బెంగాల్ లో ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమికి టీఎంసీ షాక్ ఇవ్వగా, తాజాగా లెఫ్ట నేతలు సైతం ఝలక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. సీట్ల షేరింగ్ పై ఇరు పార్టీల నాయకులు పట్టుదల ప్రదర్శించడంతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్థం నెలకొంది. పై స్థాయిలో నాయకులు కలిసారు కానీ కిందిస్థాయిలో ఓట్ల బదిలీ జరగదనే అనుమానాలను ఇరు పార్టీల కార్యకర్తలు లేవనెత్తుతున్నారు.
చాలామంది సీట్ల కోసం పట్టుబడుతుండడంతో ఇరు పార్టీలు నాయకత్వాలు డైలామాలో ఉన్నాయి. కొన్ని సీట్లలో కుదిరిన డీల్‌పై ఇప్పటికే చెలరేగిన భిన్నాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ఇరువైపులా మధ్యవర్తులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని 42 స్థానాలకు గానూ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లు పలు దఫాలుగా చర్చల అనంతరం 31 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగలిగాయి.
ఇందులో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 10 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. వామపక్షాలు 23 స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కూచ్ బిహార్ సీట్ కోసం ఫార్వర్డ్ బ్లాక్, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయి.
చిన్న పార్టీలు సీట్లు వదులుకోవడానికి..
లెఫ్ట్ ఫ్రంట్‌లోని చిన్న పార్టీలు తమ కోటాలో సీట్లను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. పురూలియాలో కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఫార్వర్డ్ బ్లాక్ తన పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపడానికి తీవ్రంగా ఒత్తిడి పెడుతోంది. సిపిఐ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి) కూడా తమకు చెరో రెండు సీట్లను కేటాయించాలని కోరుతున్నాయి.
ఇదే విషయంపై కాంగ్రెస్ వర్గాలు ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, మార్చి 31 నాటికి ఇండి కూటమి పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సీటు షేరింగ్ ఒప్పందం ద్వారా భాగస్వాముల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరగకపోవచ్చని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సీట్ల పంపకాల చర్చలపై కాంగ్రెస్‌లోని ఒక వర్గం, వామపక్ష నేతల మధ్య పెరుగుతున్న దూరం కారణంగానే ఈ ఆందోళన ఎక్కువగా ఉంది.
అసంతృప్త నేతలు ఖర్గేకు లేఖ
పశ్చిమ బెంగాల్ లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగు జిల్లా యూనిట్లు సీట్ల షేరింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహూల్ గాంధీ, ఇతర ఏఐసీసీ నాయకులకు కూడా లేఖ ప్రతులను పంపారు.
“పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ (సిపిఐ(ఎం) కాంగ్రెస్‌కు పోటీ చేయడానికి వదిలిపెట్టిన సీట్ల గురించి తెలుసుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు నిజంగా షాకింగ్, నిరాశ కలిగించింది. కాంగ్రెస్‌కు ఇచ్చే చాలా స్థానాలు పార్టీకి అతి తక్కువ విజయావకాశాలు ఉన్న స్థానాలు” అని పార్టీ దక్షిణ కోల్‌కతా, ముర్షిదాబాద్, పుర్బా మిడ్నాపూర్, జల్పాయ్ గురి, జార్‌గ్రామ్ యూనిట్ల జిల్లా అధ్యక్షులు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. లెఫ్ట్‌ఫ్రంట్‌తో సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నప్పుడు పార్టీ రాష్ట్ర నాయకత్వం తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం పట్ల జిల్లా అధ్యక్షులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. “మొత్తం ప్రక్రియలో సీరియస్‌నెస్ లేదు. ఇది అకస్మాత్తుగా జరిగింది, ”అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
'సీట్ల పంపకంలో సీరియస్ లేదు'
ఇదే విషయంపై వామపక్ష నాయకులు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. "బిమందా (లెఫ్ట్ ఫ్రంట్ యొక్క అష్టదిగ్గజ ఛైర్మన్ బిమన్ బోస్)తో సీట్లపై చర్చలు జరపడానికి పిసిసి ఒక దిగువ స్థాయి నాయకుడు నీలోయ్ ప్రమాణిక్‌ను మొదట పంపింది," అని ఒక ఫ్రంట్ నాయకుడు విమర్శించారు. ఇదే పొత్తులో అనుసరించాల్సిన అంశంమని వారు అంటున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తాము కోరినన్నీ సీట్లు కేటాయించనందుకు లెఫ్ట్ ఫ్రంట్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి రాజా, ఖర్గేతో తమ అసంతృప్తిని తెలియజేసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు లెఫ్ట్ ఫ్రంట్ వర్గాలు తెలిపాయి. యాదృచ్ఛికంగా, ఈ నెల ప్రారంభంలో ముంబైలో జరిగిన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు ర్యాలీకి సీపీఐ(ఎం), సీపీఐ నేతలు హాజరుకాలేదు.
ఇప్పటికే టీఎంసీ ఇండి కూటమికి హ్యండ్ ఇవ్వగా తరువాత ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) ఏకపక్షంగా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మరో దెబ్బ తగిలింది. 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర, TMC యేతర మహా కూటమిలో పార్టీ భాగమైంది. కాంగ్రెస్ లేదా లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేసే స్థానాల్లో తమ అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ఐఎస్‌ఎఫ్‌ని ఒప్పించేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.