థ అని భారత భదత్రా సంస్థలకు సమాచారం ఉంది.
అలాగే బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కూడా దేశంలో తమ స్లీపర్ సెల్ లను పునరుద్దరించడానికి ప్రయత్నియస్తున్నాయని కూడా ఇంతకుముందే ఫెడరల్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
టీయూఎన్ఎఫ్ దాని లెటర్ హెడ్ లో(ఇది ఫెడరల్ దగ్గర ఉంది) 2019 లో స్థాపించినట్లు పేర్కొంది. కానీ దాని సభ్యులను ఇటీవల అరెస్ట్ చేసినప్పుడూ కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి.
ఈ సంస్థ 2024 లో బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ ప్రాంతంలో ఏర్పడిందని వెల్లడైంది. అంటే షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం అయిన తరువాతనే ఈ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ బృందంలోని సభ్యులు ఎక్కువగా మాజీ నేషనలిస్ట్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్ఎల్ఎఫ్టీ) కార్యకర్తలు(రియాంగ్, బ్రూ కమ్యూనిటీకి చెందినవారు) గత సంవత్సరం సెప్టెంబర్ లో ఈ బృందం శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత లొంగిపోవడానికి నిరాకరించారు.
ఇది త్రిపుర హంబాగ్రాటా ఆర్మీ(టీహెచ్బీటీఏ) శాఖ. దీనిని ఖగ్రాచారిలో ఉన్న బంగ్లాదేశ్ ఆర్మీ 203వ పదాతిదళ బ్రిగేడ్, గత సంవత్సరం మరొక జాతి సమూహం అయిన మోగ్ నేషనల్ పార్టీ(ఎంఎన్ఎపీ) తో కలిసి ఏర్పాటు చేయడంలో సాయపడింది. మోగ్ లు త్రిపుర దక్షిణ భాగంలో ఎక్కువగా నివసించే అరకనీస్ సంతతికి చెందిన ఒక చిన్న తెగ.
సార్వభౌమ త్రిపుర రాష్ట్రానికి పిలుపు..
ఉత్తర త్రిపురలోని రియాంగ్ ఆధిపత్య ప్రాంతాలను వేరు చేసి రియాంగ్ రాష్ట్రాన్ని స్థాపించడం టీహెచ్బీటీఏ లక్ష్యం కాగా, ఎంఎన్పీ లక్ష్యం మాత్రం మోగ్ కమ్యూనిటీకి స్వయంప్రతిపత్తిని కోరడం దాని ధ్యేయం.
త్రిపురి, రియాంగ్, మోగ్, జమాటియా, నోటియా, చక్మా వంటి విభిన్న గిరిజన సమూహాలను కలుపుకుని కోక్ బోరోక్ మాట్లాడే తిప్రాసా గుర్తింపును అందించడానికి బంగ్లాదేశ్ నిర్వాహాకుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం రెండు గ్రూపులు విలీనం అయ్యాయని త్రిపుర వర్గాలు తెలిపాయి.
కొత్త గ్రూపుగా ఏర్పడిన తరువాత ఈ బృందం సాయుధ పోరాటం ద్వారా సార్వభౌమ త్రిపురి రాష్ట్రాన్ని సృష్టించేందుకు తన లక్ష్యాన్ని మార్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి లో త్రిపుర పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నాయకులు యాంగ్పు రియాంగ్, సల్పా రియాంగ్, గోనిరామ్ రియాంగ్ లను విచారించిన తరువాత భద్రతా సంస్థలు ఈ గ్రూప్ తాజా పరిణామంపై పూర్తి వివరాలు అందాయి.
బంగ్లాదేశ్ సైన్యం.. ఐఎస్ఐ పాత్ర..
యాంగ్పు ఆ నూతన సంస్థకు స్వయం ప్రకటిత కమాండర్లలో ఒకరు, అతను బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు.
ప్రస్తుతం ఈ సంస్థ బంగ్లాదేశ్ లోని రెండు స్థావరాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని వర్గాలు తెలిపాయి. ఈ స్థావరాలు భారత్ లోని త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్ లోని సీహెచ్టీలోని సజెక్ కొండ ప్రాంతాలలోని న్యూ జోపుయ్ ఝమ్ మాట్ ప్రాంతాలు, కచలాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో ఉన్నాయి.
ఈ తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం, శిక్షణ అందించడమే కాకుండా డీజీఎఫ్ఐ ఆదేశం మేరకు బంగ్లాదేశ్ సైన్యం ఈ బృందానికి ఆయుధాలను కూడా అందించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరి కేడర్ బలం దాదాపు 70. వారి ఆయుధశాలలో ఏకే రకం, సింగిల్ బారెల్ బ్రీచ్ లోడింగ్ రైఫిల్స్, 12 బోర్, 22 రైఫిల్స్ ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.
భారత్ లోని ఈశాన్య ప్రాంతాలను కలుపుకుని బంగ్లాదేశ్ సైన్యం రహస్య కుట్రకు పాల్పడుతున్న తీరును గుర్తించడంలో పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ) పాత్రను తోసిపుచ్చలేము.
అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలోని బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మేజర్ జనరల్ షాహిద్ అమీర్ ఆఫ్సర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ఐఎస్ఐ ప్రతినిధి బృందం యునైటెడ్ లిజరేషన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ఐఎస్ఐ ప్రతినిధి బృందం యునైటెడ్ లిజరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్పా) చీఫ్ పరేష్ బారువాను కలిసిన, భారత సరిహద్దుకు సమీపంలోని సున్నితమైన ప్రాంతాలను సందర్శించినట్లు తెలుస్తోంది.
దేశ వ్యతిరేక కార్యకలాపాల కేంద్రం..
90 ల చివరలో 2000 ప్రారంభంలో బంగ్లాదేశ్ ను ఐఎస్ఐ మద్దతు తో ఇటువంటి భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాయి. 2008 ఏప్రిల్ లో ఈ సంస్థలపై చర్య కోరుతూ భారత్ పొరుగు దేశానికి అప్పగించింది.
ఈ జాబితా ప్రకారం.. బంగ్లాదేశ్ లోని వివిధ ఈశాన్య ఉగ్రవాద గ్రూపులకు చెందిన 117 శిబిరాలు చాలా చురుకుగా ఉన్నాయి.
2009 లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ శిబిరాలను ధ్వంసం చేశారు. 2009-14 లో బంగ్లాదేశ్ నుంచి పనిచేస్తున్న వివిధ ఈశాన్య ఆధారిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన కనీసం 25 మంది అగ్రనాయకులను అరెస్ట్ చేసిన హసీనా ప్రభుత్వం వారిని భారత్ కు అప్పగించింది.
అలాగే బంగ్లాలో చురుకుగా పనిచేస్తున్న హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామి బంగ్లాదేశ్(హుజీ-బీ) జమాత్ ఉల్ అన్సార్ ఫిల్ హిందాల్ షర్కియా, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ), అన్సరుల్లా బంగ్లా టీం(ఎంబీటీ)లపై కూడా కఠిన చర్యలు తీసుకుంది.
అయితే గత ఏడాది ఆగష్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఈ తిరుగుబాటు సందర్భంగా అనేక మంది ఉగ్రవాద నాయకులు జైలు నుంచి తప్పించుకున్నారు.
జైలు నుంచి విడుదలయిన ఉగ్రవాదులు జాబితాలో ఏబీటీ చీఫ్ ముఫ్తీ జాషిముద్దీన్ రెహమానీ, జేఏఎఫ్ హెచ్ ఎస్ వ్యవస్థాపకుడు షమీమ్ మహ్ ఫుజ్ ఉన్నారు. ఏబీటీ ఇండియా ఆపరేటర్ హెడ్ ఇక్రముల్ హాక్ అలియాస్ అబు తల్హా జైలు నుంచి తప్పించుకున్నారు.
బంగ్లా కేంద్రంగా భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడానికి ఏబీటీ తో సహ ఇతర బంగ్లా ఉగ్రవాద సంస్థలు, పాక్ లోని జైషే మహ్మద్, లష్కర్ ఏ తోయిబా వంటి వాటితో అనుసంధానం అయ్యాయి. గత సంవత్సరం డిసెంబర్ లో భారత్ లోని సిలిగురి కారిడార్ ను అస్థిరపరిచేందుకు స్లీపర్ సెల్స్ ఆక్టీవ్ అయ్యాయి.
అయితే భారత భద్రతా సంస్థలు వీటిని గుర్తించి అరెస్ట్ చేశాయి. అలాగే హమాస్ ఉగ్రవాద నాయకులు షేక్ ఖలీద్ మిషాల్, ఖలీద్ అల్ ఖడౌమీ కూడా బంగ్లాదేశ్ ను సందర్శించినట్లు వార్తలు వచ్చాయి.
హమాస్ ప్రతినిధి ఖలీద్ అల్ ఖడౌమీ భారత వ్యతిరేక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నాడని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లో జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తయ్యిబా వంటి ఉగ్రవాద నాయకులుతో సమావేశం అయ్యారు.
గత ఏడాది సెప్టెంబర్ లో రెహమానీ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి విడిపోవాలని పిలుపునిచ్చాడు. అలాగే కాశ్మీర్ ను విముక్తం చేయడానికి పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ల సాయం కోరాడు.
పశ్చిమ బెంగాల్ లోని 2014 ఖగ్రాగఢ్ పేలుడు నిందితుడు, జేఎంబీ నాయకుడు గోలం సరోవర్ రహత్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనస్ తో కనిపించాడు. ఇది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందని చెప్పడానికి స్పష్టమైన సంకేతం.
ఇది భారత్ భద్రతకు పెద్ద ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా తూర్పు సరిహద్దులో ఉన్న స్థిరత్వానికి పెను సవాల్ విసురుతుంది. అయితే బంగ్లా ఎటువంటి  ఎత్తుగడలు వేసిన ఇప్పుడు పాక్ కు పట్టిన గతే దానికి పడుతుందనడంలో సందేహం లేదు. 


Tags:    

Similar News