ఢిల్లీ ఎన్నికలు: ఆప్ 55 సీట్లు గెలుచుకుంటుందన్న కేజ్రీవాల్
ఎన్నికల సంఘం తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయిందన్న మాజీ సీఎం;
By : The Federal
Update: 2025-02-08 03:52 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 55 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.
‘‘మేము 55 సీట్లు గెలుస్తున్నాం. మా విజయంలో మహిళల పాత్ర కీలకం, వారి ఇంట్లోని పురుషులను కూడా ఓటు వేయడంలో ఒప్పిస్తే మాకు 60 దాకా సీట్లు వస్తాయి’’ అని మాజీ ముఖ్యమంత్రి అంచనా వేశారు. కాగా 2020 ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 67 సీట్లను సొంతం చేసుకుంది.
ఉచిత పథకాలను రద్దు చేస్తుంది
బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత పథకాలన్నింటిని రద్దు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్, మొహాల్లా క్లినిక్, ప్రభుత్వ పాఠశాలలను విజయవంతంగా నడిపించడం లో విజయవంతం అయిందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తాము మరోసారి ఎన్నికైతే మహిళలకు రూ. 2100, వృద్దులకు అన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తామని హమీ ఇచ్చారు.
ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.
తమ పార్టీ అనేకసార్లు ఈసీని ఫామ్ 17సీని అప్ లోడ్ చేయమని కోరినప్పటికీ ఈసీ నిరకారించిందని ఆరోపించారు. ఇవి ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ లో ప్రతి బూత్ కు పోలైన ఓట్ల వివరాలను తెలియజేస్తుంది. దీనికి ప్రతిగా తమ పార్టీ ఓ వెబ్ సైట్ ను ప్రారంభించిందని, అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని స్థానాలకు సంబంధించి ఫారమ్ 17 సీ డేటాను అప్ లోడ్ చేసినట్లు ఆయన చెప్పారు.
‘‘ఆఫారమ్ లోని ప్రతిబూత్ లో పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. రోజంతా ప్రతి అసెంబ్లీ, ప్రతి బూత్ కు సంబంధించిన డేటాను పట్టిక రూపంలో ప్రదర్శిస్తాం. తద్వారా ప్రతి ఓటరు ఈ సమాచారాన్ని తీసుకోవచ్చు’’ అని కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఎన్నికల సంఘం దాని పారదర్శకతను ప్రకటించుకోవడం దాని బాధ్యత అని కేజ్రీవాల్ అన్నారు. ఇది ఎన్నికల కమిషన్ మాత్రమే చేయాల్సిన పని అని, కానీ అది చేయకపోవడంతో మేమే ఆ పని చేయాల్సి వచ్చిందని ఆప్ నాయకుడు అన్నారు.