‘‘వక్ఫ్ పై బెంగాల్ సీఎం ప్రతినిధులు మౌనంగా ఉన్నారు’’

కేంద్రం నిర్వహించిన సమావేశాలకు హజరైన ఏమి చెప్పలేదన్న సువేందు అధికారి

Update: 2025-12-11 10:13 GMT
సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ చట్టం -2025 ను టీఎంసీ మొదట వ్యతిరేకించిందని, అయితే కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆమె ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఆయన చెప్పారు.

లక్నో, ఢిల్లీలో జరిగిన నాలుగు సమావేశాలలో రెండింటిలో పశ్చిమ బెంగాల్ సీనియర్ అధికారులు హజరయ్యారు. అయినప్పటికీ వారు మౌనంగానే ఉన్నారని చెప్పారు. వారు తిరిగి బెంగాల్ కు వచ్చిన తరువాత మమతా బెనర్జీని రక్షించే లక్ష్యంతో తప్పుడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను, రాజకీయ మోసాన్ని బహిర్గతం చేసింది’’ అని రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ సువేందు అధికారి ఆరోపించారు.
డిసెంబర్ 3న ముస్లింలు అధికంగా ఉన్న మాల్దాలో జరిగిన సభలో మమతా బెనర్జీ మాట్లాడారు. కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లుపై తన పార్టీ అనుసరించిన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ చట్టం బీజేపీ మాత్రమే తయారు చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను తాకడానికి అనుమతించదని అన్నారు.
డిసెంబర్ ఆరు లోగా 82 వేల వక్ఫ్ వివరాలను సెంట్రల్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం చాలామంది మైనారిటీల నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
‘‘కొందరు మతం ఆధారంగా పోరాడుతున్నారు. వక్ఫ్ చట్టాన్ని బీజేపీ రూపొందించింది. మేము రాష్ట్ర అసెంబ్లీలో దానిని ప్రతిఘటించాము. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాము.
అది కొనసాగుతోంది. మేము ఇక్కడ ఉన్నంత కాలం వక్ఫ్ ఆస్తులను ఎవరిని తాకనివ్వం. నేను ఎవరీని మతపరమైన ప్రదేశాలను తాకనివ్వను. నేను మతపరమైన రాజకీయాలను చేయనివ్వను’’ అని బెనర్జీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కౌంటర్ గా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘యూఎంఈఈడీ’ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల నమోదుపై కేంద్రం రాష్ట్రానికి పదేపదే సమాచారం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్య తీసుకోవడంలో విఫలమైంది’’ అని అధికారి పేర్కొన్నారు.
దీని ఫలితంగా ఇప్పుడు అనేక ఆస్తులు ఇప్పుడు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశం మొత్తం వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసినప్పటికీ పశ్చిమ బెంగాల్ రాజకీయా కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిందని, ఈ పరిణామాలను ముస్లిం సమాజం భరించాల్సి ఉంటుందని అన్నారు.
బెంగాల్ లో నమోదు చేయని వక్ఫ్ ఆస్తులకు సంబంధించి తలెత్తే సంక్షోభానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అన్నారు. రాష్ట్ర రాజకీయ లాభం కోసం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేడు ఈ సమాజాన్నే ప్రమాదంలో పడేశారని అధికారి అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల తరువాత భారీగా హింస చెలరేగింది. దోపిడీలు, దహనం, ప్రయివేట్, ప్రభుత్వ ఆస్తుల దహనం, ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
Tags:    

Similar News