పశ్చిమ బెంగాల్: దక్షిణం దక్కెదెవరికో..

సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపుకు చేరుకుంది. రేపు జరిగే ఏడో దశ పోలింగ్ తో ఎన్నికలు ముగుస్తాయి. ఈ దశలోనే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సందేశ్ కాళీ..

Update: 2024-05-31 07:37 GMT

దక్షిణ బెంగాల్ లోని శనివారం పోలింగ్ జరుగనుంది. సాంప్రదాయకంగా ఈ ప్రాంతం అధికార టీఎంసీకి కంచుకోట. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ క్రీడాలో ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ముఖ్యంగా ఈ దశ ఎన్నికల్లో జాతీయ దృష్టిని ఆకర్షించిన సందేశ్ కాళీ ప్రాంతం బసిర్ హాత్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మహిళలపై లైంగిక అఘాయిత్యాలు, భూకజ్జా ఆరోపణలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ షేక్ అకృత్యాలపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచార బరిలోకి దిగింది.

పశ్చిమ బంగాల్‌లోని చివరి దశ లోక్‌సభ ఎన్నికలలో డమ్ డమ్, బరాసత్, బసిర్‌హత్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తరాలలో టిఎంసి 2019 ఎన్నికలలో విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి సవాళ్ల మధ్య తన పట్టును కొనసాగించాలని టీఎంసీ వాంఛిస్తోంది. ఈ తొమ్మిది స్థానాల్లో మరోసారి గెలిచి రాష్ట్రంలో తన ప్రాభావం తగ్గలేదని మమతాసర్కార్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
TMC ఆధిపత్యానికి పరీక్ష
జూన్ 1న 17,470 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  అందులో 83.19 లక్షల మంది పురుషులు, 80.20 లక్షల మంది మహిళలు, 538 మంది థర్డ్ జెండర్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.
ఏడవ దశ పోలింగ్‌లో 124 మంది పోటీదారులలో, కోల్‌కతా దక్షిణ్‌లో అత్యధికంగా 17 మంది అభ్యర్థులు ఉన్నారు, తర్వాత జాదవ్‌పూర్ (16), బసిర్‌హత్, కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ స్థానాల్లో 15 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
డమ్ డమ్ లోక్‌సభ స్థానం నుంచి 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, బరాసత్, డైమండ్ హార్బర్, మధురాపూర్ (ఎస్సీ) స్థానాల్లో 12 మంది అభ్యర్థులు, జయనగర్ (ఎస్సీ)లో 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ దశలో అనేక అత్యున్నత రాజకీయ యుద్ధాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా, TMC భవిష్యత్ నాయకుడు, పార్టీ నంబర్ టూ గా పరిగణించబడుతున్న అభిషేక్ బెనర్జీ, డైమండ్ హార్బర్ నుండి పోటీ చేస్తున్నారు.
టిఎంసి 'మోడల్ నియోజకవర్గం'గా అభివర్ణిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం దీనిని హింసాయుత ప్రయోగ శాలగా అభివర్ణిస్తున్నాయి. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన అభిషేక్ పై సీపీఐ (ఎం) అభ్యర్థి ప్రతికూర్ రెహమాన్, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ జరగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
సందేశ్ కాళీపై దృష్టి..
మైనారిటీలు అధికంగా ఉండే బసిర్‌హత్ లోక్‌సభ స్థానంలోనే సందేశ్ కాళీ ఉంది. ఇక్కడ మైనారిటీగా ఉన్న హిందూ స్త్రీలపై టీఎంసీ బహిష్కృత నాయకుడు షాజహాన్ షేక్ చేసిన దుర్మార్గాల వల్ల ఇది జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇక్కడి నుంచి టీఎంసీ తరఫున హాజీ నూరుల్ ఇస్లాంను బరిలోకి దింపగా, బీజేపీ ప్రముఖ నిరసనకారులైన రేఖాపాత్రను బరిలోకి దింపింది.
ప్రచారానికి ముందు పాత్రాకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా పిలుపునివ్వడం ఆమె అభ్యర్థిత్వానికి ఊపు తెచ్చింది. సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే నిరపడ సర్దార్‌ను రంగంలోకి దించడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
కోల్‌కతా నార్త్‌లో, అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్, మూడు పర్యాయాలు TMC ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయకు బీజీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తపస్ రాయ్ నుంచి గట్టి పోటీ నెలకొంది. ఆయన నాలుగు సార్లు టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఎన్నికయ్యారు. అయితే ఈ మధ్య పార్టీ మారి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ పోటీ TMCలోని అంతర్గత పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది, బందోపాధ్యాయ పాత గార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాయ్ కొత్త నాయకులకు ప్రతీక. వామపక్ష-కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ భట్టాచార్య కూడా పోటీలో ఉన్నారు.
అదే విధంగా డమ్ డమ్ లోక్‌సభ స్థానంలో, ఐదేళ్ల క్రితంతో పోల్చితే ఎన్నికల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక్కడ పటిష్టంగా కనిపిస్తున్న బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిట్టింగ్ ఎంపీ సౌగతారాయ్ విస్తృతంగా నియోజకవర్గం మొత్తం పర్యటనలు సాగిస్తున్నాడు.
ముక్కోణపు పోటీ
డమ్ డమ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. సీపీఎం- కాంగ్రెస్ కూటమి తరఫున కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తిని బరిలోకి దింపింది. బీజేపీ తృణమూల్ మాజీ ఎమ్మెల్యే శిల్పద్ర దత్తాను పోటీలో నిలిపింది.
కోల్‌కతా దక్షిణ్‌లో, బిజెపి మాజీ కేంద్ర మంత్రి దేబశ్రీ చౌధురిపై టిఎంసి అనుభవజ్ఞుడు మాలా రాయ్ పోటీపడగా, జాదవ్‌పూర్‌లో టిఎంసి పార్టీ యువజన విభాగం అధ్యక్షురాలు సయోని ఘోష్‌ను పోటీకి దింపింది. ఘోష్‌కు సీపీఐ(ఎం) నుంచి సృజన్ భట్టాచార్య, బీజేపీ నుంచి అనిర్బన్ గంగూలీ నుంచి గట్టి పోటీ ఉంది.
జాదవ్‌పూర్ సీటు TMCకి చారిత్రాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే 1984లో సీపీఐ (ఎం) అనుభవజ్ఞుడైన సోమనాథ్ ఛటర్జీని ఓడించడం మమతా బెనర్జీ తనదైన ముద్ర వేసింది. దక్షిణ బెంగాల్ ప్రాంతం సాంప్రదాయకంగా TMC కంచుకోటగా ఉంది, పార్టీ దక్షిణ 24 పరగణాలలో 31 స్థానాలకు 30, ఉత్తర 24 పరగణాలలో 33 లో 29, 2021 అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌కతాలోని మొత్తం 16 స్థానాలను గెలుచుకుంది.
బీజేపీ ప్రచారం
BJP ప్రచారం అవినీతి, మహిళల భద్రత రాజకీయ గూండాల ప్రతిఘటన వంటి అంశాలపై దృష్టి సారించింది, ఇది బసిర్‌హత్ వంటి నియోజకవర్గాలలో బలంగా పని చేస్తుందని వారు విశ్వసిస్తున్నారు. మరోవైపు, టిఎంసి తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అభివృద్ధి పనులు, నాయకుల చరిష్మాపై ఆశలు పెట్టుకుని ప్రచారం చేస్తోంది.
లెఫ్ట్-కాంగ్రెస్ కలయిక, సుజన్ చక్రవర్తి, సృజన్ భట్టాచార్య వంటి అనుభవజ్ఞులైన అభ్యర్థులను కలిగి ఉంది, TMC-BJP ద్వంద్వ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం, బెంగాల్ రాజకీయాల్లో దాని ప్రాభావాన్ని తిరిగి పొందడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దశ పోలింగ్ కోసం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు 960 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
Tags:    

Similar News