లంచాలు ఇచ్చేందుకు యువత రుణాలు తీసుకుంటోంది: ప్రధాని మోదీ

బెంగాల్ టీఎంసీ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, వారు చేసే స్కామ్ లకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కట్ అండ్ కమీషన్ సంస్కృతి..

Update: 2024-04-26 11:02 GMT

పశ్చిమ బెంగాల్ అవినీతి తారాస్థాయికి చేరిందని, ఉద్యోగాలు ఇవ్వడానికి టీఎంసీ నేతలు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.  లంచాలు ఇవ్వడం కోసం యువత రుణాలు చేస్తున్నారని, వారి భవిష్యత్ అంధకారంగా మారిందని టీఎంసీ నేతృత్వంలోని మమతా సర్కార్ పై నిప్పులు చెరిగారు.

పశ్చిమ బెంగాల్ లో స్కామ్ లు రాజ్యమేలుతున్నాయని, టీఎంసీ అంటే స్కామ్ లకు పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక్కడి "కట్ అండ్ కమీషన్" సంస్కృతి కారణంగా పశ్చిమ బెంగాల్ యువకులు నష్టపోయారని విమర్శించారు.

టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చేపట్టిన 26 వేల టీచర్ల నియామక పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.

మాల్దాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, టీఎంసీ పాల్పడుతున్న స్కామ్ లకు ప్రజలు నష్టపోతున్నారని బెంగాల్ యువకుల భవిష్యత్తుతో ఆ పార్టీ ఆడుకుంటోందని ఆయన అన్నారు.
అపాయింట్‌మెంట్‌లను హైకోర్టు రద్దు చేసింది
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం సుమారు 26,000 కుటుంబాల జీవనోపాధిని కొల్లగొట్టిందని ఆయన అన్నారు. ఈ వారం ప్రారంభంలో, కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ-ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష-2016 (SLST)ను రద్దు చేసింది. ఇందులో భారీ స్థాయిలో కుంభకోణం చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది.
కమ్యూనల్ ట్విస్ట్ ఇస్తోంది
"టిఎంసి పాలనలో, ఉన్నది ఒక్కటే - అదే వేల కోట్ల కుంభకోణాలు. ఇక్కడ దోషి టిఎంసి, కానీ మొత్తం రాష్ట్రం దాని మోసానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది" అని ప్రధాని అన్నారు. CAA గురించి దుష్ప్రచారం చేస్తున్నారని, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలను ఆయన విమర్శించారు.
పౌరసత్వ (సవరణ) చట్టం "పౌరసత్వం మంజూరు చేయడం అని దానిని లాక్కోవడం కాదు" అని అన్నారు. ''ఈ రెండు పార్టీల మధ్య బుజ్జగింపుల పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ మీ ఆస్తులను లాక్కోవాలనుకుంటోంది, దీనికి వ్యతిరేకంగా టీఎంసీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్‌లో స్థిరపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, మీ సంపదను వారికి పంచాలని కాంగ్రెస్ మాట్లాడుతోందని ఆయన అన్నారు.
Tags:    

Similar News