కర్ణాటక: బీజేపీతో పాటు విగ్రహాలు కొట్టుకుపోయాయి

బీజేపీ పాలన పోయి కాంగ్రెస్‌ పాలన రావడంతో అక్కడ థీమ్‌ పార్క్‌ల నిర్మాణాలు, పెద్ద ఎత్తున నిలబెట్టాలనుకున్న విగ్రహావిష్కరణలు ఆగిపోయాయి

Update: 2023-12-17 06:58 GMT
చామరాజనగర్‌లో ఆవిష్కరించిన మలే మహదేశ్వరుని విగ్రహాం

భారతీయ జనతా పార్టీ(BJP) పాలనలో కర్ణాటక(Karnataka)లోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన విగ్రహాల(Statues) గురించి ప్రస్తుతం పట్టించుకునేవారు కరువయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగళూరు(Bangalore)లోని చాలా చోట్ల బీజేపీ కొన్ని విగ్రహాలకు ఏర్పాటు చేసింది. ఫలితంగా ఆ సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టాలని చూసింది. దురదృష్టవశాత్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో విగ్రహాల వద్ద జరగాల్సిన పనులు పూర్తికాలేదు.

కొత్త కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంలో విగ్రహాలకు ప్రాధాన్యం లేదని, వాటి నిర్వహణకు డబ్బు ఖర్చు చేయలేమని ఆర్థిక శాఖలోని ఓ అధికారి చెప్పారు. దీంతో థీమ్‌ పార్కుల్లో పనులు నిలిచిపోయాయి.

విగ్రహాలను ప్రారంభించిన మాజీ సీఎం

మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై నవంబర్‌ 2022 నుంచి కనీసం 15 విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బెంగళూరులో కెంపెగౌడ, బెంగళూరులోని భువనేశ్వరి దేవి, కర్కాల (దక్షిణ కన్నడ జిల్లా), మాజీ ప్రధాని అటల్‌ వంటి విగ్రహాలు ఉన్నాయి. బెంగళూరులో బీహారీ వాజ్‌పేయి, మంగళూరులో స్వాతంత్య్ర సమరయోధుడు కెదంబాడి రామయ్య గౌడ, బెలగావిలో శివాజీ, బెంగళూరులో సినీ నటుడు రాజ్‌కుమార్‌, శివమొగ్గలో అభ్యుదయ కన్నడ కవయిత్రి అక్క మహాదేవి, చామరాజనగర్‌లో మలే మహదేశ్వర విగ్రహాలున్నాయి.

అసంపూర్తిగా థీమ్‌ పార్కులు

15వ శతాబ్దంలో బెంగళూరును నిర్మించిన వొక్కలిగ అధినేత కెంపె గౌడ 108 అడుగుల విగ్రహాన్ని బెంగళూరు విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వొక్కలిగ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మరో వొక్కలిగ నేత డీకే శివకుమార్‌ను బీజేపీ ఆహ్వానించలేదు. జనతాదళ్‌ (సెక్యులర్‌) నుంచి ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన మరొకర్ని మాత్రమే ఆహ్వానించింది.

కెంపె గౌడ విగ్రహాన్ని ‘‘స్టాచ్యూ ఆఫ్‌ ప్రాస్పెరిటీ’’ గా పేర్కొన్న బీజేపీ గౌడ దార్శనికతను ప్రతిబింబించేలా ఒక థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి కూడా ప్రణాళిక రూపొందించింది. అయితే పనులను ప్రారంభించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం థీమ్‌ పార్క్‌ నిర్మాణం నిలిచిపోయింది. పనులను పునఃప్రారంభించాలని బీజేపీ మాజీ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థా నారాయణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు కూడా.

దళితులు, ఓబీసీలు పూజించే మలే మహదేశ్వరుని విగ్రహాన్ని మార్చి 18న చామరాజనగర్‌లో ఆవిష్కరించారు. లింగాయత్‌లు కూడా ఈయనను పూజిస్తారు.

దాదాపు రూ.20 కోట్లతో విగ్రహ నిర్మాణ పనులు 2021 మార్చిలో ప్రారంభమయ్యాయి. నేటికీ మహదేశ్వర కొండపై ఉన్న విగ్రహానికి రహదారి, మ్యూజియం పనులు పూర్తికాలేదు. భారీ వర్షాలకు ప్రహరీ కూడా కూలిపోయింది.





కర్కాలలోని ఉమికల్‌ కొండలో భగవాన్‌ పరశురామ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం అదృశ్యమై, పాదాలు కాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి.

కోస్తా జిల్లా కర్కాలలోని ఉమికల్‌ కొండలో పరశురాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1.58 ఎకరాల ప్రభుత్వ స్థలంలో థీమ్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు హడావుడిగా పార్కును ప్రారంభించారు. ఈ పార్క్‌ చట్టవిరుద్ధమని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి.

కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాటి బీజేపీ మంత్రి సునీల్‌ కుమార్‌ ప్రకటించినా.. ఇప్పుడు అది పూర్తిగా కాంస్యం కాదని.. నాణ్యతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర విగ్రహాలు..

12వ శతాబ్దానికి చెందిన లింగాయత్‌ సంఘ సంస్కర్త బసవన్న విగ్రహాన్ని బెలగావిలోని ఘటప్రభ నది ఒడ్డున అలాగే బెంగళూరులోని విధానసౌధ క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలని గత బీజేపీ ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. లింగాయత్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బెళగావిలోని కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్య్ర సమరయోధుడు కిట్టూర చెన్నం రాణి (లింగాయత్‌) విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

బెలగావిలో స్వాతంత్య్ర సమరయోధురాలు బెలవాడి మల్లమ్మ (నాయక్‌ `ఎస్‌టీ) విగ్రహాన్ని నిర్మించాలని వార్తలొచ్చాయి. బెలగావిలో సంగొల్లి రాయన్న (కురుబ ఓట్లు), 15వ శతాబ్దంలో పోర్చుగీసుతో పోరాడిన రాణి చెన్నభైరాదేవి (జైన్‌) విగ్రహం థీమ్‌ పార్క్‌బీ రాణి అబ్బక్క చౌటా (బంట్‌ కమ్యూనిటీ) మరియు కోటి చెన్నయ (బిల్లవ) విగ్రహం మరియు థీమ్‌ పార్క్‌బీ మరియు బెంగళూరులోని భువనేశ్వరి దేవి.

శివమొగ్గ జిల్లాలో 12వ శతాబ్దానికి చెందిన అల్లామ ప్రభు (లింగాయత్‌) జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి బొమ్మై రూ.5 కోట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతానికి నిలిచిపోయాయి.

రామనగర్‌లోని రామదేవర గూడలో ప్రసిద్ధి చెందిన రామ మందిరాన్ని పునరుద్ధరిస్తామని గత బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.

నిధుల కొరత..

ప్రస్తుతానికి విగ్రహాల ప్రాజెక్టులను నిలిపివేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఫెడరల్‌తో అన్నారు.

కొన్ని అశాస్త్రీయ ప్రణాళికలపై ఫిర్యాదులు అందాయి. పైగా సంబంధిత శాఖల వద్ద నిధులు కూడా లేవని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పాలకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక విగ్రహాలకు ప్రాధాన్యత ఎక్కడి దన్నట్లుగా ఆయన మాట్లాడారు.

Tags:    

Similar News