చేవెళ్ళ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి వివరాలు

చనిపోయిన వారిలో ఇప్పటివరకు 19 మందిని గుర్తించారు

Update: 2025-11-03 07:03 GMT
Three sisters died in Chevella road accident

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం మీర్జాగూడ దగ్గర సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 25 మంది మరణించిన విషయం తెలిసిందే. తాండూరు(Tandur) ఆర్టీసీ డిపో బస్సును ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ వేగంగా ఢీకొనటంతో ప్రమాదంజరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొందరిపై కంకర పడిన చాలామంది కంకరలో కూరుకుపోయారు. దాంతో ఊపిరి ఆడక 25 మంది(25 passengers died) చనిపోయారు. ప్రమాద స్ధలంలోనే 16 మంది చనిపోగా మిగిలిన వారు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న సమయంలో చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.

మరణించిన, గాయాలపాలైన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇప్పటివరకు 19 మందిని గుర్తించారు. వారిలో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారమ్ తండా కు చెందిన తారిబాయ్, బోరబండకు చెందిన కల్పన, భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, ధన్నారం తండాలోని ఏమావత్ తాలీబామ్, దౌల్తాబాద్ మండలం వాస్తవ్యుడు మల్లగుండ్ల హనుమంతు, యాలాల్ వాస్తవ్యురాలు గోగుల అభిత, బోరబండకు చెందిన గోగుల గుణమ్మ, తాండూరుకు చెందిన షేక్ ఖాలీదా హుస్సేన్, తాండూరుకు చెందిన తబస్సుమ్ జహాన్, తాండూరులో ఎల్లయ్య ముగ్గురు కూతుర్లు తనూషా, సాయిప్రియ, నందిని మరణించారు. అలాగే తాండూరుకే చెందిన అఖిల, ఏనుగుల కల్పన, నాగమణి, జహంగీర్ కూడా మరణించారు.

చికిత్స పొందుతున్న వారు

తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న వారిలో కొందరిని అధికారులు గుర్తించారు. వెంకటయ్య, ధన్నారమ్ తండాకు చెందిన బుచ్చిబాబు, హైదరాబాద్ వాస్తవ్యుడు అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి, తాండూరుకు చెందిన శ్రీను, తాండూరుకే చెందిన నందిని, కర్నాటకకు చెందిన బస్వరాజ్, వికారాబాద్ కు చెందిన ప్రేరణ, సాయి, తాండూరు వాస్తవ్యుడు అక్రమ్, తాండూరుకే చెందిన అస్లామ్ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. బాధితులు లేదా చనిపోయిన కుంటుంబసభ్యుల వివరాల కోసం మియినాబాద్ పోలీసు ఇన్సెప్టకర్ ను 94906 17188 నెంబర్లో సంప్రదించాలని అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News