‘‘త్వరలో రాజ్యాంగ పారాయణ నిర్వహిస్తాం’’

కాంగ్రెస్ ప్రకటన

Update: 2025-12-11 13:04 GMT

వచ్చే కొన్ని నెలల్లో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లక్షలాది మందితో ‘గీత’ పఠనం జరపగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తాము లక్షలాది మందితో ఖురాన్ పఠనం నిర్వహిస్తామని టీఎంసీ బహిష్కిృత నేత హుమాయున్ కబీర్ ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలో కాంగ్రెస్ చేరింది.

వివాదాస్పద శాసనసభ్యుడు హుమాయున్ కబీర్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీద్ ప్రతిరూపానికి శంకుస్థాపన చేసిన ఒక రోజు తరువాత ‘గీత’ పారాయణ కార్యక్రమం జరిగింది.
దీనికి పశ్చిమబెంగాల్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వారు సహ మొత్తం ఐదు లక్షల మంది హజరయ్యారు. మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బెంగాల్ యూనిట్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్, డిసెంబర్ 20 న కోల్ కతలోని ధర్మతలాలో రాజ్యాంగ పఠనం నిర్వహిస్తామని ప్రకటించారు.
హక్కులపై అవగాహన కొరకే కార్యక్రమం..
‘సహస్ర కొంటే సంగ్భిధాన్ పథ్’ ( రాజ్యాంగాన్ని వెయ్యి గొంతులతో చదవడం) అనే కార్యక్రమం పౌరుల రాజ్యాంగ హక్కులపై ప్రజల్లో అవగాహాన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు.
‘‘డిసెంబర్ 20న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో రాణి రష్మోని రోడ్డులో 100 మంది రాజ్యాంగాన్ని చదువుతారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలు, మతాలు, కులాలు, మతాల ప్రతినిధులు హజరవుతారు’’ అని సర్కార్ కోల్ కతలోని విలేకరుల సమావేశంలో అన్నారు. రాజ్యాంగ ప్రతి పౌరుడి వారి ప్రాథమిక హక్కులను ఇస్తుందని ఆయన అన్నారు.
రాజ్యాంగ రక్షణలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ‘‘ప్రజా పారాయణం’’ అనేది ప్రజాస్వామ్య విలువల ప్రతీకాత్మక ప్రకటన అన సర్కార్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనను అంతం చేయాలని ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ముగ్గురు అరెస్ట్
ఇదిలా ఉండగా డిసెంబర్ 7న గీతా పారాయణం జరుగుతున్న సమయంలో బ్రిగ్రేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఇద్దరు ఆహారం అమ్ముతున్న దాడి చేసినందుకు కోల్ కత పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
దాడి చేసిన వారు తమ వద్ద ఉన్న వస్తువులను పారవేసి, చెవులు పట్టుకుని సిటప్ లు ప్రదర్శించేలా చేశారని ఆయన అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.
దాడికి పాల్పడిన నిందితులను టీఎంసీ,కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) విమర్శించడంతో పాటు బీజేపీ లౌకిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆరోపించాయి. ఇది రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Tags:    

Similar News