కంకర కింద చావు కేకలు, కన్నీటి దృశ్యాలు ఎన్నో...
అయ్యో, ఇంత ఘోరమా.. ఈ ఫోటోలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు!
ఇప్పుడీ ప్రాంతం ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. అయినవాళ్ల కోసం వెతుకులాట సాగుతోంది.. ఎటుచూసినా రోదనలే.. ఆక్రందనలే..
కంకరలో కూరుకుపోయి ప్రయాణికులు రక్షించామంటూ ఆర్తనాధాలు చేశారు.
మరికొందరు విగతజీవిగా సీట్లలోనే ఉండిపోయారు. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
బస్సు లో మిగిలి పోయిన వారి కోసం వెతుకులాట
బస్సు రేకుల్ని కోసి ప్రయాణీకులను రక్షించేందుకు సహాయ రక్షణ దళాల ఆతృత
కంకర రాళ్ల కింద చిక్కుకుపోయిన ప్రయాణీకుల ఆర్తనాధాలు
క్రేన్ సాయంతో బస్సు పై పడిన లారీని ఎత్తుతున్న క్రేన్లు
ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడేందుకు తాపత్రయం
బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో గుమికూడిన ప్రజలు
ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ దుస్థితి ఒక్క ప్రమాదం కథ కాదు. ఇది రోడ్లపై పెరిగిపోయిన అనర్ధ పాలన, నిర్లక్ష్యం, అధిక ఆదాయ దాహానికి ప్రతీక.
ఘటనా స్థలాన్ని చూస్తే కంటతడి ఆగదు. రోడ్డు పక్కన తారుమారైన బస్సు, పక్కనే తలకిందులైన టిప్పర్, కంకర కింద నుండి బయటపడ్డ మృతదేహాలు— ప్రతి దృశ్యం మనసును తడిమేస్తుంది.