ఆప్ ఓటమిపై మమ్మల్ని నిందించొద్దు: కాంగ్రెస్

వరుసగా మూడో సారి డకౌట్ అయిన ‘చేయి’ పార్టీ;

Update: 2025-02-08 11:41 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైంది. లోక్ సభ ఎన్నికల ముందు విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండి కూటమి.. ఇందులో ఐక్యంగా పోరాడటానికి విముఖత చూపడంతో బీజేపీ ఘన విజయం సాధించడానికి కారణమైంది. తాజా వస్తున్న ఫలితాల ప్రకారం బీజేపీ 49 స్థానాలు, ఆప్ 21 స్థానాలను గెలుకుంది. కాంగ్రెస్ వరుసగా మూడోసారి డకౌట్ అయి చరిత్ర సృష్టించింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. దానితో రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయాయి. ఇక ‘ఇండి’ కూటమి మనుగడ కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనిపై పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ మాట్లాడారు. ఆమె ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ఆప్ ఓటమిని కాంగ్రెస్ బాధ్యత కాదని అన్నారు.
ఢిల్లీ లో ఆప్ మద్దతుగా నిలిచే విషయంలో కాంగ్రెస్ నిరాకరించింది. ఇంతకుముందు గోవా, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్ లలో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాలేదని, తమ పార్టీ ఓటమికి ఆప్ సహకరించిందని ఆమె చెప్పారు. ఓట్లు చీలిపోవడానికి కారణం కేజ్రీవాల్ వైఖరే కారణమన్నారు. 1998 నుంచి 2013 వరకు తమ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉందని, ఇప్పుడు బలంగా ఢిల్లీలో పోరాడామని, అది మా బాధ్యత అన్నారు.
ఒకదాని తరువాత ఒకటి..
ఇటీవల కాలంలో ఇండి కూటమి సభ్యులు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకత్వంపై అవి పదునైన విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇండి బ్లాక్ నాయకత్వం విడిచిపెట్టాలని దాని ప్రధాన మిత్రపక్షాలైన ఆర్జేడీ, ఎన్సీ కోరగా, మమతా బెనర్జీ తాను సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇండి కూటమి 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటు అయింది. ఇది అంతకుముందు ఏడాది జూన్ లో నితీశ్ కుమార్ చొరవ తీసుకుని ఏర్పాటు చేశారు. తరువాత ఆయన దీన్ని విడిచిపెట్టి బీజేపీ కూటమిలో చేరారు. వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది.
తరువాత అది వరుసగా 13 రాష్ట్రాల్లో తన ప్రభావం చూపించింది. అలాగే గత ఏడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఇండి కూటమికి ఘోరమైన పరాజయాన్ని మిగిల్చాయి. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు సీట్ల పంపకంలో గొడవ పడ్డాయి. దీనితో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇది ఎన్నికలపై పడింది.
కాంగ్రెస్సే ఎందుకు త్యాగం చేయాలి
హర్యానాలో ఆప్ కేవలం 1.5 శాతం ఓట్లను సాధించింది. అయితే అది ప్రతి స్థానంలో నూ పోటీ చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహ్మద్ అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎల్లప్పుడు అందరి కోసం త్యాగం చేయాలి, కేజ్రీవాల్ హర్యానాలో త్యాగం చేసి ఉంటే.. ఢిల్లీ పరిస్థితి ఇలా ఉండేది కాదు’’ అన్నారు.
హర్యానా, ఉత్తరా ఖండ్ లలో ఇలాగే జరిగింది. హర్యానాలో 90 సీట్లు ఉంటే కాంగ్రెస్ 37 గెలుచుకుంది. కనీసం అరడజన్ సీట్లలో ఆప్ ఓట్లను చీల్చింది. ఉత్తరాఖండ్ లో బీజేపీకి 44.3 శాత ఓట్లు, కాంగ్రెస్ 37.9 శాతం, ఆప్ కు 4. 82 శాతం వచ్చాయి. గోవాలో వారు బీజేపీని ఓడించి ఉండకపోవచ్చు. కానీ మంచి పోటీని ఇచ్చారు . ఇక్కడ కాంగ్రెస్ కు 13.5 శాతం, ఆప్ కు 12. 8 , బీజేపీకి 40. 3 శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం కేజ్రీవాల్ ప్రవర్తనే కారణమని అధికార ప్రతినిధులు ఆరోపించారు.
కాంగ్రెస్ నిందలు ఎందుకు?
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కి మధ్య సయోధ్య ప్రయత్నాలు ఏ దశలోనూ సాగలేదు. ఇద్దరు ఇండి కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్, కేజ్రీవాల్ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకున్నారు. మద్యం కుంభకోణం, యుమునా నదీ కాలుష్యం పై కేజ్రీవాల్ లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్, బీజేపీ.. ఆప్ ను ఓడించడానికి కుమ్మక్కయ్యానని ఆరోపించారు. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ ఓటమికి తాము కారణం కాదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
ఒమర్ సెటైర్లు..
ఇండి కూటమి లో సభ్యుడు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి.. నేషనల్ కాన్పరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికలపై స్పందించారు. ‘‘ఔర్ లాడో ఆపాస్ మే’’ ( మీలో మీరు పోరాడుతూనే ఉండండి) అని సైటైరికల్ గా అన్నారు. గత సంవత్సరం జరిగిన జే అండ్ కే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్పరెన్స్ , కాంగ్రెస్ జతకట్టాయి. కానీ ఇందులో ఎన్సీ ఇందులో అత్యధిక సీట్లను గెలుచుకుంది.
Tags:    

Similar News