‘125 యూనిట్ల వరకు ప్రీ కరెంటు’

ఎక్స్ వేదికగా ప్రకటించిన బీహార్ సీఎం నితీష్ కుమార్..;

Update: 2025-07-17 08:12 GMT
Click the Play button to listen to article

బీహార్(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్నాయి. మొత్తం 243 స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్డీఏ మద్దతుతో అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ (CM Nitish Kumar) జేడీ(యూ) పార్టీ ఎన్నికల తాయిలాలను ప్రకటించడం మొదలుపెట్టారు. గృహ యజమానులందరికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని గురువారం హామీ ఇచ్చారు. 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం..ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రతిపక్ష I.N.D.I.A. కూటమికి నాయకత్వం వహిస్తోన్న RJD నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News