‘షమీ’ నువ్వు అక్కడి నుంచి, మా పార్టీ తరఫున పోటీ చేస్తావా?

భారత ఫాస్ట్ బౌలర్ రాజకీయాల్లోకి రానున్నాడా. ఎంపీగా పోటీ చేయాలని ఓ జాతీయ పార్టీ ఆఫర్ ఇచ్చిందా? దీనికి షమీ ఇచ్చిన సమాధానం ఏంటీ?

Update: 2024-03-08 11:24 GMT
భారత ఫాస్ట్ బౌలర్, మహ్మద్ షమీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ని ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ ఓ ప్రతిపాదన తీసుకువచ్చిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాలి మడమకి గాయంతో లండన్ లో శస్త్రచికిత్స తీసుకుని కోటుకుంటున్న షమీ ముందు, కమలదళం ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై షమీ ఇంకా స్పందించలేదని తెలిసింది. అన్ని కుదిరితే పశ్చిమ బెంగాల్ లోని బషీర్హట్ నుంచి పోటీ చేయవచ్చని బీజేపీ కోరినట్లు తెలిసింది.

ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగవడంపైనే బెంగాల్ ఎక్స్ ప్రెస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారత జట్టులో కీలకంగా ఉన్న సభ్యుడెవరూ కూడా రాజకీయాల్లోకి రాలేదు. గౌతమ్ గంభీర్ కూడా క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకనే ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే తాజాగా జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఒక వేళ షమీ గనక ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే క్రికెట్ కు ముందు రిటైర్ మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది.
వరల్డ్ కప్ తరువాత షమీ క్రికెట్ కు దూరమయ్యాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో లీడింగ్ వికెట్ టేకర్ షమీనే. ఈ నెలలో జరగబోయే ఐపీఎల్ లో కూడా ఈ బెంగాల్ పేసర్ అందుబాటులో ఉండట్లేదు. గుజరాత్ టైటాన్స్ తరఫున గత రెండు సీజన్లలో షమీ ప్రాతినిధ్యం వహించాడు.
షమీకి సర్జరీ జరిగిన తరువాత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఈ ఫాస్ట్ బౌలర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశాడు.


Tags:    

Similar News