‘కులగణన’పై బీజేపీ ప్రతిపక్షానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందా?
జనాభా లెక్కలతో పాటు దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినేట్;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-01 06:25 GMT
ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం సంచలన, అనూహ్య నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కూడా కేబినేట్ నిర్ణయించింది.
కులగణన ప్రచారం గత లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షానికి బాగా సాయపడిందనే లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహరాల క్యాబినేట్ కమిటీ దీనికి సూత్రప్రాయంగా అంగీకరించింది. దేశంలో చైనా వైరస్ విజృంభణ కారణంగా ఈ దశాబ్దపు జనాభా లెక్కలు సేకరణ కార్యక్రమం ఇంకా జరగలేదు.
టైమ్ లైన్ లేదు..
ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణకు నిర్ధిష్ట కాలాన్నికేంద్రం పేర్కొనలేదు. కులాల లెక్కలు సేకరించడానికి అనుసరించాల్సిన ఫార్మాట్ ను కూడా చెప్పలేదు. దీనివల్ల ప్రతిపక్షాలకు, కేంద్రంపై విమర్శలు చేయడానికి తగిన సమయం, అవకాశం లభించింది.
కేంద్ర ప్రభుత్వం 2023 లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులాగే ఇవి కూడా సుదీర్ఘ కాలం తీసుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలు లేవనెత్తిన కులగణనను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో కులగణనకు ఎవరి అంచనాలకు అందకుండా పచ్చజెండా ఊపారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో ఇండి కూటమి పక్షాలు వివిధ కుల సమూహాలు, సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలతో కూడిన కులగణన కోసం తీవ్ర ఒత్తిడి చేశాయి. సామాజిక న్యాయ విధాన ప్రిస్క్రిప్షన్లకు ఇది అవసరమైన ముందస్తు ప్రక్రియ అని పేర్కొన్నాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో సహ మోదీ, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అప్పట్లో ఇండి కూటమి పై విమర్శలు గుప్పించారు. ‘‘బటేంగే తో కటేంగే’’ తో నినాదాన్ని ముందుకు తెచ్చారు కూడా.
ప్రతిపక్షానికి అవకాశం..
రాజ్యాంగాన్ని కాపాడండి అనే తాము చేసిన నినాదం, కులగణన కోసం చేసిన తీవ్ర ఒత్తిడి 2024 ఎన్నికల్లో మోదీకి కేవలం 239 సీట్లు రావడానికి కారణమైందని ప్రతిపక్షం బలంగా విశ్వసిస్తోంది.
లోక్ సభ ఫలితాల తరువాత కూడా అధికార పార్టీ బలంగా కులగణను వ్యతిరేకిస్తూనే ఉంది. రాహుల్ గాంధీ లోక్ సభలో ఈ విషయం ప్రస్తావించారు.
దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడిని ఎగతాళి చేశారు. ‘‘తమ కులం తెలియని వారు. ఇతరుల కులాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్లమెంటరీ రికార్డుల నుంచి ఈ వ్యాఖ్యలు తొలగించారు.
ఇప్పుడు కాషాయదళం దీనిని తన విజయాలలో ఒకటిగా చెప్పుకోవడానికి అన్నింటిని సిద్దం చేస్తోంది. కేంద్ర సమాచార, ప్రసారమంత్రి అశ్విని వైష్ణవ్ సీసీపీఏ నిర్ణయాన్ని ప్రకటించిన విధానంలో ఇది స్పష్టంగా కనిపించింది.
‘‘ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కులగణను కేవలం ఒక రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయి’’ అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత ఈ చర్య సమాజం, దేశం విలువలు, ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాయని నిరూపిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ కు కఠిన పరీక్షే..
బీజేపీ తన కథనాన్ని అట్టడుగు వర్గాలకు చేరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రతిపక్షాల ఒత్తిడిలకు తలొగ్గి తీసుకున్న నిర్ణయం కాదు.. కేవలం సీసీపీఏ సామాజిక న్యాయంకోసం తీసుకున్న ఒక దూకుడైన, సాహసోపేత చర్యగా ప్రచారం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు మోదీ ప్రచార శైలిని అర్థం చేసుకుని, ఆయన వేగాన్ని అందుకోవడం చాలాకష్టం. ఇప్పడు వారి ముందున్న లక్ష్యం ఒకటే. కులగణన మా పార్టీ చేసిన పోరాటం మేరకు తీసుకున్నారని చెప్పడం.
2023 నుంచి జరుగుతున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల ముందు నుంచి పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇది ప్రస్తావిస్తోంది. లాలూ, తేజస్వీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ వంటి ఇండి కూటమి పార్టీలు కూడా కులగణనకు మద్దతు తెలిపాయి.
కులగణన ప్రభావం తగ్గగానే..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ప్రభుత్వం ప్రతిస్పందన దేశం మొత్తం దృష్టి సారించిన సమయంలో సీసీపీఏ ఊహించని చర్య ప్రతిపక్షాల కుల గణన ప్రచారాన్ని దెబ్బతీస్తుందని ప్రతిపక్ష వర్గాలన్నీ అంగీకరిస్తున్నాయి.
‘‘మనం వాదనను తిరిగి ఆవిష్కరించి, ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం కులగణనను అంగీకరించాల్సి వచ్చిందని ప్రజలను ఒప్పించాలి. కులగణన కాలక్రమం, ఏ విధంగా సేకరిస్తారో ప్రభుత్వాన్ని అడగుతూనే ఉండాలి.
ఆర్థిక వ్యవస్థ స్థితి, నిరుద్యోగం, కేంద్ర హోంమంత్రిత్వశాఖ పర్యవేక్షణలో పహల్గామ్ లో జరిగిన భద్రతా లోపం వంటి వివిధ రంగాలలో దాని వైఫల్యాల నుంచి దృష్టిమరల్చడానికి పదాలు తప్ప మరేమీ కాదని ప్రజలను ఒప్పించాలి’’ అని బీహార్ కు చెందిన ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బీజేపీపై ఒత్తిడి తీసుకురావచ్చని నిరూపించాము అని ఆయన అన్నారు. రాహుల్ కేంద్రం ముందు నాలుగు స్పష్టమైన డిమాండ్లను పెట్టారు. అదేసమయంలో జనాభా లెక్కల్లో కులగణనకు ప్రభుత్వం అనుమతి పూర్తిగా సమర్థిస్తున్నామన్నారు.
నాలుగు డిమాండ్లు పెట్టిన రాహుల్..
కులగణన పూర్తి కావడానికి స్పష్టమైన కాలక్రమం ఇవ్వాలని, కులగణన కోసం అనుసరించాల్సిన ‘‘నమూనా, బ్లూప్రింట్ ’’ వివరాలు తెలియజేయాలని కుల ఆధారిత రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఆదేశించిన 50 శాతం రిజర్వేషన్లు పరిమితిని తొలగించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
లోక్ సభ లో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ కులగణనను అమలు చేయడానికి బ్లూప్రింట్ కోసం కేంద్రానికి ఇన్ పుట్ లను అందించడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. దేశంలో కులగణనకు ప్రస్తుతం రెండు నమూనాలు ఉన్నాయని, ఒకటి ఎన్డీఏ పాలిత బీహార్, మరొకటి కాంగ్రెస్ పాలిత తెలంగాణ అన్నారు.
బిహార్ లో బ్యూరోక్రాటిక్ జనాభా గణన అని, రెండోది ప్రజల జనాభా గణనను ప్రతిబింబిస్తుందని రాహుల్ అన్నారు.
నితిష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)- ఆర్జేడీ సంకీర్ణంలో కాంగ్రెస్ భాగంగా ఉన్నప్పుడూ ఆసక్తికరంగా నియమించబడి పూర్తి చేయబడిన బీహార్ కుల సర్వేపై రాహుల్ విమర్శలు చేశారు. దాని ప్రచురణ పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ తెగల సామాజిక ఆర్ధిక స్థితిని స్పష్టంగా మెరుగుపరచడానికి ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనికి విరుద్దంగా బహిరంగ ప్రజా సంప్రదింపుల ద్వారా అందుకున్న ఇన్ పుట్ ల ఆధారంగా తెలంగాణ కుల సర్వే నమూనా, చారిత్రాత్మకంగా వెనకబడిన, అణగారిన వర్గాలకు వనరులు, అధికారంలో ఎక్కువ వాటాను నిర్ధారించడానికి మరింత ఎక్కువ కసరత్తు అసరమని రాహుల్ విశ్వసిస్తున్నారు.
తెలంగాణ మోడల్..
తెలంగాణ కుల సర్వే నమూనాను కులగణనకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫార్మాట్ గా వారు భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలో వెనకబడిన కులాలు, ఎస్సీలు, ఎస్టీల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా అలాగే సామాజిక సంక్షేమ చర్యలకు బలమైన పునాది వేయాలని రాహుల్ కోరుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పెద్ద ప్రశ్న ఏమిటంటే కాంగ్రెస్ తన కులగణన అమ్మకాల పిచ్ లో బీజేపీని అధిగమించగలదా? . ముఖ్యంగా కేంద్ర ప్రకటనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ప్రతివాదనకు రాహుల్ నాయకత్వం వహించి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇండి కూటమి సభ్యులు సిద్దంగా ఉన్నారా? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.