కేరళలో ప్రచారానికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు పోటీ చేస్తున్నారు? అసలు ఉప ఎన్నిక ఎందుకు జరుగుతోంది?

Update: 2024-06-22 11:18 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో కేరళలో పర్యటించనున్నారు. వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె పాల్గొననున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు.

బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మధ్య కోల్‌కతాలో 40 నిమిషాలపాటు జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. రాయ్‌బరేలీ నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ 3,90,030 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాయనాడ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పార్లమెంటుకు ఒక స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండడంతో ఆయన వయనాడ్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి ప్రియాంకను పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

వాయనాడ్‌లో ప్రియాంక ప్రధాన ప్రత్యర్థులు వామపక్షాలు, బిజెపి. ఈ రెండు పార్టీలకు బెనర్జీ వ్యతిరేకం. ఆ కారణంగానే ఆమె ప్రచారానికి రానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News