ఐఎన్ఎస్ విక్రాంత్ నిధుల గోల్ మాల్.. బీజేపీ నేతపై చీటింగ్ కేసు
డికమిషన్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను బాగు చేస్తామని చెప్పి మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత ప్రజల నుంచి రూ. 57 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని..
By : The Federal
Update: 2024-08-13 08:03 GMT
డికమిషన్ చేసిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను కాపాడతామని చెబుతూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు ప్రజల నుంచి విరాళాలు సేకరించారని అయితే ఆ మొత్తాలను ఏం చేశారనే దానిపై విచారణ చేయాలని ముంబై కోర్టు ఆదేశించింది. పోలీసులు ఈ అంశంపై సరిగా దర్యాప్తు చేయలేదని చీటింగ్ కేసును తేలిగ్గా తీసుకున్నారని ఆక్షేపించింది.
అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఎస్ప్లానేడ్ కోర్టు), ఎస్పీ షిండే, గత వారం కేసు విచారించారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. విక్రాంత్ విమాన వాహక యుద్ధనౌక కాపాడాలనే ప్రచారం కోసం తాను రూ. 2 వేలను 2013 లో ఇచ్చానని ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. దీనిపై 2022 లో ట్రాంబే పోలీస్ స్టేషన్ లో సోమయ్య పై కేసు నమోదు అయింది.
ఓడను కాపాడేందుకు సోమయ్య రూ.57 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. అయితే, ఆ మొత్తాన్ని మహారాష్ట్ర గవర్నర్ సెక్రటరీ కార్యాలయానికి జమ చేయకుండా, నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)కి బదిలీ చేశారు.
కేసు దర్యాప్తు అధికారి 'సి' సారాంశాన్ని (క్లోజర్ రిపోర్ట్) కోర్టుకు సమర్పించారు, విచారణ జరిపిన తరువాత, "నేరం నిజం లేదా అబద్ధం కాదు" అనే దానిలోకి వస్తుందని తేలింది. అయితే అపార్థం కారణంగా కేసు నమోదు చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను రక్షించడానికి డబ్బును విరాళంగా ఇచ్చిన సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు, విచారణ సమయంలో సాక్షులు సహకరించారని, నిందితులు ఆ మొత్తాన్ని సేకరించారని అభిప్రాయపడింది.
"కానీ దర్యాప్తు అధికారి మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయం లేదా (రాష్ట్ర) ప్రభుత్వం వద్ద ఆ మొత్తాన్ని నిందితులు డిపాజిట్ చేసినట్లు చూపించే ఎటువంటి పత్రాన్ని సమర్పించలేదు. కాబట్టి ఈ విషయంలో, దర్యాప్తు అధికారి ఏమి దర్యాప్తు చేయలేదు. వారు నిందితులు చెప్పిన సమాచారం మాత్రమే తీసుకున్నారు ” అని మేజిస్ట్రేట్ చెప్పారు. నిందితులు ఇలా అనేక చోట్ల విరాళాలు స్వీకరించారని కోర్టు తెలిపింది.
కానీ దర్యాప్తు అధికారి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఎటువంటి బాధ్యతను తీసుకోలేదని, వారు సహకరించడానికి సిద్ధంగా ఉన్న మీరు( పోలీసులు) ఉదాసీనంగా ఉన్నారని పేర్కొంది.
కేసు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, "ఈ విషయంలో తదుపరి దర్యాప్తు అవసరమని నాకు అనిపిస్తోంది" అని మేజిస్ట్రేట్ అన్నారు. తన పరిశీలనల నేపథ్యంలో తదుపరి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విచారణ అధికారిని కోర్టు ఆదేశించింది.
ఐఎన్ఎస్ విక్రాంత్ భారత దేశంలో ఓ విమానవాహక యుద్ధ నౌక. 1961 లో భారత నావిక దళంలో ప్రవేశపెట్టారు. 1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో కీలకపాత్ర పోషించింది. పశ్చిమ పాకిస్తాన్ ( ప్రస్తుత పాకిస్తాన్) సైన్యాలు తూర్పు పాకిస్తాన్ లో( ప్రస్తుత బంగ్లాదేశ్) అలజడి సృష్టించి బెంగాలీ మాట్లాడే ప్రజలపై భారీగా హింసకు పాల్పడ్డాయి. లక్షలాది మంది ప్రజలను ఊచకోత కోశాయి. ఈ అకృత్యాలతో భయపడిన ప్రజలు భారీగా భారత్ కు శరణార్థులుగా రావడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ పై యుద్ధానికి ఆదేశించారు.
అప్పటి సైనిక జనరల్ సామ్ మానేక్ షా వ్యూహలతో పాకిస్తాన్ కేవలం 13 రోజుల్లోనే చేతులేత్తేసింది. దాదాపు 93 వేల మంది సైనికులతో పాకిస్తాన్ ఢాకాలో సరెండర్ అయింది. ఈ యుద్దంలో కీలక పాత్ర పోషించి సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ సైనికులు ఎవరు రాకుండా అడ్డుకుంది విక్రాంతే. ఇది 1997లో ఉపసంహరించబడింది. జనవరి 2014లో, ఓడ ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించబడింది. అదే సంవత్సరం నవంబర్‌లో దీనిని తుక్కు చేసి వివిధ అవసరాలకు వినియోగించారు.