కర్ణాటక ఏరోస్పేస్ ప్రాజెక్టును చేజార్చుకుందా?
ఏరోస్పేస్ సెక్టార్‌కు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తుచేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..;
రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ఏరోస్పేస్ కోసం దేవనహళ్లి సమీపంలో వ్యవసాయ భూముల సేకరణ (Land Acquisition) నిలిపివేసింది. రైతుల భూములను తమ ప్రభుత్వం బలవంతంగా లాక్కోదని, స్వచ్ఛందంగా అమ్మితే కొంటామని నిన్న (జూలై 15) రైతు నాయకులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం సిద్ధరామయ్య స్పష్టంగా చెప్పారు.
గతంలో ప్రకటన జారీ..
ఏరోస్పేస్ (Aerospace) హబ్ ఏర్పాటుకు దేవనహళ్లి(Devanahalli) సమీపంలోని 13 గ్రామాలకు చెందిన 1,777 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు గతంలో కర్ణాటక ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సిద్ధరామయ్య తాజా నిర్ణయంతో.. ఏరోస్పేస్ ఏర్పాటు విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికయితే పక్కన పెట్టిందనే భావించాలి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తోంది. దీంతో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కర్ణాటక, ఏపీ మధ్య పోటీ వాతావరణం నెలకొందని చెప్పాలి.
Dear Aerospace industry, sorry to hear about this. I have a better idea for you. Why don’t you look at Andhra Pradesh instead? We have an attractive aerospace policy for you, with best-in-class incentives and over 8000 acres of ready-to-use land (just outside Bengaluru)! Hope to…
— Lokesh Nara (@naralokesh) July 15, 2025
‘సిద్ధరామయ్య పునరాలోచించాలి’..
ఇటు కర్ణాటక బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం మంచి అవకాశాన్ని చేజార్చుకుంటోందని ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు.
భారతదేశ అంతరిక్ష రాజధాని, HAL, NAL, DRDO, ISRO, ఎయిర్‌బస్, బోయింగ్ సహా చాలా స్టార్టప్ కంపెనీలకు నిలయమైన బెంగళూరులో ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటుకు సిద్ధరామయ్య ప్రత్యేక చొరవ చూపాలని బిజెపి ఎంపీ అన్నారు.
(ఈ వార్త మొదట ఫెడరల్ కర్ణాటక (The Federal Karnataka)లో ప్రచురితమైంది.)