ఎన్నికల వేళ.. గుప్కార్ అలయెన్స్ లో చీలికలు
ఎన్నికల వేళ గుప్కార్ కూటమిలో చీలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాశ్మీర్ లోయ పార్టీలైన ఎన్ సీ, పీడీపీ మధ్య సీట్ల షేరింగ్ లో అసలు సయోధ్య కుదరడం లేదు
By : Gowhar Geelani
Update: 2024-03-14 08:11 GMT
ఐదేళ్ల క్రితం జమ్మూకశ్మీర్ లో ఏర్పాటు అయిన గుప్కార్ అలయెన్స్ లో చీలికలు పెరుగుతున్నాయి. జే అండ్ కే లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మధ్య సీట్ల పంపకం తేలకపోవడమే ప్రధాన కారణం. కశ్మీర్ లోయతో పాటు పీర్ పంజాల్ లో గల మూడు ఎంపీ సీట్లు తనకే కావాలని నేషనల్ కాన్పరెన్స్(ఎన్సీ) పట్టుబడుతుండడంతో పీడీపీ( పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సీట్ల పంపకాల వివాదం రెండు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇరు పార్టీల మద్ధతుదారులు, నాయకులు సోషల్ మీడియా వేదికగా పోరుకు దిగారు. NC,PDP రెండూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మిత్రపక్షాలు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తన పార్టీ సీట్ల పంపకం పట్టుబడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు.
“ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ కఠినం గా వ్యవహరించడం లేదు. మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే మొత్తం ఆరు స్థానాల్లో మా అభ్యర్థులను నిలబెట్టే వాళ్లం. కానీ గెలిచే మూడు స్థానాలను మాత్రమే మేము కోరుతున్నాం ”అని ఒమర్ అబ్దుల్లా మాట. మేము 50 శాతం సీట్లను త్యాగం చేస్తున్నాం. మాలాగా ఇండియా కూటమిలో 50 శాతం సీట్లను త్యాగం చేసిన పార్టీని చూపించండని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, PDP అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు. తమ పార్టీ ఏ రాజకీయ పార్టీతో 'దంగల్' (కుస్తీ)లో పాల్గొనడానికి రాలేదని, ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర ప్రజల హక్కులను హరించి వేశారని, వాటిని పునరుద్దరించడానికి రాజకీయపక్షాలను ఏకం చేయడానికి తన వంతు ప్రయత్నం చేశానని ముప్తీ అంటున్నారు. ఇవి బాధకరమైన అడుగులుగా పేర్కొన్నారు.
ఆర్టికల్ 370, 35(A) ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు సెమీ అటానమీ, ప్రత్యేక హోదాను తొలగించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 2019లో అర డజనుకు పైగా రాజకీయ పార్టీలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త ఏర్పాటు (పిఎజిడి)లో భాగమైన పార్టీలలో ఎన్‌సి, పిడిపి, సిపిఐ(ఎం), కాంగ్రెస్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్, సజాద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్, బ్యూరోక్రాట్ షా ఫైసల్ నేతృత్వంలోని పీపుల్స్ మూవ్ మెంట్ ఇందులో చేరాయి. అయితే చివర పేర్కొన్న పీపుల్ కాన్పరెన్స్, పీపుల్స్ మూవ్ మెంట్ ఈ గుప్కార్ కూటమి నుంచి వైదొలిగాయి.
ప్రొఫెసర్ నూర్ అహ్మద్ బాబా, కాశ్మీర్ ప్రసిద్ధ రాజకీయ శాస్త్రవేత్త, స్థానిక రాజకీయ సమూహాలు, వ్యక్తులు "ఆగస్టు 5 2019 తర్వాత వచ్చిన మార్పులను సంయుక్తంగా ప్రతిఘటించడానికి" భావోద్వేగ వాతావరణంలో ఆకస్మికంగా ఈ కూటమికి అంకురార్పణ చేశాయి.
పీడీపీని బలహీనం చేయడమే లక్ష్యంగా ఎన్ సీ ఎత్తులు
ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత వాటిని పునరుద్దరించడానికి ఏర్పాటుచేసిన కూటమి, ఎన్నికల సందర్భంగా తమ సిద్ధాంతాలకు ఆధారంగా విడిపోతున్నారు. కూటమి లక్ష్యాల గురించి ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రొఫెసర్ బాబా అంటున్నారు.
ఎన్నికలపరంగా, NC PDPని "డిస్పెన్సబుల్ లయబిలిటీ"గా పరిగణిస్తున్నట్లు బాబా అభిప్రాయపడ్డారు. "ఎన్‌సి బహుశా ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుని పిడిపిని ఎన్నికలపరంగా ఇబ్బంది పెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది" అని ఆయన ఫెడరల్ తో చెప్పారు.
నేడు, PDP మునుపటి కంటే బలహీనంగా ఉంది, ఎందుకంటే దాని సీనియర్ నాయకులు చాలా మంది పార్టీని విడిచిపెట్టారు ఇందులో హసీబ్ ద్రాబు, అల్తాఫ్ బుఖారీ, మహ్మద్ రఫీ మీర్, ఇమ్రాన్ అన్సారీ, సయ్యద్ బషారత్ బుఖారీ తదితరులు ఉన్నారు. ముజఫర్ హుస్సేన్ బేగ్‌తో కలిసి ముఫ్తీ సయీద్ 1990ల చివరలో PDPని స్థాపించారు.
నేషనల్ కాన్పరెన్స్ జమ్మూ కాశ్మీర్ పురాతన రాజకీయ నిర్మాణంగా పరిగణించబడుతుంది. దీని చరిత్ర 1931లో ముస్లిం కాన్ఫరెన్స్ ఏర్పడిన నాటిది. 1930ల చివరలో, షేక్ మొహమ్మద్ అబ్దుల్లా ఆల్ జమ్మూ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌గా మార్చారు.
కాశ్మీర్‌కు చెందిన CPI(M) నాయకుడు, కూటమి కన్వీనర్ ముఖ్య అధికార ప్రతినిధి అయిన మహమ్మద్ యూసుఫ్ తరిగామి కూటమి పదవిని వదులుకోవడానికి నిరాకరించారు, కూటమి భాగస్వాముల మధ్య తాను సంధాకనకర్తగా కొనసాగుతారని నొక్కి చెప్పారు.
“పెద్ద పార్టీలకు పెద్ద బాధ్యతలు ఉంటాయి. వారు పెద్ద చిత్రాన్ని చూస్తారు. వారి విభేదాలను పరిష్కరించడానికి లేదా అభిప్రాయభేదాల గురించి సామరస్యపూర్వకంగా మాట్లాడటానికి కలిసి కూర్చుంటారని నేను ఆశిస్తున్నాను, ”అని తరిగామి ఫెడరల్‌తో అన్నారు.
పిడిపి, ఎన్‌సిల మధ్య విభేదాలను తొలగించేందుకు తాను కృషి చేస్తున్నానని తరిగామి చెప్పారు. “కలిసి కూర్చుని మాట్లాడుకోవడం కుదరదు కదా? ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి నేను నా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నిస్తాను. రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం సీట్ల పంపకంపై ఎన్‌సి, పిడిపి మధ్య విభేదాలను పరిష్కరించడానికి నేను నా శక్తి దాటి మరీ ప్రయత్నిస్తాను. ఎన్నికలపరంగా, విభేదాలు ఉన్నా ఫర్వాలేదు కానీ మా ఉమ్మది లక్ష్యమైన అధికరణ 370 ని తిరిగి సాధించాలి” అన్నారు.