ఈ రెండు పార్టీలు కలిసి సహజీవనం చేస్తున్నాయి: రాహూల్ గాంధీ విమర్శలు

ఒడిషాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి సహజీవనం చేస్తున్నాయని రాహూల్ గాంధీ విమర్శించారు.

Update: 2024-04-28 09:28 GMT

ఢిల్లీలో ఉన్న ఒకాయన బిలియనీర్ల కోసం పని చేస్తున్నారని, ఒడిశా లో ఉన్న మరో నేత కొద్ది మంది వ్యక్తుల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లను ఉద్దేశించి రాహూల్ గాంధీ విమర్శించారు. ఆదివారం ఆయన ఒడిషాలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించారు.

కటక్‌లోని సలేపూర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, బిజెడి, బిజెపి ఎన్నికల పోరులో పరస్పరం పోరాడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి అవి రెండు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వీరి కలిసి సహజీవనం చేస్తున్నారని, లేదా పెళ్లి చేసుకున్నారని పిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరుకే ఉన్నాడని, నిజానికి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నది తమిళియన్ అధికారి వికే పాండియన్ అని విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు నవీన్ పట్నాయక్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరిపింది. ఇది చివరి నిమిషంలో రద్దు అయ్యాయి. దీనిని ఉద్దేశించి రాహూల్ గాంధీ ఈ  వ్యాఖ్యలు చేశారు. 
పిఎం మోడీని ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, "అంకుల్-జీ, నవీన్-బాబు ఒడిశాకు పాన్(PAANN) ఇచ్చారు, అంటే పాండియన్, అమిత్ షా, నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్. వారు మీ సంపదను దోచుకున్నారు." అని ఆరోపించారు.
Tags:    

Similar News