నన్ను అవమానించడమే ప్రభుత్వ విధానం: కేటీఆర్
ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
తనను తిట్టడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు. ఇందులో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులకు అభినందనలు తెలిపారు. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టం కనిపిస్తోందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలై ఉండుంటే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో తెలిసి ఉండేదన్నారు. ప్రతి విషయంలో తనను తిడుతూ ప్రభుత్వం సమయాన్ని వృథా చేస్తోందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని అన్నారు. ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఉద్యమించాలని కూడా పిలుపునివ్వనున్నట్లు సమాచారం.