మాపై ‘ఆపరేషన్ జాదు’ అమలు : ఢిల్లీ సీఎం

ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోెందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీని ప్రకారం ఆప్ నేతలను జైలుకు పంపుతారని అన్నారు.

Update: 2024-05-19 12:31 GMT

‘ఆప్’ ను లేకుండా చేయడానికి బీజేపీ ‘ఆపరేషన్ జాదు’ ను ప్రారంభించిందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఆప్ పార్టీకి సంబంధించిన ఎవరినైనా త్వరలో జైలుకు పంపవచ్చని ఆరోపించారు.

ఆప్ సీనియర్ నాయకులతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని మార్చ్(ర్యాలీ) తీయాలనుకుంటున్నామని చెప్పారు. ఆప్ ను, బీజేపీ ఒక ముప్పుగా చూస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకోసం ఆపరేషన్ జాదు ను ప్రారంభించిందని, దీని ద్వారా పార్టీని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ ఆపరేషన్‌లో ప్రముఖ ఆప్‌ నేతలను అరెస్టు చేయడం, పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడం, వారి కార్యాలయాలను మూసివేయడం లాంటివి జరిగాయని కేజ్రీవాల్ చెప్పారు.
'ఆపరేషన్ జాదూ'
తనకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ప్రధాని ఆప్‌కి వ్యతిరేకంగా మాట్లాడటం మానలేదని కేజ్రీవాల్ ఆరోపించారు.'ఆప్‌ ఎదుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారు. పార్టీ చాలా వేగంగా పెరిగింది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించేందుకు 'ఆపరేషన్‌ జాదూ' మొదలుపెట్టారు. రానున్న కాలంలో మా బ్యాంకు ఖాతాలు స్తంభించి, మమ్మల్ని జైలుకు పంపుతారు. మా ఆఫీస్ కూడా మూసివేస్తారు. మమ్మల్ని రోడ్డు మీదకు తెస్తారు" అని విమర్శలు గుప్పించారు.
"మున్ముందు పెద్ద సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక్కటి గుర్తుంచుకోండి. మనం గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాము. మనకు హనుమంతుడు, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. వీటిని మనం తట్టుకుని నిలబడ్డాం. సత్య మార్గంలో నడవండి. మేము సమాజం కోసం పని చేయాలనుకుంటున్నాము, ” అని పార్టీ మద్దతుదారులతో అన్నారు.
పెరిగిన ఉద్రిక్తతలు
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఇటీవల అరెస్టు కావడంతో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌లతో సహా మరికొంత నాయకులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్‌ని అంతమొందించవచ్చని బిజెపి భావించిందని, అయితే ఆప్ కేవలం పార్టీ కాదని, లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే శక్తి అని ఆయన అన్నారు.
'ఆప్ వ్యవస్థీకృత లక్ష్యం'
మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను వివిధ ఆరోపణలపై జైలుకు పంపడం ద్వారా మోదీ క్రమపద్ధతిలో పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ సీఎం ఆరోపించారు. ఆప్ నిజాయితీతో డబ్బును ఆదా చేసి ఉచిత విద్యుత్, నీటిని అందించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ విజయాలు ఆప్‌ను బిజెపి చర్యల నుంచి వేరుగా ఉంచిందని ఆయన చెప్పారు. ప్రజలకు పాఠశాలలు, మొహల్లా క్లినిక్ లను అందించడం మంచి ఆదరణ సొంతం చేసుకున్నామని వీటిని కమలదళం జీర్జించుకోలేకపోతుందని అన్నారు. ఒక్క కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వందలాది కేజ్రీవాల్ ను పుట్టుకొస్తారని అన్నారు. దేశమంతా ఆప్ విస్తరిస్తోందని పార్టీ ప్రాధాన్యాన్ని తగ్గించలేరని అన్నారు.
డబ్బు ఎందుకు స్వాధీనం..
భారీ ఎత్తును కుంభకోణం జరిగిందని బీజేపీ ప్రచారం చేస్తోందని కానీ డబ్బును మాత్రం ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకోలేకపోయారని, దీని వెనక ఉన్న లాజిక్ ఏంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కూడా పెద్దగా రికవరీ కాలేదని ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 2న లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న కేజ్రీవాల్, తాను ఇతర ఆప్ నేతలు మే 19న బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళతామని, "ప్రధాని ఎవరినైనా జైలుకు పంపవచ్చు" అని చెప్పారు.
బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చ్
శాంతియుతంగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తాం, పోలీసులు అడ్డుకుంటే ఆ స్థలంలోనే కూర్చుంటాం.. అరగంట సేపు వేచి చూస్తాం.. మమ్మల్ని అరెస్ట్ చేయకుంటే అది వారి ఓటమి. మమ్మల్నందరినీ జైలుకు పంపి, పార్టీ ముగుస్తుందో, లేక మరింత ఎదుగుతుందో మీరే చూసుకోండి’’ అని అన్నారు.
ఆప్ జాతీయ కన్వీనర్ మరియు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అక్కడ ప్రకటించిన నిరసనను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ బిజెపి ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు..
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని బిజెపి కార్యాలయం వెలుపల జరిగే నిరసనను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక సలహా ఇచ్చారు, బీజేపీ పార్టీ ఆఫీసు కు దగ్గరలో గత మెట్రో స్టేషన్ లో కూడా ప్రయాణికులు దిగడానికి పోలీసులు అనుమతించడం లేదు. దీనికి ప్రజలు సహకరించాలని ఢిల్లీ పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
"తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రాంతం (బిజెపి కార్యాలయం చుట్టూ)చుట్టూ బారికేడ్ చేయబడింది" అని పోలీసు అధికారి తెలిపారు. అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కార్యాలయానికి సమీపంలో ఉన్న ITO మెట్రో స్టేషన్‌ను ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు మూసివేసినట్లు ప్రకటించారు.
Tags:    

Similar News