దీక్ష విరమించిన రైతు నాయకుడు దల్లెవాల్..

ప్రశంసించిన అత్యున్నత న్యాయస్థానం..;

Update: 2025-03-28 10:39 GMT
Click the Play button to listen to article

రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ (Dallewal) శుక్రవారం (మార్చి 28) దీక్ష విరమించారు.

రోడ్డుపై నిరసన శిబిరాలు..

గత ఏడాది ఫిబ్రవరి 13న భద్రతా దళాలు రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ను నిలిపివేయడంతో సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో శంభు, ఖనౌరి సరిహద్దుల వద్ద నిరసన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది మార్చి 19న మొహాలీలో కేంద్ర ప్రతినిధి బృందంతో దల్లెవాల్, సర్వాన్ సింగ్ పంధేర్ సహా మరికొంతమంది సమావేశమయ్యారు. కాని చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిరసన శిబిరాలను కూల్చేశారు.

సుప్రీంకోర్టు ప్రశంస..

దల్లెవాల్ ప్రయత్నాలను సుప్రీంకోర్టు గుర్తించింది. ఎలాంటి రాజకీయ ఎజెండా లేని నిజమైన రైతు నాయకుడు అని ప్రశంసించింది. రైతుల సమస్యలను పరిష్కరించకూడదని కొంతమంది అనుకుంటున్నారు. ఆ విషయం మాకు తెలుసు," అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కమిటీ ఏర్పాటు..

రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పూర్తి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం ఆదేశించింది. కేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సూచించింది. 

Tags:    

Similar News