‘స్వదేశీ మన జీవన మంత్రం కావాలి’

పెట్టుబడి ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదు. ఎక్కడ తయారైందన్నది ముఖ్యం. ఎలక్ట్రిక్ కారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ;

Update: 2025-08-26 13:06 GMT
Click the Play button to listen to article

తమ ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ('Make in India')చొరవ ప్రపంచ, దేశీయ తయారీదారులకు మార్గం చూపిందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. గుజరాత్‌(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారయిన మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనం (EV) ఇ-విటారాను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనాలని కోరారు.


మార్గం చూపిన మేక్ ఇన్ ఇండియా..

"ఈ రోజు చాలా శుభదినం. 2012లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుతి సుజుకికి హన్సల్‌పూర్‌లో భూమి కేటాయించా. ఇప్పడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ మొదలుపెట్టింది. ఇక్కడ తయారయిన ఈ-వాహనాలు 100 దేశాలకు ఎగుమతి కాబోతున్నాయి. భారతదేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రపంచం నడుపుతుంది. పెట్టుబడి ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదు. ఎక్కడ తయారైందన్నది ముఖ్యం. మారుతి సుజుకి స్వదేశీ కంపెనీ. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ప్రపంచ, దేశీయ తయారీదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. దేశంలో అతిపెద్ద కార్ల ఎగుమతిదారు అయిన మారుతి సుజుకి వంటి కంపెనీలు ఈ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయి. జపాన్ భారత్‌లో తయారు చేసే వస్తువులు కూడా స్వదేశీగానే పరిగణించాలి. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకుంటుంది.


పదేళ్లలో గణనీయమైన ఉత్పత్తి..

"EV తయారీలో బ్యాటరీ అత్యంత కీలకమైన భాగం. కొన్నేళ క్రితం వీటి కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. భారత్ ఇప్పుడు స్వయంగా తయారుచేయడం ప్రారంభించింది. వాస్తవానికి మేం 2017లో ఇక్కడ TDSG బ్యాటరీ ప్లాంట్‌కు పునాది వేశాం. దేశంలో మొదటిసారిగా మూడు జపనీస్ కంపెనీలు బ్యాటరీ సెల్‌లను ఉత్పత్తి చేయడానికి కలిసి వచ్చాయి. పదేళ్లలో భారత్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 500 శాతం పెరిగింది. మొబైల్ ఉత్పత్తి 2,700 శాతం పెరిగింది. రక్షణ ఉత్పత్తి 200 శాతం పెరిగింది. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. అలాంటపుడు ఏ రాష్ట్రం కూడా వెనుకబడకూడదు. ప్రతి రాష్ట్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశం ఇక్కడితో ఆగదు. మరింత మెరుగ్గా రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.’’  అన్నారు మోదీ. 

Tags:    

Similar News